ఇజ్రాయెల్ పై యాక్షన్ ? బ్రిటన్, కెనడా, ఫ్రాన్స్ వార్నింగ్..!

హమాస్ ఉగ్రవాదుల్ని సాకుగా చూపుతూ పాలస్తీనాలోని గాజా స్ట్రిప్ పై ఏళ్ల తరబడి దాడులు చేస్తున్న ఇజ్రాయెల్ ఇప్పుడు ఏకంగా దాన్ని స్వాధీనం చేసుకునే దిశగా అడుగులేస్తోంది. గాజాలో మరో కొత్త ఆపరేషన్ ప్రారంభిస్తామని, ఆ ప్రాంతాన్ని తమ నియంత్రణలో పెట్టుకుంటామని ఇజ్రాయెల్ ప్రధాని నెతన్యాహూ చేసిన వ్యాఖ్యలపై ఐరోపా దేశాలు తీవ్రంగా స్పందించాయి. బ్రిటన్, ఫ్రాన్స్ తో పాటు కెనడా కూడా ఇజ్రాయెల్ పై చర్యలకు సిద్దమని హెచ్చరించాయి.

గాజాకు అందే సాయంపై ఆంక్షలు ఎత్తివేసి, ఆ ప్రాంతంపై కొత్త ఆపరేషన్ ఆపకపోతే ఇజ్రాయెల్ పై చర్యలు తప్పవని బ్రిటన్, ఫ్రాన్స్, కెనడా ప్రభుత్వాధినేతలు హెచ్చరించారు. తద్వారా గాజాలో కొత్త ఆపరేషన్ కు సిద్ధమవుతున్న ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహూపై ఒత్తిడి పెంచారు. ఇజ్రాయెల్ తాజా చర్యలతో గాజాలో కరువు తాండవిస్తుందని అంతర్జాతీయ నిపుణులు హెచ్చరికలు చేస్తున్నారు.

UK France Canada warns Israel for action against new Gaza operation

ఇజ్రాయెల్ ప్రభుత్వం గాజాకు మానవతా సాయం అందకుండా అడ్టుకోవడం ఆమోదయోగ్యం కాదని, అంతర్జాతీయ మానవతా చట్టాల ఉల్లంఘనే అని బ్రిటన్ ప్రభుత్వం తెలిపింది. వెస్ట్ బ్యాంక్ లో భవిష్యత్తులో జరిగే సెటిల్ మెంట్లకు అంగీకరించేది లేదని వెల్లడించింది. ఇజ్రాయెల్ తీరు మార్చుకోకపోతే ఆ దేశంపై తదుపరి చర్యలకు దిగుతామని, ఇందులో ఆంక్షలు కూడా ఉంటాయని బ్రిటన్ తెలిపింది.

2023 అక్టోబర్ లో ఇజ్రాయెల్ పై దాడి సందర్భంగా ఎత్తుకుపోయిన వారిని హమాస్ చెర నుంచి విడిపించేందుకు ఇజ్రాయెల్ గాజాలోకి ఆహారం, వైద్యసదుపాయాలు, చమురు సరఫరా అందకుండా చేస్తోంది. దీంతో అక్కడ ఉన్న వేలాది మంది పౌరులు, చిన్న పిల్లలు మృత్యువాత పడుతున్నారు. దీనిపై ఐరాస సహా పలు దేశాలు హెచ్చరికలు జారీ చేస్తున్నా అమెరికా అండతో ఇజ్రాయెల్ మాత్రం పట్టించుకోవడం లేదు.

Take a Poll

ఉగ్రవాదం నుండి తమ ప్రజలను రక్షించుకునే ఇజ్రాయెల్ హక్కును తాము ఎల్లప్పుడూ సమర్థిస్తున్నామని బ్రిటన్, కెనడా, ఫ్రాన్స్ నేతలు తెలిపారు. కానీ ఈ తీవ్రత మాత్రం పూర్తిగా అసాధారణమైనదని తెలిపారు. నెతన్యాహు ప్రభుత్వం ఈ దారుణమైన చర్యలన పూర్తి చేసే వరకూ తాము వేచి చూడబోమని మూడు దేశాలూ హెచ్చరించాయి. గాజాలో తక్షణ కాల్పుల విరమణ కోసం అమెరికా, ఖతార్, ఈజిప్ట్ చేస్తున్న ప్రయత్నాలకు బ్రిటన్, ఫ్రాన్స్, కెనడా మద్దతు ప్రకటించాయి. రెండు దేశాల పరిష్కారాన్ని సాధించడంతో పాటు స్వతంత్ర పాలస్తీనా రాజ్యాన్ని గుర్తించడానికి తాము కట్టుబడి ఉన్నామని చెప్పాయి.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+