అయ్యబాబోయ్ అమెరికాలో కుప్పలు తెప్పలుగా ఎయిర్‌పోర్టులు- వేలల్లో
ప్రపంచంలో అత్యధిక విమానాశ్రయాలు ఉన్న దేశాల జాబితా వెలువడింది. సీఐఏ వరల్డ్ ఫ్యాక్ట్‌బుక్ దీన్ని విడుదల చేసింది. విమానాశ్రయాలు, ఎయిర్ ఫీల్డ్ లన్నింటినీ పరిగణనలోకి తీసుకుని రూపొందించిన జాబితా ఇది. మారుతున్న కాలానికి అనుగుణంగా విమాన ప్రయాణ అవసరాలు భారీగా పెరుగుతోన్నాయి. అత్యవసర సేవలు, రక్షణ, వ్యాపారం, దైనందిన జీవితంలో విమానాశ్రయాల పాత్ర చాలా కీలకంగా మారిన ప్రస్తుత పరిస్థితుల్లో వీటి ప్రాధాన్యత పెరిగింది.
సీఐఏ వరల్డ్ ఫ్యాక్ట్‌బుక్ ప్రకారం.. ప్రపంచంలోనే అత్యధిక విమానాశ్రయాలు ఉన్న దేశాల జాబితాలో అమెరికా టాప్ లో ఉంది. ఈ దేశంలో మొత్తం 16,116 విమానాశ్రయాలు/ఎయిర్‌ఫీల్డ్‌లు ఉన్నాయి. విమాన ప్రయాణం అనేది ఆ దేశ దైనందిన జీవితంలో ఎంత లోతుగా పెనవేసుకుపోయిందో ఇది స్పష్టం చేస్తుంది. స్థానిక ఎయిర్‌స్ట్రిప్‌లు, రీజినల్ ఎయిర్‌ఫీల్డ్‌లు, జనరల్ ఏవియేషన్ సౌకర్యాలు, వైద్య తరలింపు నుండి అగ్నిమాపక సేవల వినియోగించే మారుమూల ల్యాండింగ్ గ్రౌండ్‌లన్నీ ఇందులో భాగమే.

యుఎస్‌లో కేవలం కొన్ని మెగా విమానాశ్రయాలు మాత్రమే కాకుండా, చిన్న పట్టణాల ఎయిర్‌ఫీల్డ్‌లు, శిక్షణ, ప్రైవేట్, ప్రభుత్వ జనరల్ ఏవియేషన్ విమానాశ్రయాలు, మారుమూల ల్యాండింగ్ సైట్‌లతో కూడిన సంక్లిష్ట వ్యవస్థ ఉంది. విస్తారమైన దేశంలో అత్యవసర కనెక్టివిటీ, వేగవంతమైన లాజిస్టిక్స్‌కు ఈ సాంద్రత కీలకం.
2) బ్రెజిల్: 5,297 విమానాశ్రయాలు: అమెరికా తర్వాత బ్రెజిల్ రెండో స్థానంలో ఉంది. ఈ సంఖ్య దాని భూభాగం, ఆర్థిక వ్యవస్థను ప్రతిబింబిస్తుంది. దూర ప్రయాణాలు, రోడ్డు మార్గం లేని పర్వత ప్రాంతాల వల్ల బ్రెజిల్ ప్రజలు ఎక్కువగా విమానాలపైనే ఆధారపడుతున్నారు. చిన్న చిన్న ఎయిర్‌ఫీల్డ్‌లు ఇక్కడ చాలా అధికం.
3) ఆస్ట్రేలియా: ఈ దేశంలో 2,257 విమానాశ్రయాలు ఉన్నాయి. రష్యా, చైనాను తప్పించి మిగతా దేశాలతో పోల్చుకుంటే భూభాగం అధికం. ప్రత్యేక ఖండం ఇది. ఇక్కడ విస్తరించి ఉన్న జనాభా, మారుమూల ప్రాంతీయ కేంద్రాలను కనెక్ట్ చేయడానికి విమాన ప్రయాణాలపై ఆధారపడుతుంటారు ఆస్ట్రేలియన్లు. జనాభా తక్కువే అయినప్పటికీ ప్రపంచంలోనే అతిపెద్ద విమానాశ్రయ నెట్‌వర్క్‌లలో ఇది ఒకటి.
4) మెక్సికో: ఇక్కడ 1,580 విమానాశ్రయాలు ఉన్నాయి. మెక్సికోలోని విమానాశ్రయాలు వాణిజ్య విమానయాన, ప్రాంతీయ కనెక్టివిటీ, పరిశ్రమలు, విభిన్న భూభాగాల్లో అంతర్గత ప్రయాణాలకు కనెక్టివిటీని కల్పిస్తోంది. కెనడా సహా అనేక యూరోపియన్ దేశాల కంటే ముందుందీ దేశం.
5) కెనడా: కెనడాలో 1,459 విమానాశ్రయాలు ఉన్నాయి. అధిక విస్తీర్ణం, కఠిన వాతావరణం, మారుమూల కమ్యూనిటీలకు ప్రయాణీకులు, సామాగ్రి, అత్యవసర సేవల తరలింపు కోసం విమానాలపైనే ఆధారపడుతుంటారిక్కడ. అందుకే అత్యధిక ఎయిర్ కనెక్టివిటీ ఉన్న దేశాల జాబితాలో టాప్ 5లో ఉందీ దేశం.
-
భారత్ కు బిగ్ షాక్- హార్ముజ్ జలసంధి పూర్తిగా మూసివేయనున్న ఇరాన్ -
అదే జరిగితే ఇరాన్ ను అంతం చేస్తాం: ట్రంప్ వార్నింగ్ -
భారత్ కు గుడ్ న్యూస్ చెప్పిన పాకిస్థాన్..! ట్రంప్ సమక్షంలో..! -
వేసవిలో ఏ సమయంలో రాగి జావ తాగాలి- ఇలా చేస్తే ఫుల్ ఎనర్జీ..!! -
తులా రాశి, వృశ్చిక రాశి ఏప్రిల్ నెల జాతక ఫలం -
PM Modi: అన్నింటికీ సిద్దం అయిపోండి..! ప్రధాని మోడీ షాకింగ్ పిలుపు..! -
బంగారం ధరలు అధోగతి- కనీవినీ ఎరుగనంత పతనం -
సికింద్రాబాద్ స్టేషన్ సిద్దం, ప్రధాని మోదీ ప్రారంభం - ముహూర్తం ఫిక్స్..!! -
మకరరాశి వార్షిక జాతకం ఇలా.. ఈ ఏడాది విశేష లాభాలు! -
రైతు భరోసా నిధులు జమ కాలేదా, ఇలా చేయండి- వెంటనే..!! -
విజయ్‌కు షాకిచ్చిన సర్వే!: ఆ పార్టీకి 180+ సీట్లు -
"నాకు అమ్మా నాన్న లేరు సార్ మీరే నాకు అమ్మా నాన్న.. పాస్ చేయండి సార్"












Click it and Unblock the Notifications