US Presidential Election 2024: తొలి డిబేట్ లో ట్రంప్ పైచేయి- బైడెన్ తో నో షేక్ హ్యాండ్..!

మరో నాలుగు నెలల్లో అమెరికా అధ్యక్ష ఎన్నికలు జరగబోతున్నాయి. మరోసారి అధ్యక్ష అభ్యర్ధులుగా జో బైడెన్, డొనాల్డ్ ట్రంప్ తలపడుతున్నారు. వీరిద్దరి మధ్య అమెరికా అధ్యక్ష ఎన్నికల డిబేట్లు ప్రారంభమయ్యాయి. క్లీవ్ ల్యాండ్ లో జరిగిన తొలి డిబేట్ వాడీవేడిగా సాగింది. ఇందులో బైడెన్, ట్రంప్ మధ్య వైరం మరోసారి బయటపడింది. డిబేట్ కు హాజరైన సందర్భంగా ఇద్దరూ షేక్ హ్యాండ్ ఇచ్చుకునేందుకు కూడా ఇష్టపడలేదు. అలాగే ఈ చర్చలో ట్రంప్ పైచేయి సాధించారు.

అమెరికా ప్రజాస్వామ్యం, ఆర్ధిక వ్యవస్థ, అధ్యక్షుల వయస్సు వంటి అంశాలపై ఈ డిబేట్ లో ట్రంప్, బైడెన్ మధ్య హాట్ హాట్ గా చర్చ జరిగింది. ప్రస్తుత అధ్యక్షుడు బైడెన్ ఈ మూడు అంశాల్లోనూ విఫలమయ్యారంటూ ట్రంప్ ఆరోపణలు గుప్పించారు. దీనికి తగిన జవాబు ఇవ్వడంలో బైడెన్ తడబడ్డారు. ఇమ్మిగ్రేషన్ తో పాటు ఆర్ధిక వ్యవస్థను నిలబెట్టడంలో బైడెన్ వైఫల్యాలను ట్రంప్ పదే పదే ప్రస్తావించి ఇరుకునపెట్టారు.

Trump vs Biden First Presidential Debate over Economy Democracy And Age

మరోవైపు నవంబర్ 5న వెలువడే ఈసారి అధ్యక్ష ఫలితాలను గౌరవిస్తారా అన్న బైడెన్ ప్రశ్నను దాటవేసేందుకు ట్రంప్ ప్రయత్నించారు. దీనికి కౌంటర్ గా 2020లో జరిగిన అధ్యక్ష ఎన్నికల్లో రిగ్గింగ్ జరిగిందని ఆరోపించారు. అంతే కాదు ఆ ఎన్నికల్లో బైడెన్ విజయంపై సందేహాలు వ్యక్తం చేశారు. దీన్ని బైడెన్ ఖండించారు. ట్రంప్ ఆరోపణలన్నీ హాస్యాస్పదంగా ఉన్నాయన్నారు.

అలాగే అధ్యక్షుడి వయస్సుపై జరిగిన చర్చలో తాను వయస్సు పరీక్షల్లో పాల్గొన్నట్లు చెప్పిన ట్రంప్.. బైడెన్ కూడా పాల్గొంటే చూడాలనుకుంటున్నట్లు తెలిపారు. దీనిపై స్పందించిన బైడెన్.. ట్రంప్ తన కంటే వయస్సులో మూడేళ్ల చిన్న వాడని కానీ అంత సమర్ధుడు కాదంటూ సమాధానం ఇచ్చారు. గత ట్రంప్ పాలనకూ, తన ప్రభుత్వానికీ మధ్య వ్యత్యాసం గమనించాలని ఓటర్లను బైడెన్ కోరారు. ఇలా పలు అంశాలపై సాగిన డిబేట్ లో ట్రంప్ కాస్త పైచేయి సాధించినట్లు తెలుస్తోంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+