Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

రెచ్చిపోతున్న తాలిబన్లు-ఆప్ఘన్ లో దాడులపై ఐరాస ఆగ్రహం-చర్యలకు దిగుతుందా ?

ఆప్ఘనిస్తాన్ లో ప్రజా ప్రభుత్వం స్ధానంలో అధికారాన్ని హస్తగతం చేసుకున్న తాలిబన్లు.. ప్రభుత్వ ఏర్పాటుకు ముందే రెచ్చిపోతున్నారు. నిన్న మొన్నటివరకూ తిరుగుబాటుదారులపై మాత్రమే దాడులు చేసిన తాలిబన్లు.. ఇఫ్పుడు నిరసనకారులు, ప్రజలు, జర్నలిస్టులపైనా దాడులకు దిగుతున్నారు. తద్వారా ప్రభుత్వ ఏర్పాటుకు ముందే పరిస్ధితుల్ని తమ అదుపులోకి తెచ్చుకోవాలని వారు భావిస్తున్నారు. తాలిబన్ల దాడులతో ఆప్ఘనిస్తాన్ లో భయానక పరిస్ధితులు నెలకొంటున్నాయి. దీనిపై ఐక్యరాజ్యసమితి ఆందోళన వ్యక్తం చేస్తోంది.

 ఆప్ఘనిస్తాన్ లో భయానకం

ఆప్ఘనిస్తాన్ లో భయానకం

ఆఫ్ఘనిస్తాన్ లో ప్రస్తుతం భయానక పరిస్ధితులు నెలకొన్నాయి. గతంలో ప్రజా ప్రభుత్వ పాలనలో స్వేచ్ఛగా జీవించిన ప్రజలు ఇప్పుడు తాలిబన్లు అధికారం చేపట్టబోతున్న తరుణంలో బిక్కుబిక్కుమంటూ కాలం వెళ్లదీస్తున్నారు. వీధుల్లో మహిళల సంచారానికి కూడా వీల్లేకుండా తాలిబన్లు కట్టడి చేస్తుండటం, నిరసనలకు దిగిన వారిపై కాల్పులకు దిగడం, జర్నలిస్టుల్ని సైతం నిర్బంధించి చిత్రహింసలు పెట్టడం వంటి చర్యల ద్వారా తాలిబన్లు తమ అసలు రూపాన్ని బయటపెడుతున్నారు. దీంతో ఆప్ఘనిస్తాన్ లో నెలకొంటున్న పరిస్ధితులపై సర్వత్రా ఆందోళన వ్యక్తమవుతోంది.

 పాకిస్తాన్ వ్యతిరేకులపై ఉక్కుపాదం

పాకిస్తాన్ వ్యతిరేకులపై ఉక్కుపాదం

ఆప్ఘనిస్తాన్ లో పాకిస్తాన్ మద్దతుతో కొత్త ప్రభుత్వ ఏర్పాటుకు సిద్దమవుతున్న తాలిబన్లు.. అంతకంటే ముందే పాకిస్తాన్ కు వ్యతిరేకంగా జరుగుతున్న నిరసనల్ని అణగదొక్కేందుకు ప్రయత్నిస్తున్నారు. పాకిస్తాన్ ను వ్యతిరేకించడమంటే తమను వ్యతిరేకించడమనే భావిస్తున్న తాలిబన్లు.. ఆందోళనకారులపై కాల్పులకు కూడా దిగుతున్నారు. దీంతో చాలా చోట్ల పాకిస్తాన్ వ్యతిరేక ఆందోళనకారులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఆప్ఘన్ వ్యవహారాల్లో పాకిస్తాన్ పాత్రను తప్పుబడుతున్న స్ధానికులు పాకిస్తాన్ చిత్రపటాలతో ఆందోళనలు చేపడుతుండగా.. తాలిబన్లు వారిని కాల్పులతో భయభ్రాంతులకు గురిచేస్తున్నారు.

