US Election 2020: జో బిడెన్‌దే విజయం అంటున్న ట్రంప్ అనుకూల మీడియా ఫాక్స్ న్యూస్

వాషింగ్టన్: అమెరికా అధ్యక్ష ఎన్నికలకు పోలింగ్ ముగిసింది. కౌంటింగ్ ప్రక్రియ కొనసాగుతోంది. ఈ క్రమంలోనే అధ్యక్ష రేసులో ఉన్న రిపబ్లికన్ అభ్యర్థి ప్రస్తుత అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మరియు డెమొక్రటిక్ అభ్యర్థి జో బిడెన్‌ల మధ్య పోరు ఉత్కంఠభరితంగా సాగుతోంది. పలు రాష్ట్రాల్లో డెమొక్రటిక్ అభ్యర్థి జోబిడెన్ ముందంజలో ఉండగా ఇంకొన్ని రాష్ట్రాల్లో ట్రంప్ దూసుకెళుతున్నారు. అయితే ఓవరాల్‌గా చూస్తే ప్రస్తుత అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌పై డెమొక్రాటిక్ అభ్యర్థి జోబిడెన్ స్వల్ప ఆధిక్యంతో దూసుకెళుతున్నారు.

ఇక ట్రంప్ అనుకూల మీడియా ఫాక్స్ న్యూస్ ఇస్తున్న ఫలితాల ప్రకారం డెమొక్రాటిక్ అభ్యర్థి జో బిడెన్ ముందంజలో ఉన్నారు. ఫాక్స్ న్యూస్ ప్రకారం జో బిడెన్‌కు 237 ఎలక్టొరాల్ ఓట్లు దక్కగా ట్రంప్‌కు 213 ఓట్లు లభించాయి. ఇక ఇద్దరు గెలిచేందుకు మ్యాజిక్ ఫిగర్ 270 ఎలక్టొరాల్ ఓట్లు అవసరం. కొన్ని ప్రధాన రాష్ట్రాలు జో బిడెన్ దక్కించుకున్నారు. కనెక్టికట్‌లోని న్యూయార్క్, కొలరాడోలో డెమొక్రాట్ జో బిడెన్ గెలిచారు. దక్షిణ డకోటాలో డోనాల్డ్ ట్రంప్ గెలిచారు. ఇక ఫ్లోరిడాలో మాత్రం ఇద్దరు పోటా పోటీగా సాగుతున్నారు. దక్షిణ కరోలినాలో ట్రంప్ విజయం సాధించారు.

US Election 2020 Results: Pro Trump media Fox news predicts Biden win in Presidential polls

ట్రంప్ ఇప్పటివరకు అలబామా, సౌత్ డకోటా, నార్త్ డకోటా, అర్కాన్సాస్, టేనస్సీ, వెస్ట్ వర్జీనియా, ఓక్లహోమా, కెంటుకీ మరియు ఇండియానాలో గెలిచారు. జార్జియాలో కూడా ట్రంప్ ముందంజలో ఉన్నట్లు ఫాక్స్ న్యూస్ పేర్కొంది. మొత్తానికి ఎప్పుడూ లేనంతగా ఈ సారి అమెరికా అధ్యక్ష ఎన్నికలు చాలా ఉత్కంఠభరితంగా సాగుతున్నాయి.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+