రష్యా దళాలు కదలట్లేదు-బ్రిటన్ రక్షణశాఖ-పుతిన్-జెలెన్ స్కీ చర్చలు ఇప్పుడే కాదన్న రష్యా
రష్యా-ఉక్రెయిన్ యుద్ధంపై ఇరుదేశాలతో పాటు ఈయూ దేశాలు, పశ్చిమ, నాటో దేశాల్లోనూ ఆసక్తి పెరుగుతోంది. ఈ యుద్ధం పరిణామాల్ని ఎప్పటికప్పుడు తెలుసుకుంటూ ఆయా దేశాలు దానికి అనుగుణంగా స్పందిస్తున్నాయి. ఇదే క్రమంలో బ్రిటన్ రక్షణ మంత్రిత్వశాఖ కూడా తన తాజా నివేదికలో ఉక్రెయిన్ యుద్ధంలో రష్యా దళాల పరిస్ధితి పై ప్రస్తావించింది.
బ్రిటన్ రక్షణ మంత్రిత్వ శాఖ తన నివేదికలో .. రష్యా దళాలు ఉక్రెయిన్ నౌకాశ్రయ నగరం మారియుపోల్‌ను వారాలపాటు బాంబుదాడులు, వీధి పోరాటాలు జరిగినప్పటికీ స్వాధీనం చేసుకోలేకపోయాయని పేర్కొంది. యూకే అధికారులు మాట్లాడుతూ, "భారీ పోరాటం ఉన్నప్పటికీ, ఉక్రేనియన్ దళాలు నగరాన్ని ఆక్రమించడానికి రష్యా ప్రయత్నాలను తిప్పికొడుతూనే ఉన్నాయన్నారు. అంతేకాకుండా, రష్యా దళాలు గత కొన్ని రోజుల్లో ఉక్రెయిన్‌లో ఇతర చోట్ల పరిమిత పురోగతిని మాత్రమే సాధించాయిని, ఎక్కువగా ఎక్కడికక్కడ నిలిచిపోయాయని తెలిపింది.

మరోవైపు ఉక్రెయిన్ సాయుధ దళాల జనరల్ స్టాఫ్ మాట్లాడుతూ, గత 24 గంటల్లో, ఉక్రెయిన్ దళాలు 9 కంటే ఎక్కువ శత్రు వైమానిక లక్ష్యాలను కూల్చివేసాయని తెలిపారు. ఉక్రెయిన్ వైమానిక దళం ఒక విమానం, 6 UAVలు, 2 హెలికాప్టర్లను కూల్చివేసిందని వెల్లడించారు. తాము కూల్చివేస్తున్న క్షిపణుల సంఖ్య క్రమంగా పెరుగుతోందన్నారు.
అటు రష్యా-ఉక్రెయిన్ మొదటి సారి యుద్ధ ఖైదీలను మార్పిడి చేసుకున్నాయి. రష్యాలోని మానవ హక్కుల కమిషనర్ టాట్యానా మోస్కల్కోవా వెల్లడించిన వివరాల ప్రకారం తొమ్మిది మంది రష్యన్ సైనికులు విడుదలయ్యారు.












Click it and Unblock the Notifications