చైనాపై కొత్త పిడుగు: ఆ దిశగా అమెరికా: కమ్యూనిస్టు పార్టీ గూఢచర్యం: యూఎస్ కాంగ్రెస్ లేఖ
వాషింగ్టన్: ప్రపంచాన్ని మృత్యుముఖంలోకి నెట్టేసిన భయానక కరోనా వైరస్‌కు జన్మనిచ్చినట్టుగా అనుమానిస్తోన్న కమ్యూనిస్టు దేశం చైనాపై కొత్త పిడుగు పడబోతోంది. చైనా అంటే ఇప్పటికే ఒంటికాలి మీద లేస్తోన్న అగ్రరాజ్యం అమెరికా.. మరో కీలక నిర్ణయాన్ని తీసుకోవడానికి సన్నాహాలు చేస్తోంది. టిక్‌టాక్ సహా చైనా సంస్థలు రూపొందించిన అన్ని రకాల యాప్స్‌ను బ్యాన్ చేసే దిశగా అమెరికా చర్యలను తీసుకోబోతోంది. త్వరలోనే దీనికి సంబంధించిన ఆదేశాలపై అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ సంతకం చేయొచ్చని అంటున్నారు.
ఇప్పటికే భారత్.. చైనా యాప్స్‌ను నిషేధించింది. టిక్‌టాక్, యూసీ బ్రౌజర్, షేర్ ఇట్ వంటి 59 యాప్స్‌ను బ్యాన్ చేసింది భారత్. భారత్ తరహాలోనే అమెరికాలో కూడా చైనా యాప్స్ వినియోగాన్ని నిషేధించాలని యూఎస్ కాంగ్రెస్ సభ్యులు.. డొనాల్డ్ ట్రంప్‌కు లేఖ రాశారు. 25 మంది యూఎస్ కాంగ్రెస్ సభ్యులు ఈ లేఖపై సంతకాలు చేశారు. సాధ్యమైనంత త్వరగా చైనా యాప్స్‌ను నిషేధించాలంటూ విజ్ఙప్తి చేశారు. అమెరికా జాతీయ భద్రతను దృష్టిలో ఉంచుకుని ఈ నిర్ణయాన్ని తీసుకోవాలని వారు ట్రంప్‌కు సూచించారు.

చైనా యాప్స్‌ను ఎంతమాత్రం విశ్వసించవద్దని యూఎస్ సభ్యులు ట్రంప్‌కు సూచించారు. చైనా యాప్స్ మాత్రమే కాదు.. వెబ్‌సైట్లను కూడా నిషేధం జాబితాలో చేర్చాలని పేర్కొన్నారు. యాప్స్ ద్వారా కమ్యూనిస్టు పార్టీ ప్రభుత్వం అమెరికా భద్రతకు సంబంధించిన కీలకమైన, విలువైన సమాచారాన్ని చోరీ చేస్తోందని, డేటాను దొంగిలిస్తోందనే అభిప్రాయాలు వ్యక్తమౌతున్నాయని అననారు. జాతీయ భద్రతను దృష్టిలో ఉంచుకుని చైనా యాప్స్, వెబ్‌సైట్లను నిషేధించాలని కోరారు.

ఇదిలావుండగా.. టిక్‌టాక్ సహా చైనా యాప్స్‌ను నిషేధించడానికి ఉద్దేశించిన ఓ బిల్లును త్వరలోనే ఓటింగ్ కోసం సెనెట్‌లో ప్రవేశపెట్టే అవకాశం ఉంది. ఫెడరల్ ఉద్యోగులందరూ చైనా యాప్స్ వినియోగాన్ని నిషేధించేలా ఈ బిల్లును రూపొందించారు. రిపబ్లికన్ సెనెటర్ జాష్ హావ్‌లే వచ్చే వారం ఈ బిల్లును సెనెట్‌లో ప్రవేశపెడతారని అంటున్నారు. వీలైనంత త్వరగా చైనా యాప్స్ వినియోగాన్ని నిషేధించాల్సిన అవసరం ఉందని జాష్ అభిప్రాయపడ్డారు. చైనా యాప్స్‌ను నిషేధించ వచ్చని భారత్ నిరూపించిందని, దీన్ని అనుసరించాల్సి ఉందని చెప్పారు.

-
డొనాల్డ్ ట్రంప్ సడన్ యూటర్న్- యుద్ధ విరామం -
ఏడు రోజుల్లోనే ఆరు బ్యాంకుల్లో చోరీ.. కానీ దోచుకుంది మాత్రం..? -
నతాంజ్ అణు కేంద్రంపై బాంబుల వర్షం.. భారీ పేలుళ్లతో దద్దరిల్లిన ఇరాన్! -
పాతాళానికి బంగారం ధరలు- రంజాన్ పండగ వేళ -
తమిళనాడులో ఆ పార్టీదే అధికారం: విజయ్ రాకతో మారిన ఈక్వేషన్లు -
పల్నాడు, సింహాద్రి ప్రయాణీకులకు రైల్వే గుడ్ న్యూస్, ఇక నుంచి..!! -
3000 ఏళ్ల సంప్రదాయం.. యుద్ధం మధ్యే నూతన సంవత్సరం -
విడాకులపై మెగా డాటర్ "నిహారిక" కామెంట్స్.. అసలు కాంటాక్ట్ కూడా లేదు ?? -
40 ఏళ్లలో లేని అతిపెద్ద పసిడి పతనం. 1983 సీన్ రిపీట్! -
ఏప్రిల్ నెలలో సింహరాశి, కన్యారాశి జాతక ఫలం -
'దురంధర్ 2' ఓ చెత్త సినిమా: స్టార్ హీరోయిన్ -
రేషన్ లబ్దిదారులకు కేంద్రం గుడ్ న్యూస్- మూడు నెలల కోటా ఒకేసారి పంపిణీ












Click it and Unblock the Notifications