ముప్పేట దాడితో దిగొచ్చిన రష్యా-ఉక్రెయిన్ తో చర్చలకు రెడీ-గౌరవంగా బయటపడే యత్నం
నాటోలో చేరి తమ ఉనికికి ముప్పుగా పరిణమిస్తుందనే భయాలతో ఉక్రెయిన్ పై దండయాత్రకు వెళ్లిన రష్యాకు ఆదిలోనే చుక్కలు కనిపించాయి. ఓవైపు సైబర్ దాడులు, మరోవైపు ఆంక్షల విధింపు, ఇంకోవైపు ఐరాస భద్రతా మండలి తీర్మానం, చివరికి పుతిన్ ను వ్యక్తిగతంగా టార్గెట్ చేసేందుకు కూడా వెరవని అమెరికా వ్యూహాల ముందు రష్యా తేలిపోయింది. దీంతో ఉక్రెయిన్ పై పోరు మొదలుపెట్టిన సంతోషం రష్యాకు లేకుండా పోయింది. ఇప్పుడు అందులో నుంచి గౌరవంగా బయటపడటమే మిగిలుంది.

రష్యా ఉక్కిరిబిక్కిరి
తమ భద్రతకు ముప్పు తెస్తుందన్న ముందస్తు భయాలతో ఉక్రెయిన్ పై కయ్యానికి కాలుదువ్విన రష్యాకు అంతర్జాతీయంగా మద్దతు కరవైంది. భౌతిక యుద్ధాలకు బదులుగా పరోక్ష ఆధిపత్య పోరుకు తెరలేపుతున్న ఆధునిక కాలంలో ఇంకా ఓ పొరుగు దేశంపైకి భద్రత పేరుతో యుద్ధానికి వెళ్లిన రష్యాకు చుక్కెదురైంది. అమెరికాతో పాటు దాని మిత్రదేశాలు, శత్రు దేశాలు సైతం వారిస్తున్నా వినకుండా ఉక్రెయిన్ పై సైనిక చర్యకు దిగిన రష్యాకు ప్రపంచం నిద్రలేకుండా చేసేసింది. ముఖ్యంగా గతంలో వ్యూహకర్తగా, దుర్భేద్యమైన నేతగా పేరు తెచ్చుకున్న పుతిన్.. ఇప్పుడు యుద్ధోన్మాదిగా ప్రపంచం చూస్తోంది. దీంతో రష్యా ఉక్కిరిబిక్కిరవుతోంది.

క్రెమ్లిన్ పై ముప్పేట దాడి
ఉక్రెయిన్ పై యుద్ధానికి రష్యా చూపిన కారణాలు ఆధునిక ప్రపంచ దేశాల్ని మెప్పించలేకపోయాయి. దీంతో ఇదే అదనుగా రంగంలోకి దిగిన అమెరికా.. క్రెమ్లిన్ (రష్యా అధ్యక్ష నివాసం)పై ముప్పేట దాడులకు దిగింది. ఓవైపు తాను స్వయంగా ఆంక్షలు విధిస్తూనే మరోవైపు 27 మిత్ర దేశాలతో అన్నివిషయాల్లోనూ రష్యాపై ఆంక్షలు విధించేలా చేయడంలో అమెరికా సక్సెస్ అయింది. అదే సమయంలో నాటో కూటమిని ఉసిగొల్పి గంపగుత్తగా ఆంక్షలు విధించింది. చివరికి ఈయూ కూటమితోనూ ఆంక్షలు విధించడమే కాదు ఏకంగా రష్యా, పుతిన్ ఆస్తుల జప్తు చేసేలా అమెరికా పావులు కదిపింది. చివరిగా ఐరాస భద్రతా మండలిలోనూ రష్యాకు వ్యతిరేకంగా తీర్మానం చేయించింది. దీంతో రష్యా వెనక్కి తగ్గక తప్పలేదు.

