మనసులు మలిపెట్టేలా-విమానం నుంచి జారిన ఆ ఇద్దరూ : ఆ తరువాత ఏం జరిగింది..!!

ఆగస్టు 15వ తేదీ నుంచి మన దేశంతో పాటుగా ప్రపంచ దేశాలన్నీ ఆఫ్ఘనిస్తాన్ లో జరుగుతున్న పరిణామాలను గమనిసస్తున్నాయి. సామాన్య ప్రజలు సైతం తాలిబన్ల ఆక్రమణ తరువాత అక్కడి సాధారణ ప్రజల కష్టాలను చూసి సానుభూతి వ్యక్తం చేస్తున్నారు. తాలిబన్లు కాబూల్ లోని ప్రవేశించి..ప్రభుత్వం తమ నియంత్రణలోకి తెచ్చుకున్న తరువాత అనేక విదారకమైన సన్నివేశాలు కనిపించాయి. తాలిబన్ల దెబ్బకు భయపడి దేశం విడిచి పారి పోయేందుకు విమానాశ్రయల్లో జనం పోటెత్తారు.

సాధారణ బస్టాండ్లు - రైల్వే స్టేషన్ల తరహాలో విమానాలు ఎక్కేందుకు పోటీ పడ్డారు. తోపులాట జరిగింది. సైన్యం కాల్పులకు దిగింది. అయినా..వాళ్లు మాత్రం ప్రాణ భయంతో విమానాలు పట్టుకొనే ముందుకు వెళ్లారు. ఆ సమయంలో ఇద్దరు వ్యక్తులు గాల్లో ఎగురుతున్న విమానం నుంచి జారి పడిన దృశ్యాలు అందరినీ కలవరపాటుకు గురి చేసాయి. ఆ ఇద్దరు అంత ఎత్తు నుంచి కిందకు పడటంతో ఏమయ్యారో...వారెవరె తెలియక ఆఫ్ఘన్ ప్రజలు మరింత ఆందోళనకు గురయ్యారు. ఇలా విమానం మీద నుంచి జారి పడి అఫ్ఘాన్‌లో ఇప్పటి వరకూ ముగ్గురు దుర్మరణం పాలయ్యారు.

Two people who fell from US aircraft traced:One is a Afghan football player

అందులో ఒకరు ఫుట్ బాల్ క్రీడాకారుడు జకీ అన్వర్ గా అఫ్ఘానిస్తాన్ క్రీడా విభాగం నిర్దారించింది. అన్ని దేశాల్లో వైరల్ గా మారిన ఆ వీడియోలో యూఎస్ ఎయిర్‌ఫోర్స్‌కు చెందిన సీ-17 విమానం మీద నుంచి ఇద్దరు పడిపోయారు. వారిద్దరూ కాబూల్ విమానాశ్రయానికి నాలుగు కిలోమీటర్ల దూరంలో నివసించే వలీ సాలెక్ అనే వ్యక్తి ఇంటిపై పడినట్లు తెలుస్తోంది. ఆ కుటుంబ సభ్యులు ఇంట్లోనే ఉన్న సమయంలో సడెన్‌గా ఏదో పెద్ద టైర్ బద్దలైనట్లు చప్పుడయిందని, ఇంటిపై ఏదో పడినట్లు అర్థమైందని వలీ చెప్పుకొచ్చారు.

ఇంటి పైకెళ్లి చూస్తే ఇద్దరు వ్యక్తులు కిందపడి ఉన్నట్లు కనిపించిందని వివరించారు. వారి తలలు పగిలి, శరీరాలు చిన్న చిన్న ముక్కలైపోయిన దృశ్యం అత్యంత భీతావహంగా ఉందని వలీ గుర్తుచేసుకున్నారు. ఈ దృశ్యాలు చూసిన వలీ భార్య అక్కడిక్కడే కళ్లు తిరిగి పడిపోయారు. ఆ తర్వాత తన పక్కింట్లో ఉండే వ్యక్తి టీవీలో కనిపించిన ఘోరం గురించి చెప్పడంతో అమెరికా విమానం నుంచి జారిపడిన వ్యక్తులు తన ఇంటిపై పడినట్లు వలీ గుర్తించారు. రెండు మృతదేహాలపై వస్త్రాలు కప్పి, దగ్గరలోని మసీదుకు వాటిని తరలించారు.

మరణించిన వారిలో ఒక వ్యక్తి వద్ద బర్త్ సర్టిఫికెట్ కూడా దొరికిందని, దాన్ని బట్టి మృతుడి పేరు సైఫుల్లా హోతక్ గా గుర్తించారు. అతను ఒక డాక్టర్. రెండో మృతుడి పేరు ఫిదా మహమ్మద్ గా నిర్దారణ అయింది. ఇప్పటికీ తాలిబన్లు పైకి శాంతి వచనాలు చెబుతన్నా...అభయం ఇస్తున్నా ప్రజలు మాత్రం వారిని నమ్మటం లేదు. ఇప్పటికే కొన్ని ప్రాంతాల్లో తాలిబన్లకు వ్యతిరేకంగా ప్రదర్శనలు జరుగుతున్నాయి. ఆప్ఘన్ ప్రభుత్వానికి చెందిన ఫండ్స్ ను అమెరికా ఫ్రీజ్ చేసింది. ఆఫ్ఘన్ లో పరిస్థితుల పైన ఐక్య రాజ్యసమితి ఎప్పటికప్పుడు సమీక్ష చేస్తోంది.

అయితే, భారత్ కు చెందిన వారిని పూర్తిగా స్వదేశానికి తరలించారు. ఇప్పటికీ అక్కడ పరిస్థితుల పైన అంతర్జాతీయంగా ఆందోళన వ్యక్తం అవుతోంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+