చైనా కు ట్రంప్ షాక్: డ్రాగన్‌కు ఇంధన గండం!
అంతర్జాతీయ రాజకీయ చదరంగంలో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఆడుతున్న 'మైండ్ గేమ్' ఇప్పుడు బీజింగ్ గుండెల్లో రైళ్లు పరిగెత్తిస్తోంది. కేవలం రెండు నెలల స్వల్ప వ్యవధిలో, చైనాకు అత్యంత సన్నిహితమైన ఇద్దరు 'చమురు మిత్రుల'ను ట్రంప్ లక్ష్యంగా చేసుకున్నారు. ఇది కేవలం దౌత్యపరమైన దెబ్బ మాత్రమే కాదు.. చైనా ఆర్థిక వ్యవస్థను నడిపించే ఇంధన సరఫరా గొలుసుపై వేసిన పెను వేటు.
జనవరిలో వెనిజులా అధ్యక్షుడు నికోలస్ మదురోను అమెరికా తన అదుపులోకి తీసుకోవడం ఒక సంచలనమైతే, ఫిబ్రవరి చివరలో ఇరాన్ సుప్రీం లీడర్ అలీ ఖమేనీ మరణం చైనాను కోలుకోలేని దెబ్బ కొట్టింది. దక్షిణామెరికాలో ఒకరు, మధ్యప్రాచ్యంలో మరొకరు.. చైనాకు వెన్నుముకలా నిలిచే ఈ ఇద్దరు భాగస్వాములను కోల్పోవడంతో డ్రాగన్ దేశం ఇప్పుడు దిక్కుతోచని స్థితిలో పడింది.

లెక్కలు తేల్చిన 'క్ప్లెర్' (Kpler)
చైనాకు అందే ముడి చమురులో దాదాపు 15 శాతం ఈ రెండు దేశాల నుంచే వస్తుంది. డేటా అనలిటిక్స్ సంస్థ 'క్ప్లెర్' ప్రకారం.. వెనిజులా ఎగుమతి చేసే చమురులో సగానికి పైగా, ఇరాన్ పంపే చమురులో దాదాపు మొత్తం చైనాకే చేరుతుంది. ఇప్పుడు ఈ సరఫరా మార్గాలన్నీ అమెరికా కబంధ హస్తాల్లోకి వెళ్లడంతో, బీజింగ్ ఇంధన ఆకలిని తీర్చే మార్గం మూసుకుపోయింది.
ఆర్థిక వ్యవస్థకు ఆక్సిజన్ కట్!
టార్టాయిస్ క్యాపిటల్ పోర్ట్‌ఫోలియో మేనేజర్ రాబ్ థమ్మల్ విశ్లేషణ ప్రకారం, ఈ సంక్షోభంలో చైనా ప్రధాన బాధితురాలు. "చైనా తన అవసరాలకు సరిపడా చమురును ఉత్పత్తి చేసుకోలేదు. ధరలు పెరిగితే ఆర్థిక వృద్ధి తగ్గుతుంది కానీ, అసలు చమురు సరఫరానే నిలిచిపోతే ఆ దేశ యంత్రం మొత్తం ఆగిపోతుంది" అని ఆయన హెచ్చరించారు. భౌతిక సరఫరా దెబ్బతినడం అంటే చైనా ఆర్థిక వ్యవస్థకు అందుతున్న ఆక్సిజన్‌ను కట్ చేయడమే.

డ్రాగన్ ఆగ్రహం: 'ఇది ఆమోదయోగ్యం కాదు'
ఈ పరిణామాలపై చైనా విదేశాంగ మంత్రి వాంగ్ యీ నిప్పులు చెరిగారు. ఇరాన్‌పై అమెరికా-ఇజ్రాయెల్ జరిపిన దాడులను "బరితెగించిన చర్య"గా ఆయన అభివర్ణించారు. "ఒక సార్వభౌమ దేశ నాయకుడిని హత్య చేయడం, పాలన మార్పు కోసం రెచ్చగొట్టడం ఏమాత్రం ఆమోదయోగ్యం కాదు" అంటూ అంతర్జాతీయ వేదికలపై బీజింగ్ తన నిరసనను గొంతు చించుకుని చెబుతోంది. కానీ, అమెరికా వ్యూహాల ముందు చైనా కేకలు అరణ్య రోదనగానే మిగిలిపోతున్నాయి.
-
ట్రంప్ ఫోన్లు ఎత్తని ఇరాన్ ? ముందుకెళ్లని చర్చలకు 3 కారణాలు..! -
కదనరంగంలో కాలు పెట్టిన అమెరికా మెరైన్ మెరికలు- ఇరాన్ యుద్ధం తీవ్రం -
మోదీ-ట్రంప్ వార్ ఫోన్ కాల్ మధ్యలో మస్క్- షాకింగ్ ట్విస్ట్ -
భారత్‌కు ఇరాన్ బంపరాఫర్!.. ప్రధాని మోదీ మాస్టర్ ప్లాన్! -
సాక్షాత్ FBI చీఫ్ కే దిక్కులేదు- ఇరాన్ హ్యాకర్ల పంజా -
LPG పై కేంద్రం మరో గుడ్ న్యూస్ -రాష్ట్రాలకు లేఖలు..! -
భారత్‌లోకి " పైప్డ్ " గ్యాస్ ఎక్కడి నుండి వస్తుంది? ఇది కూడా అయిపోతుందా?? -
యుద్ధం వేళ మోదీ చాణక్యం.. కర్ర విరక్కుండా.. పాము చావకుండా..! -
దేశంలో పెట్రోల్, గ్యాస్ స్టాక్.. రెండు నెలలే -
మళ్ళీ లాక్డౌన్? కేంద్రం సంచలన ప్రకటన -
PM Modi: సీఎంలకు మోడీ సందేశం ఇదే..! మళ్లీ ఆ కోవిడ్ మోడల్..! -
పెట్రోల్, గ్యాస్ సంక్షోభం తీవ్రం- కేంద్రమంత్రులతో ప్రత్యేకంగా కమిటీ ఏర్పాటు












Click it and Unblock the Notifications