దొంగతనం: అర్ధరాత్రి పోలీసులపైకి కాల్పులు... పరిస్ధితి విషమం

న్యూయార్క్: సోమవారం రాత్రి ఇద్దరు న్యూయార్క్ పోలీసులను దుండగులు కాల్చారు. ఈ సంఘటన న్యూయార్క్ పట్టణంలోని బ్రోంక్స్‌లో జరిగింది. వివరాల్లోకి వెళితే బ్రోంక్స్‌లోని టైబౌట్ అవెన్యూలోని 184 స్ట్రీట్‌లో రాత్రి 10.30 నిమిషాల ప్రాంతంలో దొంగతానికి వచ్చిన ఇద్దరు దొంగలను పట్టుకునేందుకు ప్రయత్నించగా, వారిపై ఎదురు దాడికి దిగిన దొంగలు డ్యూటీలో ఉన్న పోలీసులపై కాల్పులు జరిపారు.

పాఠకుల కోసం ఫేస్‌బుక్ ద్వారా ఎప్పటికప్పుడు తాజా వార్తలు... లైక్ చేయండి.

ఈ ఘటనలో గాయపడిని ఇద్దరు పోలీసులను సమీపంలోని సెయింట్. బర్నాబాస్ ఆసుపత్రికి తరలించారు. ఒక పోలీసు అధికారికి మోచేయి కింద భాగంలో గాయం అవ్వగా, మరో ఆఫీసర్‌ వీపు వెనుక భాగంలో తీవ్రంగా గాయపడ్డాడు. ప్రస్తుతం వీరిద్దరికి ఇంటెన్సివ్ కేర్ ద్వారా ఆపరేషన్ నిర్వహిస్తున్నట్లు పోలీసులు తెలిపారు.

 Two New York City Police Officers Shot in the Bronx

హెలికాప్టర్ ద్వారా పెట్రోలింగ్ నిర్వహిస్తున్న పోలీసులు ఈ షూటింగ్ సీన్ మొత్తం చూసి విచారణకు ఆదేశించారు. ఎమిలీ రామ్స్ (29) చెప్పిన దాని ప్రకారం సుమారుగా రాత్రి 10.30 గంటల ప్రాంతంలో పెద్ద శబ్దం వచ్చిందని పోలీసులకు తెలిపారు.

రెండు గన్నుల పేలిన శబ్దం వచ్చిందని 47 ఏళ్ల బెర్నార్డ్ ఆరియాస్ తెలిపారు. రెండు వారాల క్రితం పెట్రోలింగ్ నిర్వహిస్తున్న ఇద్దరు పోలీసు అధికారులను ఇదే విధంగా కాల్పులు జరిపారు. ఈ ఘటనలో గాయపడి మరణించిన ఆఫీసర్ వెన్‌జియాన్ లియు (32) అంత్యక్రియలు ఆదివారం నిర్వహించారు.

గత రెండు దశాబ్ధాలుగా పోలీసులు చేసిన ప్రయత్నాల వల్ల 80 శాతం ఉన్న క్రైం రేటుని 30 శాతానికి తగ్గించగలిగారు. కానీ, ఇప్పుడు పోలీసులపై వరుస దాడులకు పాల్పడతున్న దొంగలను ఎలాగైనా పట్టుకుంటామని, ఆ నిందితుల కోసం గాలింపు చర్యలు చేపట్టామని ఓ ఉన్నతాధికారి తెలిపారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+