చర్చలకు రెడీ అన్న పుతిన్
ఓవైపు అమెరికా, మిత్ర దేశాలు, మరోవైపు ఈయూ కూటమి, ఇంకోవైపు నాటో దేశాలు, చివరిగా ఐరాస కూడా కలిసి రాకపోవడంతో పుతిన్ ఉక్రెయిన్ పై మొదలుపెట్టిన పోరుపై అంతర్మథనంలో పడిపోవాల్సిన పరిస్దితి. ఓవైపు ఉక్రెయిన్ లో ఒక్కో ప్రాంతం తమ స్వాధీనం అవుతున్నా పుతిన్ కు మాత్రం ఆ సంతోషం మిగలడం లేదు. ఉక్రెయిన్ మొత్తం ఆక్రమించి రష్యాలో కలిపేసుకున్నా అంతర్జాతీయంగా తాను, రష్యా ఒంటరైపోవడం ఖాయమని పుతిన్ కు అర్ధమైపోయింది. దీంతో ఉక్రెయిన్ అత్యున్నత స్ధాయి బృందాన్ని బెలారస్ లో చర్చలకు పుతిన్ ఆహ్వానించారు.

ఏకాకిగా మారిన పుతిన్
తాను నమ్ముకున్న చైనా వంటి దేశాలు సైతం యుద్ధం ఆపి చర్చలకు వెళ్లాలని కోరడంతో ఇక చేసేది లేక చర్చలు ప్రారంభించేందుకు పుతిన్ పావులు కదుపుతున్నారు. అయితే ఉక్రెయిన్ పై మొదలుపెట్టిన పోరును వెంటనే ఆపేయడం సాధ్యం కాదు. కాబట్టి ఈ పోరులో నుంచి గౌరవంగా బయటపడే మార్గాల్ని పుతిన్ వెతుకుతున్నారు. సడన్ గా ఉక్రెయిన్ లో పోరు ఆపేస్తే ప్రపంచవ్యాప్తంగా రష్యాకున్న పేరు ప్రతిష్టలు మంటగలవడం ఖాయం. ఐరాసలోనూ ఒంటరి కావడం ఖాయం. కాబట్టి ఈ చక్రబంధం నుంచి గౌరవంగా బయటపడేందుకు చర్చలకు ప్రయత్నిస్తున్నారు. చర్చల్లో నాటో కూటమిలో ఉక్రెయిన్ చేరబోనన్న హామీ ఇస్తే చాలు వెంటనే యుద్ధం ఆపేసేందుకు కూడా పుతిన్ రెడీగా ఉన్నట్లు కనిపిస్తున్నారు.
-
బంగారం ధరల్లో వరస్ట్ డౌన్ ఫాల్- 2008 తర్వాత -
40 దేశాల్లో.. అండర్ వరల్డ్ డాన్‌గా జూనియర్ ఎన్టీఆర్ విశ్వరూపం -
కోట్లకు పడగెత్తిన విజయ్ రైట్ హ్యాండ్ -
సిమెంట్- స్టీల్ ధరలు భారీగా పెంపు, ఇక నుంచి..!? -
ఏపీ ప్రభుత్వం మరో ఎన్నికల హామీ అమలు, రేపే ప్రారంభం..!! -
తిరుపతిలో ఎయిర్ పోర్టును తలదన్నేలా..!! -
ఏపీ ప్రజలకు డిసెంబర్ లోగా మరో బహుమానం.. ఫిక్స్ చేసిన సీఎం చంద్రబాబు -
బిగ్ షాక్: ఏప్రిల్ 1 నుంచి పెరగనున్న పెట్రోల్, డీజిల్ ధరలు.. -
రాహుల్ గాంధీతో డేటింగ్ కోరిక తీరలేదు - బాలీవుడ్ స్టార్ -
అనుష్క కొత్త సినిమా ట్రైలర్ రిలీజ్.. ప్రభాస్ బాహుబలిని మించి !! -
ఆ పార్టీ కండువా కప్పుకొన్న టెన్నిస్ దిగ్గజం- రాజకీయాల్లో ఎంట్రీ -
మహిళలకు నెలకు రూ.3వేలు.. అస్సాంలో బీజేపీ మ్యానిఫెస్టో రిలీజ్












Click it and Unblock the Notifications