ఉక్రెయిన్ పై మరో తీర్మానానికి సిద్ధమైన ఐరాస- రష్యా తగ్గాలంటూ.. ఈసారి నో వీటో ఛాన్స్

ఉక్రెయిన్ పై రష్యా దండయాత్రపై ఆగ్రహంగా ఉన్న ఐరాస సభ్య దేశాలు ఇప్పటికే భద్రతా మండలిలో ప్రవేశపెట్టిన తీర్మానాన్ని రష్యా వీటో చేయడంపై మరింత గుర్రుగా ఉన్నాయి. ఈ నేపథ్యంలో ఈసారి సాధారణ సభలో ఓ నాన్ బైండింగ్ (కట్టుబడి ఉండాల్సిన అవసరం లేని) తీర్మానం చేసేందుకు సిద్ధమయ్యాయి.

అమెరికా, నాటో, ఈయూ దేశాల ప్రోత్సాహంతో ఐరాస సాధారణ సభలో ఇవాళ రాత్రికి రష్యాకు వ్యతిరేకంగా ఓ ముసాయిదా తీర్మానం ప్రవేశపెట్టబోతున్నాయి. ఈ తీర్మానాన్ని ఐరాసలోని 193 దేశాల్లో దాదాపు వందకు పైగా దేశాలు మద్దతిస్తాయని భావిస్తున్నారు. ఈ తీర్మానాన్ని గతంలోలా వీటో చేసేందుకు రష్యాకు వీల్లేకపోవడమే దీని ప్రత్యేకత. దీంతో ఈ తీర్మానం ప్రవేశపెట్టి ఆమోదించడం ద్వారా ప్రపంచవ్యాప్తంగా రష్యాపై ఉన్న వ్యతిరేకత తెలియజెప్పడమే దీని ఉద్దేశంగా కనిపిస్తోంది.

UN to pass another resolution demanding Russia to withdraw from Ukraine

రష్యా అధ్యక్షుడు పుతిన్ దూకుడుకు అడ్డుకట్ట వేయడంతో పాటు వెంటనే ఉక్రెయిన్ నుంచి తప్పుకోవాలని కోరుతూ ఈ తీర్మానం ఆమోదించబోతున్నారు. సభ్య దేశాలు మరేదైనా అంశాలు కోరితే వాటిని కూడా తీర్మానంలో పొందుపరుస్తారు. ఈ తీర్మానం చాలా ముఖ్యమైనదని ప్రపంచ దేశాలు భావిస్తున్నాయి. దీని ద్వారా ప్రపంచ భవిష్యత్తు కోసం రష్యా వంటి శక్తులకు మందలింపుగా ఇది ఉంటుందని చెప్తున్నారు. ఈ తీర్మానం ఆమోదం పొందాలంటే మూడింట రెండొంతుల మెజారిటీ కావాలి. ఇది సులువుగానే లభిస్తుందని అంచనా వేస్తున్నారు.

ఇప్పటికే రెండు రోజుల క్రితం భద్రతామండలిలో అమెరికా సహా పలు దేశాలు ప్రవేశపెట్టిన తీర్మానం ఆమోదం పొందినా రష్యా తనకున్నవీటో అధికారంతో దాన్ని అడ్డుకుంది. దీంతో ఈ తీర్మానం వల్ల ఉపయోగం లేకుండా పోయింది. ఈసారి పెట్టే తీర్మానం ఆమోదం పొందినా, రష్యా కట్టుబడకపోయినా ప్రపంచవ్యాప్తంగా రష్యాను ఒంటరిని చేసేందుకు ఇది ఉపయోగపడుతుందని అమెరికా సహా పలు దేశాలు భావిస్తున్నాయి.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+