 మహిళల్నీ వదలని వైనం

మహిళల్నీ వదలని వైనం

ఆప్ఘనిస్తాన్ లో ప్రజాప్రభుత్వ పాలనలో దాదాపు 20 ఏళ్ల పాటు స్వేచ్ఛగా జీవించిన మహిళలకు తిరిగి అక్కడ గడ్డుపరిస్ధితులు ఎదురవుతున్నాయి. ముఖ్యంగా రోడ్లపై స్వేచ్ఛగా తిరిగేందుకు కూడా వారికి ఆంక్షలు తప్పడం లేదు. విద్యా, సాంస్కృతిక వ్యవహారాల్లో మహిళలపై ఆంక్షలు విధిస్తున్న తాలిబన్లు.. ఇప్పుడు వారిని రోడ్లపైనా తిరగనివ్వడం లేదు. దీంతో రోడ్లపైకి వచ్చే మహిళలకు నేరుగా తుపాకులు ఎక్కుపెడుతున్న దృశ్యాలు చాలా చోట్ల కనిపిస్తున్నాయి. ఆప్ఘన్ లో తాజా విజయం తర్వా,త మహిళల్ని ప్రభుత్వంలో చేరాల్సిందిగా ఆహ్వానించిన తాలిబన్లు.. ఇఫ్పుడు వారు స్వేచ్ఛగా జీవించేందుకు కూడా అనుమతించడం లేదు. దీంతో తాలిబన్లపై మహిళల్లో వ్యతిరేకత నానాటికీ పెరుగుతోంది

 తాలిన్ల దాడులపై ఐరాస ఆగ్రహం

తాలిన్ల దాడులపై ఐరాస ఆగ్రహం

తాలిబన్లు ఆప్ఘనిస్తాన్ లో అధికారం చేపట్టకముందే అక్కడి ప్రజల్ని లొంగదీసుకోవడానికి చేస్తున్న ప్రయత్నాలపై ప్రపంచ దేశాల్లో సర్వత్రా ఆగ్రహం వ్యక్తమవుతోంది. అదే సమయంలో ఐక్యరాజ్యసమితికి ఫిర్యాదులు కూడా పెరుగుతున్నాయి. దీంతో ఆప్ఘన్లో హింసాత్మక పరిస్ధితులకు కారణమవుతున్న తాలిబన్లపై ఐక్యరాజ్యసమితి కూడా ఆగ్రహం వ్యక్తం చేస్తోంది. తాలిబన్లు హింసాత్మక చర్యలు చేపట్టడం ద్వారా నిరసనకారుల్ని, మహిళల్ని, జర్నలిస్టుల్ని అణగదొక్కుతున్న తీరును ఐరాస ఓ ప్రకటనలో ఖండించింది. తాలిబన్ల దాడులు ఏమాత్రం ఆమోదయోగ్యం కాదని తెలిపింది.

Recommended Video

    Weather Update : మరో అల్పపీడనం ముప్పు.. AP & Telangana లో విస్తారంగా వర్షాలు..! || Oneindia Telugu
     చర్యల కోసం ఐరాసపై పెరుగుతున్న ఒత్తిడి

    చర్యల కోసం ఐరాసపై పెరుగుతున్న ఒత్తిడి

    ఆప్ఘనిస్తాన్ లో తీవ్ర మానవహక్కు ఉల్లంఘన జరుగుతోందని ఐరాస మానవ హక్కుల విభాగం తాజాగా నివేదిక ఇచ్చింది. విచ్చలవిడిగా సాధారణ పౌరులపై తాలిబన్లు జరుపుతున్న దాడులపై వివిధ దేశాల్లో ఆగ్రహం వ్యక్తమవుతోంది. దీంతో వెంటనే ఐరాస జోక్యం చేసుకుని ఆప్ఘనిస్తాన్ లో పరిస్ధితుల్ని చక్కదిద్దాలన్న డిమాండ్లు పెరుగుతున్నాయి. తక్షణం నాటో బలగాల సాయంతో తాలిబన్లను నియంత్రించడం మొదలుపెట్టాలని, లేదా ఆంక్షలు విధించాలన్న డిమాండ్లు వినిపిస్తున్నాయి. అయితే ఇప్పటికే తాలిబన్ల పాలనతో ఇబ్బందులు ఎదుర్కొంటున్న ఆప్ఘనిస్తాన్ ప్రజల విషయంలో కఠినంగా వ్యవహరించవద్దని ఐరాస కోరుకుంటోంది. పరిస్ధితులు మరింత విషమిస్తే అప్పుడు జోక్యం చేసుకోవాలని యోచిస్తోంది.

    More From
    Prev
    Next
    Notifications
    Settings
    Clear Notifications
    Notifications
    Use the toggle to switch on notifications
    • Block for 8 hours
    • Block for 12 hours
    • Block for 24 hours
    • Don't block
    Gender
    Select your Gender
    • Male
    • Female
    • Others
    Age
    Select your Age Range
    • Under 18
    • 18 to 25
    • 26 to 35
    • 36 to 45
    • 45 to 55
    • 55+