ఉక్రెయిన్ లో నౌకపై భీకర దాడి.. నలుగురు భారతీయులు మృతి..!
ఉక్రెయిన్- రష్యా మధ్య మరోసారి ఉద్రిక్తతలు తీవ్రం అవుతున్నాయి. ఉక్రెయిన్ ఒడెసా పోర్టులోని 'ఎంవీ గోల్డెన్ లియో' కార్గో అనే నౌకలో జూలై 19న సాయంత్రం రష్యా జరిపిన దాడిలో 10 మంది ప్రాణాలు కోల్పోయారు. వీరిలో నలుగురు భారతీయులు ఉన్నారు. మరో భారతీయుడి ఆరోగ్యం విషమంగా ఉంది. ఈ దాడులను ఖండించిన విదేశాంగ మంత్రిత్వ శాఖ అమాయకులను లక్ష్యంగా చేసుకుని అటాక్స్ చేయడం సరికాదని పేర్కొంది. కాగా ఈ నెలలో ఇప్పటివరకు ఈ పోర్టుపై రష్యా జరిపిన దాడుల్లో 28 మంది ప్రాణాలు కోల్పోయారు.
ఈ దాడి సమయంలో ఒడెసా పోర్టులోని 'ఎంవీ గోల్డెన్ లియో' నౌకలో 17 మంది ఉన్నారు. వీరిలో ఐదుగురు భారతీయులు ఉన్నారు. "ఉక్రెయిన్ లోని బృందం ఈ పరిస్థితిని నిశితంగా మానిటరింగ్ చేస్తోంది. క్షతగాత్రులకు మెరుగైన సాయం అందించేందుకు అన్ని విధాల కృషి చేస్తున్నాం. అలాగే ప్రాణాలు కోల్పోయిన వారి కుటుంబాలకు సంతాపం తెలియజేస్తున్నాము" అని ఉక్రెయిన్ విదేశాంగ శాఖ పేర్కొంది. అయితే నలుగురు భారతీయుల మృతికి కారణమైన రష్యా దాడిని భారత ప్రభుత్వం తీవ్రంగా ఖండించింది.

వాణిజ్య పడవలను లక్ష్యంగా చేసుకోవడంతోపాటు.. పౌరులను చంపడం సమంజసం కాదని తెలిపింది. అలాంటి సమయంలో జల స్వేచ్ఛ రవాణా, వాణిజ్యంను నిలిపివేయాలని రష్యాను కోరింది. మరోవైపు ఉక్రెయిన్ రాజధాని కీవ్ నగరం లక్ష్యంగా రష్యా బలగాలు బాలిస్టిక్ క్షిపణులతో దాడులకు తెగబడ్డాయి. ఈ దాడులకు కీవ్ నగరం అట్టుడికిపోయింది. అటు రష్యాపై ఉక్రెయిన్ ప్రతీకార దాడులు చేసింది. రష్యా రాజధాని మాస్కో లక్ష్యంగా ఉక్రెయిన్ విరుచుకుపడింది. ఏకంగా 370 కు పైగా సూసైడ్ డ్రోన్ లతో విధ్వంసం సృష్టించింది.












Click it and Unblock the Notifications