H-1B VISA: అమెరికా కాంగ్రెస్‌లో సంచలన బిల్లు..

అమెరికా కలల సౌధాన్ని నమ్ముకున్న విదేశీ మేధావులకు, ముఖ్యంగా భారతీయ ఐటీ నిపుణులకు భారీ ఊరటనిచ్చేలా యూఎస్ కాంగ్రెస్‌లో ఒక సంచలన ఘట్టం చోటుచేసుకుంది. హెచ్-1బీ వీసా వ్యవస్థను ఉక్కిరిబిక్కిరి చేస్తున్న వివాదాస్పద ఆంక్షల సంకెళ్లను తెంచేందుకు డెమొక్రాట్ ప్రతినిధి బానీ వాట్సన్ కోల్మన్ సరికొత్త యుద్ధాన్ని ప్రకటించారు. గత సెప్టెంబర్ 2025 లో హెచ్-1బీ వీసాలపై విధించిన కఠినమైన, గొడ్డలి పెట్టు లాంటి నిబంధనలను పూర్తిగా రద్దు చేయడమే లక్ష్యంగా ఆమె 'వెల్కమింగ్ ఇంటర్నేషనల్ సక్సెస్ యాక్ట్’ పేరుతో ఒక చారిత్రాత్మక బిల్లును ప్రతినిధుల సభలో ప్రవేశపెట్టారు. ఈ బిల్లు గనుక చట్టంగా మారితే, అమెరికా వీసా విధానం మళ్లీ పాత వైభవాన్ని సంతరించుకోనుంది.

గత ఏడాది సెప్టెంబర్‌లో వచ్చిన ఆ నిబంధన అమెరికా కంపెనీలను తీవ్ర దిగ్భ్రాంతికి గురిచేసింది. హెచ్-1బీ వీసాలను స్పాన్సర్ చేసే యజమానులపై అడ్డగోలుగా వేతన ప్రమాణాలను పెంచడమే కాకుండా, ఒక్కో వీసాకు ఏకంగా $100,000 (సుమారు రూ. 83 లక్షలకు పైగా) భారీ ఫీజును నిర్ణయించింది. ఈ అదనపు ఆర్థిక భారం అమెరికాలోని దిగ్గజ టెక్ కంపెనీలు, ప్రతిష్టాత్మక విద్యా సంస్థలు, అంతర్జాతీయ నైపుణ్యాలపై ఆధారపడే పలు రంగాల గుండెల్లో రైళ్లు పరిగెత్తించింది. ప్రతిభ ఉన్నా నిపుణులను నియమించుకోలేక పరిశ్రమలు విలవిల్లాడాయి. ఇప్పుడు ఈ కొత్త బిల్లు ఆ కఠిన ఆంక్షల నుంచి విముక్తి ప్రసాదించి, నియామక ప్రక్రియను మళ్లీ సరళీకృతం చేస్తుందని పరిశ్రమ వర్గాలు ఆశగా ఎదురుచూస్తున్నాయి.

US Congress Representative Moves Key Bill To Cancel Controversial H-1B Restrictions And 100K Fee

ట్రంప్ సర్కార్‌పై బానీ వాట్సన్ నిప్పులు..

ప్రపంచ స్థాయి మేధావులను ఆకర్షించే అమెరికా అజేయ శక్తిని ఈ ఆంక్షలు క్రూరంగా దెబ్బతీస్తున్నాయని బానీ వాట్సన్ కోల్మన్ తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. ఆవిష్కరణలకు, ఆర్థిక పురోగతికి ఊతమివ్వాల్సిన వీసా విధానాలు, నిపుణులను దేశంలోకి రాకుండా నిరుత్సాహపరచడం ఎంతవరకు సమంజసమని ఆమె ప్రశ్నించారు.

"ట్రంప్ తీసుకువచ్చిన ఈ సంకుచితమైన, స్వల్పకాలిక ఆలోచనా విధానం అమెరికా కంపెనీలు, విశ్వవిద్యాలయాలు, ఆసుపత్రులు, పరిశోధనా సంస్థల ముందు పెద్ద గోడలను నిలబెట్టింది. హెచ్-1బీ ప్రోగ్రామ్ అనేది స్థానిక కార్మికుల అవకాశాలను లాక్కోవడానికి కాదు; అది అమెరికా ప్రతిభకు, అంతర్జాతీయ మేధస్సుకు మధ్య వారధి లాంటిది. అమెరికా ఆర్థిక వృద్ధికి ఇంధనంగా పనిచేసే గ్లోబల్ టాలెంట్‌ను మనం గౌరవించాలి." - బానీ వాట్సన్ కోల్మన్, యూఎస్ కాంగ్రెస్ ప్రతినిధి.

H1B: ట్రంప్ షాక్, ఏటా కోట్లలో జీతం ఉంటేనే వీసా!
H1B: ట్రంప్ షాక్, ఏటా కోట్లలో జీతం ఉంటేనే వీసా!

అమెరికాకు తప్పని 'గ్లోబల్ టాలెంట్' అవసరం

సాంకేతికత (IT), ఇంజనీరింగ్, వైద్యం, ఆర్థిక రంగం వంటి అత్యంత కీలక విభాగాలలో స్థానిక కార్మికుల కొరత ఉన్నప్పుడు, ప్రపంచవ్యాప్తంగా ఉన్న మేధావులను అమెరికాకు తీసుకురావడానికి దశాబ్దాలుగా హెచ్-1బీ వీసా ఒక సంజీవనిలా పనిచేస్తోంది. ఈ విధానాన్ని మళ్లీ సులభతరం చేయడం ద్వారానే అమెరికా అంతర్జాతీయ మార్కెట్లో తన నంబర్ వన్ పోటీతత్వాన్ని నిలబెట్టుకోగలదని, ఆర్థిక వృద్ధి కుంటుపడకుండా చూసుకోగలదని ఈ బిల్లు మద్దతుదారులు బలంగా వాదిస్తున్నారు.

US వీసాదారులకు ట్రంప్ షాక్: H1B ఉంటే గ్రీన్ కార్డ్ రానట్టే?
US వీసాదారులకు ట్రంప్ షాక్: H1B ఉంటే గ్రీన్ కార్డ్ రానట్టే?

ముందుంది సుదీర్ఘ పోరాటం!

ట్రంప్ కఠిన నిర్ణయాలపై తిరుగుబాటుగా వచ్చిన ఈ బిల్లు, చట్ట రూపం దాల్చడం అంత సులువేమీ కాదు. అమెరికా చట్టసభల నియమాల ప్రకారం ఇది ప్రతినిధుల సభ (హౌస్ ఆఫ్ రిప్రజెంటేటివ్స్), ఆపై సెనేట్ ఆమోదం పొంది, చివరిగా దేశాధ్యక్షుడి సంతకంతో చట్టంగా మారాల్సి ఉంటుంది. ఇదొక సుదీర్ఘమైన, రాజకీయ సమరంతో కూడిన ప్రక్రియ అయినప్పటికీ... అమెరికా కాంగ్రెస్‌లో ఈ బిల్లు అడుగుపెట్టడం ద్వారా హెచ్-1బీ వీసా భవిష్యత్తుపై, అమెరికా ప్రగతిలో విదేశీ నైపుణ్యాల ప్రాధాన్యతపై సరికొత్త రణరంగానికి తెరలేచిందని విశ్లేషకులు భావిస్తున్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+