రష్యాపై ఉక్రెయిన్ భీకర దాడులు.. 370 సూసైడ్ డ్రోన్ లతో విధ్వంసం..
రష్యా- ఉక్రెయిన్ మధ్య మరోసారి భీకర దాడులు జరుగుతున్నాయి. ఉక్రెయిన్ రాజధాని కీవ్ నగరం లక్ష్యంగా రష్యా బలగాలు బాలిస్టిక్ క్షిపణులతో దాడులకు తెగబడ్డాయి. ఈ దాడులకు కీవ్ నగరం అట్టుడికిపోతుంది. ఈ మిసైల్ దాడులకు భారీగా ఆస్తి నష్టం, ప్రాణ నష్టం వాటిల్లినట్లు తెలుస్తోంది. ఇక రష్యాపై ఉక్రెయిన్ ప్రతీకార దాడులు చేస్తోంది. రష్యా రాజధాని మాస్కో లక్ష్యంగా ఉక్రెయిన్ విరుచుకుపడుతోంది. ఏకంగా 370 కు పైగా సూసైడ్ డ్రోన్ లతో విధ్వంసం సృష్టిస్తోంది. దాంతో ఉక్రెయిన్- రష్యా మధ్య పరిస్థితి మరింత ఉద్రిక్తంగా మారింది.
ఉక్రెయిన్ చేపట్టిన దాడులకు రష్యా రాజధాని మాస్కోలో ఆకాశం మొత్తం పూర్తిగా బ్లాక్ రంగులోకి మారింది. దట్టమైన పొగ ఏర్పడింది. రష్యా మీడియా రిపోర్ట్స్ ప్రకారం ఉక్రెయిన్ దాడులకు మాస్కో నగరానికి 50 కిలోమీటర్ల దూరంలోని వైల్డ్ బెర్రీస్ లాజిస్టిక్స్ కాంప్లెక్స్ లో అలాగే నోగిస్క్ లోని ఆయిల్ డిపోలో పేలుళ్లు సంభవించాయి. ఈ దాడుల్లో ఏడుగురు మృతి చెందగా దాదాపు 51 మంది గాయపడినట్లు స్పష్టం అవుతోంది. ఉక్రెయిన్ దెబ్బకు మాస్కోలోని లాజిస్టిక్స్ ప్రాంతాలు, ఆయిల్ డిపో ప్రాంతాలు పూర్తిగా ధ్వంసం అయ్యాయి.
ఇక రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ ప్రభుత్వం ఈ దాడులను తీవ్రంగా ఖండించింది. ఈ దాడులు ఉగ్రవాద చర్యలుగా అభివర్ణించింది. మరోవైపు ఉక్రెయిన్.. రష్యాలోని మౌలిక సదుపాయాలపై దాడులకు పాల్పడుతోందని రష్యా స్టేట్ మీడియా ఆరోపణలు చేస్తోంది. అయితే ఈ వ్యాఖ్యలను ఉక్రెయిన్ రాజధాని కీవ్ తిప్పికొట్టింది. ఓవైపు ఉక్రెయిన్ తో యుద్ధం కొనసాగిస్తూనే మరోవైపు డ్రోన్ లు, ఇతర ఆయుధాలను రష్యా వేగంగా తయారు చేస్తోంది. ఇక రష్యా- ఉక్రెయిన్ యుద్ధం కారణంగా రష్యా ఆర్థిక వ్యవస్థ, సరఫరా విధానం తీవ్రమైన ఒత్తిడిని ఎదుర్కుంటున్నట్లు స్పష్టం అవుతోంది.

ఇదిలాఉంటే రష్యా వైమానిక దాడులను తిప్పి కొట్టేందుకు ఉక్రెయిన్ సైన్యం తీవ్రంగా శ్రమిస్తోంది. రష్యా ప్రయోగించిన 41 క్షిపణులలో 18 క్షిపణులను ఉక్రెయిన్ గగనతలంలోనే విజయవంతంగా కూల్చి వేసింది. అలాగే 108 రష్యన్ డ్రోన్ లను సైతం ఉక్రెయిన్ ఆర్మీ కూల్చేసినట్లు ఆ దేశం ప్రకటించింది.












Click it and Unblock the Notifications