వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

అమెరికా స్విచ్ వేస్తే ఇమ్రాన్ లైట్ ఆరింది-రష్యా సంచలన ఆరోపణ-ఉక్రెయిన్ వార్ తో లింక్

|
Google Oneindia TeluguNews

అంతర్జాతీయంగా రాజకీయాలు ఒక్కసారిగా వేడెక్కుతున్నాయి. ఉక్రెయిన్ పై రష్యా దండయాత్రతో మొదలైన ఈ అనిశ్చితి ఇప్పుడు పాకిస్తాన్, శ్రీలంక వంటి దేశాలకూ పాకింది. దీంతో ఏదో జరుగుతోందన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఇలాంటి నేపథ్యంలో తాజాగా ఇవాళ రష్యాసంచలన ఆరోపణలు చేసింది. అమెరికా ఆగ్రహం వల్లే ఇమ్రాన్ ఖాన్ పదవీచ్యుతుడు అవుతున్నారంటూ రష్యా చేసిన ఆరోపణలు కలకలం రేపుతున్నాయి.

రష్యాలో ఇమ్రాన్ పర్యటన

రష్యాలో ఇమ్రాన్ పర్యటన

ఉక్రెయిన్ పై వార్ మొదలైన రోజు రష్యాలో ఇమ్రాన్ ఖాన్ పర్యటించారు. రష్యా అధ్యక్షుడు వ్లాదిమీర్ పుతిన్ తో ఇమ్రాన్ భేటీ అయ్యారు. అంతే కాదు ఇదెంతో మంచి రోజంటూ వ్యాఖ్యానించారు. అప్పుడు ఆయన త్వరలో పదవీచ్యుతుడు కాబోతున్నారని అస్సలు ఊహించలేదు. కానీ నెల రోజులు గడిచేలోపే సీన్ మొత్తం మారిపోయింది. అమెరికాలో స్విచ్ వేసే సరికి ఇమ్రాన్ ఖాన్ లైట్ ఆరిపోయింది. దీంతో ఇప్పుడు ఎందుకిలా జరిగిదంటూ ఆయన తీరిగ్గా కూర్చుని విచారిస్తున్నారు.

అమెరికా ఆగ్రహంతోనే

అమెరికా ఆగ్రహంతోనే

ఉక్రెయిన్ పై రష్యా యుద్ధాన్ని ప్రపంచదేశాలన్నీ మూకుమ్మడిగా ఖండిస్తుంటే పాక్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ మాత్రం తీరిగ్గా రష్యా వెళ్లి పుతిన్ ను అభినందించి వచ్చారు. ఉక్రెయిన్ వార్ లో రష్యాకు లభించిన తొలి, చివరి మద్దతు కూడా అదే కావడం విశేషం. ఆ రోజు ఇమ్రాన్ ఖాన్ నుంచి లభించిన మద్దతు మినహా రష్యాకు పూర్తిస్ధాయిలో మద్దతిచ్చేందుకు ఇప్పటికీ చైనా తో పాటు రష్యా చిరకాల మిత్రదేశం భారత్ కూడా ముందుకు రావడం లేదు. అదే ఇప్పుడు ఇమ్రాన్ కు శాపంగా మారింది. ఇమ్రాన్ తీరుపై ఆగ్రహం వ్యక్తం చేస్తూ అమెరికా తెరవెనుక పావులు కదిపింది. అంతే .. ఇప్పుడు ఇమ్రాన్ ఖాన్ ప్రధాని పదవి వదులుకోవాల్సి వచ్చింది.

రష్యా సంచలన ఆరోపణ

రష్యా సంచలన ఆరోపణ

ఇమ్రాన్ ఖాన్ మాస్కో పర్యటన తర్వాత ఇమ్రాన్ ఖాన్ అధికారం కోల్పోవడంతో ఆయన్ను పరామర్శించే పనిలో రష్యా బిజీగా ఉంది. ఓవైపు ఉక్రెయిన్ లో యుద్ధం చేస్తూనే మరోవైపు ఇమ్రాన్ ఖాన్ కు ఊరటనిచ్చేలా ఇవాళ రష్యా సంచలన వ్యాఖ్యలు చేసింది. ఇమ్రాన్ గతంలో చేసిన మాస్కో పర్యటనకు అమెరికా శిక్ష వేసిందంటూ రష్యా కీలకవ్యాఖ్యలు చేసింది. పాకిస్తాన్ లో రాజకీయ సంక్షోభం వెనుక అగ్రరాజ్యం హస్తం ఉందని రష్యా విదేశాంగశాఖ ఆరోపించింది. ఇమ్రాన్ ఖాన్ మాస్కోలో పర్యటించిన రోజే ఆయన్ను శిక్షించాలని అమెరికా నిర్ణయించుకుందని రష్యా తెలిపింది.

ఇమ్రాన్ వ్యాఖ్యలకు రష్యా సమర్ధన

ఇమ్రాన్ వ్యాఖ్యలకు రష్యా సమర్ధన

ఇప్పటికే ఇమ్రాన్ ఖాన్ తన ప్రభుత్వ పతనం వెనుక విదేశీ శక్తులు ఉన్నాయంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు. విదేశీ శక్తుల జోక్యం వల్లే తన ప్రభుత్వంపై విపక్షాలు అవిశ్వాస తీర్మానం పెట్టాయన్నారు. ఇప్పుడు రష్యా కూడా అదే మాట చెబుతోంది. ఇమ్రాన్ వ్యాఖ్యలకు మద్దతుగా ఇవాళ మాట్లాడిన రష్యా విదేశాంగశాఖ.. అమెరికా హస్తం వల్లే ఇమ్రాన్ ఖాన్ ప్రభుత్వం పడిపోతోందంటూ వ్యాఖ్యానించింది. అయితే ఇమ్రాన్ ఖాన్ తో పాటు రష్యా కూడా అమెరికా కుట్ర వల్లే ఇమ్రాన్ ప్రభుత్వం పడిపోతోందంటూ చేస్తున్న వ్యాఖ్యల్ని పాక్ సైన్యం కొట్టిపారేసింది. తమ దేశ వ్యవహారాల్లో విదేశీ శక్తుల ప్రమేయం ఉన్నట్లు ఎలాంటి ఆధారాలు లేవని తెలిపింది.

English summary
russia has alleged that US govt behind pakistan's political crisis which leads to fall of imran khan govt.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X