Elon Musk: అచ్చొచ్చిన ఆ అక్షరం: ట్విట్టర్‌పైనే ట్విట్టర్ కొత్త బాస్ ట్రోల్స్: భావ ప్రకటన స్వేచ్ఛగా
వాషింగ్టన్: సోషల్ మీడియా దిగ్గజం, టాప్ మైక్రోబ్లాగింగ్ ప్లాట్‌ఫామ్.. ట్విట్టర్ కొనుగోలు వ్యవహారం ముగిసింది. ప్రైవేట్ అంతరిక్ష పరిశోధనా సంస్థ స్పేస్‌ఎక్స్, ఎలక్ట్రికల్ వెహికల్స్ తయారీ కంపెనీ టెస్లా అధినేత ఎలాన్ మస్క్ చేతికి వెళ్లింది. ట్విట్టర్‌ను ఎలాన్ మస్క్ కొనుగోలు చేశారు. ఇప్పుడాయన ట్విట్టర్‌కూ కొత్త అధిపతి అయ్యారు. దీనికోసం ఎలాన్ మస్క్ ఇచ్చిన ఆఫర్ విలువ 44 బిలియన్ డాలర్లు. ఇప్పుడున్న ట్విట్టర్ యాజమాన్యానికి ఎలాన్ మస్క్ చెల్లించిన మొత్తం ఇది. మూడు నెలల వ్యవధిలో ఈ బదలాయింపు ప్రక్రియ పూర్తవుతుంది.
పోటెత్తిన ట్వీట్స్..
ట్విట్టర్‌ను ఎలాన్ మస్క్‌కు విక్రయించే ప్రక్రియ ఆరంభమైందని తెలియగానే ట్విట్టరెటీస్, నెటిజన్స్ భారీగా స్పందించారు. భిన్నాభిప్రాయాలను వ్యక్తం చేస్తోన్నారు. ట్రోల్స్ మొదలు పెట్టారు. ట్విట్టర్‌పైనే ట్విట్టర్ కొత్త బాస్‌పై మెమెస్ సృష్టించి, పోస్ట్ చేస్తోన్నారు. కొన్ని గంటల వ్యవధిలోనే వేలాది ట్వీట్లు పడ్డాయి. #twittersold అనే హ్యాష్ ట్యాగ్ ట్రెండింగ్ అవుతోంది. ఈ హ్యాష్ ట్యాగ్‌తో ట్విట్టర్ షేక్ అవుతోంది. విభిన్న రకాల ట్వీట్లతో పోటెత్తుతోంది.
అచ్చొచ్చిన ఆ అక్షరం..
ఎలాన్ మస్క్‌కు T అనే అక్షరం బాగా అచ్చొచ్చినట్టయిందంటూ కామెంట్స్ చేస్తోన్నారు ట్విట్టరెటీస్. టెస్లా, ట్విట్టర్.. ఇలా తన కొత్త కంపెనీల అన్వేషణను మస్క్ ప్రారంభించినట్లు చెబుతున్నారు. ట్విట్టర్ లైక్ సింబల్‌ను టెస్లా టీగా మార్చేశారంటూ వ్యాఖ్యానిస్తోన్నారు. భవిష్యత్‌లో ట్విట్టర్‌లో ఎలాంటి మార్పులు చేర్పులు చోటు చేసుకుంటాయనేది ఆసక్తిగా మారిందని, వాటి కోసం ఈ క్షణం నుంచి ఎదురు చూస్తున్నామంటూ పలువురు ట్విట్టరెటీస్ స్పందిస్తున్నారు.
భావ ప్రకటన స్వేచ్ఛ ఉంటుందా?
ట్విట్టర్‌ను భావ ప్రకటన స్వేచ్ఛ ప్లాట్‌ఫామ్‌గా తీర్చిదిద్దుతానంటూ ఎలాన్ మస్క్ చేసిన ప్రకటనపైనా భిన్నాభిప్రాయాలు వ్యక్తమౌతున్నాయి. ఇకపై లిబరల్స్ కన్నీరు పెట్టుకోవాల్సి ఉంటుందంటూ కొందరు నెటిజన్లు వ్యాఖ్యానిస్తున్నారు. భావ ప్రకటన స్వేచ్ఛకు కళ్లెం పడుతుందని జోస్యం చెబుతున్నారు. ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ పేరుతో ఆ స్వేచ్ఛ లేకుండా చేస్తారంటూ అనుమానాలను వెలిబుచ్చుతున్నారు. ట్విట్టర్ పిట్ట గొంతు నులిమే ప్రయత్నం చేస్తారంటూ ట్రోల్స్ చేస్తున్నారు.
స్వేచ్ఛగా డిబేట్స్..
ట్విట్టర్ నుంచి అధికారిక ప్రకటన వెలువడిన వెంటనే ఎలాన్ మస్క్ ఓ ప్రకటన విడుదల చేశారు. భావ ప్రకటన స్వేచ్ఛకు అనుకూలంగా ట్విట్టర్‌ను తీర్చిదిద్దుతానని స్పష్టం చేశారు. ప్రజాస్వామ్యానికి భావ ప్రకటన స్వేచ్ఛ అనేది పునాదిలాంటిదనే విషయాన్ని తాను బలంగా విశ్వసిస్తానని వ్యాఖ్యానించారు. ఇందులో ఎన్నో సరికొత్త ఫీచర్లను తీసుకొస్తానని చెప్పారు. ఇకపై డిజిటల్ టౌన్ స్క్వేర్‌గా ట్విట్టర్ మారుతుందని తేల్చి చెప్పారు. భావ ప్రకటన, మానవత్వంపై స్వేచ్ఛగా డిబేట్స్ జరిగేలా దీన్ని తీర్చిదిద్దుతానని అన్నారు.
44 బిలియన్లకు డీల్ ఓకే..
ఈ సోషల్ మీడియా జెయింట్ ప్లాట్‌ఫామ్‌ను కొనుగోలు చేయడానికి మొదట్లో ఎలాన్ మస్క్ ఇచ్చిన ఆఫర్- 46.5 బిలియన్ డాలర్లు. డీల్ కుదిరే సమయానికి రెండున్నర బిలియన్ డాలర్ల మొత్తం తగ్గింది. 44 బిలియన్ డాలర్లతో ఈ డీల్ ఓకే అయింది. ఈ టేకోవర్ వ్యవహారంతో ట్విట్టర్ షేర్ హోల్డర్ల పంట పండినట్టే. ఒక్కో షేర్‌కు 54.20 డాలర్లను ఎలాన్ మస్క్ చెల్లిస్తారు. ఈ విషయాన్ని ఆయన ఇదివరకే ప్రకటించారు. దీన్ని ఈ ఒప్పందంలోనూ పొందుపరిచారు.












Click it and Unblock the Notifications