పఠాన్‌కోట్ ఎఫెక్ట్: పాక్‌కు ఎఫ్-16 ఫైటర్ జెట్స్ నిలిపివేత
న్యూఢిల్లీ: పంజాబ్‌లోని పఠాన్‌కోట్ ఎయిర్ బేస్‌పై జరిగిన ఉగ్రవాదుల దాడి పాకిస్థాన్‌ను ఇబ్బంది పెడుతోంది. తాజాగా పాకిస్థాన్‌తో కుదిరిన ఎఫ్-16 యుద్ధ విమానాల విక్రయాన్ని అమెరికా ప్రస్తుతానికి నిలిపివేసింది. ఇప్పటికిప్పుడు పాకిస్థాన్‌కు ఎఫ్-16 ఫైటర్ జెట్లను అందించలేమని అమెరికా చట్టసభ కాంగ్రెస్ తేల్చి చెప్పింది.
ఈ మేరకు ఓ తీర్మానాన్ని కూడా అమెరికన్ కాంగ్రెస్ ఆమెదించినట్లు పాకిస్థానీ న్యూస్ పేపర్ డాన్ ఓ కథనంగా పేర్కొంది. ఈ మేరకు సెనెట్ నుంచి ఒబామా పరిపాలనా విభాగం "హోల్డ్" నోటీసు పొందిందినట్లు డాన్ పత్రిక నివేదించింది. అయితే ఈ తీర్మానంలో ఎక్కడ కూడా పఠాన్ కోట్ ఉగ్రదాడిని అమెరికన్ కాంగ్రెస్ నేరుగా పేర్కొనలేదని మరింత సమాచారం, వివరణను సాకుగా చూపిందని పేర్కొంది.
పఠాన్‌కోట్‌లోని ఎయిర్ బేస్ సూత్రధారులపై కఠిన చర్యలు తీసుకోవాల్సిందేనని అమెరికా కూడా పాకిస్థాన్‌పై ఒత్తిడి తెచ్చింది. పఠాన్‌కోట్ ఉగ్రదాడికి రూపకల్పన పాకిస్థాన్‌లోనే జరిగిందని భారత్ ఆరోపిస్తున్న సంగతి తెలిసిందే. అంతేకాదు దీనికి సంబంధించిన ఆధారాలను కూడా పాకిస్థాన్‌కు అందజేసిన నేపథ్యంలో పాకిస్థాన్ కూడా ఈ ఉగ్రదాడి ఘటనపై బాగానే స్పందించింది.

పఠాన్‌కోట్ ఉగ్రదాడి సూత్రధారులను పట్టుకునేందుకు పాక్ అధికారులు దేశంలోని వివిధ ప్రాంతాల్లో దాడులు చేశారు. సోమవారం కొందరు అనుమానితులను అరెస్ట్ చేసినట్టు భారత్ నిఘా వర్గాలు వెల్లడించాయి. పాకిస్థాన్‌లోని గుజ్రన్ వాలా, జెలుమ్, బహవల్పూర్ జిల్లాల్లో దాడులు జరిగాయి.
కొందరు అనుమానాస్పద వ్యక్తులను అరెస్ట్ చేశారు. పఠాన్ కోట్ ఉగ్రదాడిలో వీరికి సంబంధముందా అనే కోణంలో విచారణ చేస్తున్నట్టు అధికారులు చెప్పారు. పఠాన్ కోట్ ఉగ్రదాడి ఘటనపై విచారణకు పాకిస్తాన్ ప్రధాని నవాజ్ షరీఫ్ ఓ దర్యాప్తు బృందాన్ని ఏర్పాటు చేశారు.
ఇందులో ఇంటలిజెన్స్ బ్యూరో, ఐఎస్ఐ, మిలటరీ ఇంటలిజెన్స్, ఫెడరల్ ఇంటలిజెన్స్ ఏజన్సీ, పోలీసులు సభ్యులుగా ఉన్నారు. పఠాన్ కోట్ ఉగ్రదాడి సూత్రధారులపై పాక్ చర్యలు తీసుకోకుంటే ఇరు దేశాల మధ్య విదేశాంగ కార్యదర్శల సమావేశం జరగదని ఎన్ఎస్ఏ అజిత్ దోవల్ హెచ్చరించిన సంగతి తెలిసిందే.












Click it and Unblock the Notifications