వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

నేడు యూకే ఇండియా వీక్ 2022 ప్రారంభం- ఇరుదేశాల మధ్య స్వేచ్ఛావాణిజ్య ఒప్పందమే లక్ష్యం

|
Google Oneindia TeluguNews

భారత్-యూకే మధ్య వాణిజ్యాన్ని రెట్టింపు చేసే లక్ష్యంతో ఇవాళ యూకే-ఇండియా వీక్ 2022 మెగా ఈవెంట్ ప్రారంభం కానుంది. ఐదు రోజుల పాటు జరిగే ఈ ఈవెంట్ లో ఇరుదేశాల మధ్య స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందం కుదరబోతోంది. దీంతో బ్రిటన్ నుంచి భారత్ కు ఎగుమతులు రెట్టింపు కాబోతున్నాయి. ఈ మెగా కార్యక్రమానికి బ్రిటన్ ఆర్ధికమంత్రి రుషీ సునక్, భారత విదేశాంగమంత్రి జైశంకర్ తో పాటు పలువురు ప్రముఖులు హాజరవుతున్నారు.

యూకే-ఇండియా వీక్ 2022

యూకే-ఇండియా వీక్ 2022

భారత్-బ్రిటన్ మధ్య కీలక దశలో ఉన్న ద్వైపాక్షిక సంబంధాలను శిఖరాగ్రానికి చేర్చే లక్ష్యంతో ఇండియా గ్లోబల్ ఫోరమ్ (IGF) ప్రతి సంవత్సరం UK-ఇండియా వారాన్ని నిర్వహిస్తుంది. ఈ ఏడాది యూకే-ఇండియా వీక్ ఇవాళ లండన్ లో ప్రారంభం కానుంది. ఇవాళ్టి నుంచి జూలై 1 వరకూ ఐదు రోజుల పాటు ఇరుదేశాల మధ్య వాణిజ్య సంబంధాలను బలోపేతం చేసేలా పలు కార్యక్రమాలు నిర్వహిస్తారు. ఇందులో ఈ ఏడాది స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందం కుదుర్చుకునే దిశగా ఇరుదేశాలూ అడుగులేస్తున్నాయి. ఈ ఏడాది దీపావళి నాటికి ఈ ఒప్పందంకుదురుతుందని అంచనా వేస్తున్నారు.

స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందం

స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందం

అధికారిక అంచనాల ప్రకారం, స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందం వల్ల భారతదేశానికి యూకే ఎగుమతులను దాదాపు రెండింతలు చేస్తుందని, రెండు ఆర్థిక వ్యవస్థలలో ఉద్యోగాలను భారీగా పెంచుతుందని భావిస్తున్నారు. ఈ ఒక్క వాణిజ్య ఒప్పందం 2035 నాటికి బ్రిటన్ యొక్క మొత్తం వాణిజ్యాన్ని సంవత్సరానికి 28 బిలియన్ల యూరోల వరకు పెంచుతుందని, యునైటెడ్ కింగ్‌డమ్‌లోని వివిధ ప్రాంతాలలో 3 బిలియన్ల యూరోల వేతనాలను పెంచుతుందని భావిస్తున్నారు.

యూకే-భారత్ భాగస్వామ్యం కేవలం వాణిజ్యం, ఆర్థిక మార్పిడికి మాత్రమే కాకుండా మరియు జీవితంలోని ప్రతి రంగాన్ని తాకింది. సాంస్కృతిక, సృజనాత్మకత నుంచి వాతావరణ చర్యలు, ఆరోగ్య సంరక్షణ, సాంకేతికత, ఆవిష్కరణ, శక్తివంతమైన భారతీయులతో కీలకమైన రంగాలలో సహకారం వరకు అన్ని రంగాలకూ విస్తరించింది.

యూకేలోని ఓ కీలక గ్రూప్ ఈ బంధానికి వారధిగా పనిచేస్తోంది. యూకే-ఇండియా వీక్ 2022 75 సంవత్సరాల ద్వైపాక్షిక సంబరాలను జరుపుకుంటూ ఈ విజయవంతమైన భాగస్వామ్య స్థాయి, బహుముఖ అంశాలను స్పశించేలా Reimagine75గా థీమ్ చేశారు.

 కీలక అతిథులు వీరే

కీలక అతిథులు వీరే

బ్రిటన్ ఆర్ధిక మంత్రి రిషి సునక్, భారత విదేశాంగమంత్రి డాక్టర్ ఎస్ జైశంకర్, యూకే ప్రభుత్వ ఆరోగ్యం మరియు సామాజిక సంరక్షణ రాష్ట్ర కార్యదర్శి సాజిద్ జావిద్, భారత ఆరోగ్యమంత్రి డాక్టర్ మన్సుఖ్ మాండవియా, భారత విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్, కార్మిక మంత్రి భూపేందర్ యాదవ్, ఐటీ మంత్రి డాక్టర్ రాజీవ్ చంద్రశేఖర్, విదేశాంగశాఖ శాక సహాయ మంత్రి అర్జున్ రామ్ మేఘ్వాల్ తో పాటు పలువురు ఇరుదేశాల మంత్రులు, ఎంపీలు, పలు కీలక కంపెనీల సీఈవోలు ఈ కార్యక్రమాలకు హాజరవుతున్నారు. దీంతో భారత్-బ్రిటన్ మధ్య జరిగే ఈ వాణిజ్య ఒప్పందంపై ఇరుదేశాల్లో భారీ అంచనాలున్నాయి.

English summary
UK-India Week 2022, aiming for free trade agreement between two countries will begin today.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X