US-China Summit: మళ్లీ సైనిక చర్చలకు అమెరికా-చైనా ఓకే-అయినా జిన్ పింగ్ నియంతేనన్న బైడెన్..
ప్రపంచాన్ని శాసిస్తున్న రెండు అగ్రరాజ్యాల అధినేతలు ఒక్క చోట చేరారు. ఇరుదేశాల మధ్య దశాబ్దాలుగా సాగుతున్న వాణిజ్య యుద్ధాలు, సైనిక మోహరింపులు, విన్యాసాలు, అంతర్జాతీయ పరిణామాలపై మాట్లాడుకున్నారు. చివరికి కలిసి పనిచేయాలని నిర్ణయించుకున్నారు. అయినా అందులో ఒకరు మరొకరిని నియంతగానే తేల్చేశారు. అమెరికా-చైనా అధ్యక్షుల మధ్య జరిగిన తాజా భేటీ సందర్భంగా చోటు చేసుకున్న పరిణామాలివి.
అమెరికా-చైనా మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమంటున్న పరిస్ధితుల్లో ఇరుదేశాల అధినేతలు జో బైడెన్-షీ జిన్ పింగ్ ఇవాళ శాన్ ఫ్రాన్సిస్కోలో భేటీ అయ్యారు. ఈ ఏడాది తొలిసారి కలుసుకున్న వీరిద్దరూ ఇరుదేశాలకు సంబంధించిన పలు కీలక అంశాలపై చర్చించారు. ఆసియా-పసిఫిక్ ఆర్ధిక సహకార సదస్సు సందర్భంగా వీరిద్దరూ భేటీ అయ్యారు. తాము బహిరంగ చర్చల్ని, సమాచార మార్పిడిని తిరిగి ప్రారంభించినట్లు ఈ భేటీ అనంతరం అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ వ్యాఖ్యానించారు.

చైనా తాజాగా తైవాన్ చుట్టూ సైనిక విన్యాసాలు నిర్వహించింది. అయితే దాని నౌకాదళం దక్షిణ చైనా సముద్రంలో ఫిలిప్పీన్స్‌తో ప్రతిష్టంభనలో భాగంగా అమెరికాతో పోటీగా సైనిక విన్యాసాలు చేపట్టింది. చైనా నౌకలు దాదాపుగా అమెరికన్ దళాలతో ముఖాముఖీ అయిన కొన్ని సంఘటనల నేపథ్యంలో సమావేశమైన చైనా అధ్యక్షుడు షీ జిన్ పింగ్ తో భేటీ అయిన బైడెన్.. సైనిక చర్చల్ని పునరుద్ధరించాలని కోరారు. కొన్ని కీలక అంశాల్లో సమాచార లోపాల వల్ల అసలైన ఇబ్బందులు ఎదురవుతాయని బైడెన్ ఈ సందర్భంగా చెప్పారు. అలాగే జిన్ పింగ్ ను నియంత అన్న తన వ్యాఖ్యలకు కట్టుబడి ఉన్నట్లు తెలిపారు.
గతంలో అమెరికా గగనతలంలో చైనా గూఢచర్య బెలూన్ ను గుర్తించిన తర్వాత దాన్ని కూల్చేసింది. ఇది నిఘా బెలూనే అంటూ అమెరికా, కాదు పరిశోధనల కోసం పంపిన బెలూన్ అంటూ చైనా వాదించుకున్నాయి. ఆ తర్వాత జూన్‌లో, సింగపూర్‌లో జరిగిన వార్షిక భద్రతా శిఖరాగ్ర సమావేశానికి ఇరు దేశాలకు చెందిన డిఫెన్స్ చీఫ్‌లు హాజరయ్యారు. అయితే వారు అధికారికంగా సమావేశం కాలేదు. ఇప్పుడు ఆసియా-పసిఫిక్ ఆర్ధిక సహకార సదస్సుకు హాజరైన సందర్భంగా బైడెన్-జిన్ పింగ్ భేటీ అయ్యారు.

బైడెన్ తో భేటీలో జిన్ పింగ్..అమెరికాతో చైనా సంబంధాలలో తైవాన్ ఎల్లప్పుడూ అత్యంత ముఖ్యమైన, సున్నితమైన సమస్య అని ప్రస్తావించారు. అలాగే తైవాన్ స్వాతంత్రానికి మద్దతివ్వడం, ఆ దేశానికి ఆయుధాలు అందించడం, చైనా పునరేకీరణ ప్రయత్నాలకు అడ్డంకిగా మారుతుందని బైడెన్ కు చెప్పినట్లు ఆ దేశ మీడియా వెల్లడించింది. తైవాన్ ను చైనాలో భాగంగా గుర్తించడంతో పాటు ఆ ప్రాంతం స్వతంత్రంగా చేసే దౌత్య ప్రయత్నాలను సమర్ధించవద్దని కోరినట్లు సమాచారం.
-
H-1B వీసాదారులకు అమెరికా గుడ్ న్యూస్..! వేతనాల పెంపు ఇలా...! -
పద్మవ్యూహంలోకి ట్రంప్ ? ఇరాన్ లో భూతల దాడి నరకమేనా ? -
Bay of Pigs: క్యూబాలో అమెరికా ఎలా ఓడిపోయి లొంగిపోయింది ? నెక్ట్స్ ఇరానేనా ? -
Donald Trump: పీకల్లోతు కష్టాల్లో ట్రంప్-స్వదేశంలో భారీ షాక్..! -
మడమ తిప్పని ఇరాన్: శాంతి కోసం 5 కండీషన్లతో అమెరికాకు షాక్ -
ఇకపై రెండు సిలిండర్లే..కొత్త బుకింగ్ రూల్స్ -
ఏప్రిల్ ఒకటి నుంచి చికెన్ షాపులు బంద్ !! -
భారత్.. పాకిస్థాన్ లా 'బ్రోకర్' కాదు.. ఇచ్చిపడేసిన జై శంకర్.. -
ఎన్టీఆర్ పాటకు స్టెప్పులేసిన సితార.. వైరల్ వీడియో -
నక్కతోక తొక్కిన "అస్సాం బ్యూటీ".. నందమూరి హీరోతో స్టెప్పులేసే ఛాన్స్ !! -
ఏపీలో స్థానిక సంస్థల పునర్విభజన- మారిపోతున్న ముఖచిత్రాలు -
PNGకి మారకపోతే LPG సిలెండర్ కట్..! కేంద్రం డెడ్ లైన్..!












Click it and Unblock the Notifications