వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

డొనాల్డ్ ట్రంప్‌పై హత్యాయత్నం: యువకుడి అరెస్ట్

|
Google Oneindia TeluguNews

లాస్‌ఏంజిల్స్‌: రిపబ్లికన్‌ పార్టీ నుంచి అమెరికా అధ్యక్ష పదవికి పోటీపడుతున్న డొనాల్డ్‌ ట్రంప్‌పై హత్యాయత్నం జరిగింది. లాస్‌వెగాస్‌లో జరిగిన ర్యాలీలో ట్రంప్‌పై దాడి చేయడానికి 19 ఏళ్ల బ్రిటిష్‌ యువకుడు పోలీస్‌ అధికారి వద్ద ఉన్న తుపాకీ లాక్కొనేందుకు యత్నించాడు.

వెంటనే అప్రమత్తమైన పోలీసులు సదరు యువకుడ్ని అదుపులోకి తీసుకున్నారు. అతనిపై హత్యాయత్నం కేసు నమోదు చేశారు. నేవెడాలోని ఫెడరల్‌ కోర్టుకు పోలీసులు సమర్పించిన నివేదిక ప్రకారం.. మైకేల్‌ సాండ్‌ఫోర్డ్‌(20) అనే బ్రిటన్ యువకుడు శనివారం లాస్‌వెగాస్‌లోని మైస్టీర్‌ థియేటర్‌ వద్ద జరిగిన ర్యాలీలో పోలీసు అధికారి తుపాకీ లాక్కొనేందుకు ప్రయత్నించాడు.

దీంతో యువకుడిని అదుపులోకి తీసుకుని విచారించగా తాను ట్రంప్‌ను చంపడానికి కాలిఫోర్నియా నుంచి లాస్‌వెగాస్‌ వచ్చినట్లు తెలిపాడని పోలీసులు వెల్లడించారు. ట్రంప్‌పై దాడి చేయడానికే.. ర్యాలీకి ఒకరోజు ముందు తుపాకీ పేల్చడం నేర్చుకున్నానని.. అంతకుముందు తాను ఎప్పుడూ తుపాకీ పేల్చలేదని చెప్పాడు.

US election: Arrested Briton 'wanted to shoot Donald Trump'

తాను ఒకటి, రెండు రౌండ్లు మాత్రమే కాల్చగలనని.. ఆ తర్వాత భద్రతా సిబ్బంది తనను కాల్చేస్తారని ముందే తెలుసని యువకుడు పేర్కొనడం గమనార్హం. ఫొయెనిక్స్‌లో ట్రంప్‌ ప్రచార ర్యాలీకి కూడా టిక్కెట్‌ కొనుక్కున్నట్లు విచారణలో వెల్లడించాడు. లాస్‌వెగాస్‌లో ట్రంప్‌పై దాడి చేయడంలో విఫలమైతే మళ్లీ దాడి చేయాలనే ప్రణాళిక వేసుకున్నట్లు మైకేల్ వివరించాడు.

సాండ్‌ఫోర్డ్‌ అమెరికాలో గత 18 నెలలుగా ఉంటున్నాడు. హోబోకెన్‌, న్యూజెర్సీల్లో ఉన్న తర్వాత అతడు కాలిఫోర్నియా చేరుకున్నాడు. లాస్‌వెగాస్‌ ర్యాలీలో అమీల్‌ జాకోబ్‌ అనే పోలీస్‌ అధికారి గన్‌ అన్‌లాక్‌లో ఉందని, అదైతే సులువుగా కాల్పులు జరపొచ్చని ఆయన గన్‌ లాక్కొనే ప్రయత్నం చేసినట్లు విచారణలో యువకుడు పోలీసులకు తెలిపాడు.

తాను గన్‌ తెచ్చుకుని ఉంటే మెటల్‌ డిటెక్టర్‌లో దొరికిపోతాను కాబట్టి తేలేదని వివరించాడు. గతేడాదిగా సాండ్‌ఫోర్డ్‌ ట్రంప్‌ను హత్య చేసేందుకు ప్రయత్నిస్తున్నాడని.. చివరిగా ఇప్పుడు దాడి చేసే యత్నం చేశాడని పోలీసులు వెల్లడించారు. దర్యాప్తు కొనసాగుతోందని పోలీసులు తెలిపారు.

కాగా, వివాదాస్పద వ్యాఖ్యలతోనే డొనాల్డ్ ట్రంప్ తన ప్రచారాన్ని కొనసాగిస్తున్నారు. హత్యాయత్నం నేపథ్యంలో ట్రంప్‌కు మరింత భద్రతను పెంచారు. ఆయన ప్రసంగిస్తున్న సమయంలో కవచంలా ఆయన చుట్టూ భద్రత దళాలు నిల్చుంటున్నాయి.

English summary
A Briton who tried to grab a police officer's gun at a Donald Trump rally in Las Vegas said he wanted to shoot the US candidate, court papers say.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X