అమెరికా ఎన్నికల బ్యాలెట్ పేపర్‌పై తెలుగు భాష- అరుదైన గుర్తింపు- మరో ఆరు భాషలతో కలిపి...
అమెరికా అధ్యక్ష ఎన్నికల ప్రచారం చివరి దశకు చేరుకుంటోంది. ఈ ఎన్నికల్లో ఓటేసేందుకు లక్షల సంఖ్యలో ఉన్న ప్రవాస భారతీయులు సిద్ధమవుతున్నారు. వీరిలో కొందరు ఇప్పటికే ఆన్‌లైన్ ద్వారా ముందస్తు ఓటు వేశారు. మరికొందరు వచ్చే నెల 3వ తేదీన జరిగే పోలింగ్‌లో పాల్గొనబోతున్నారు. వీరి సౌకర్యం కోసం అమెరికా ప్రభుత్వం, ఎన్నికల యంత్రాగం పలు చర్యలు తీసుకుంటోంది.
అమెరికాలోని పలు రాష్ట్రాల్లో తెలుగు వారి జనాభా అధికంగా ఉంది. భారతీయుల మద్దతు కోసం తీవ్రంగా ప్రయత్నిస్తున్న అధ్యక్ష అభ్యర్ధులు ట్రంప్, బిడెన్ తెలుగు వారి మద్దతు కోసం తీవ్రంగా ప్రయత్నిస్తున్నారు. ఇప్పటికే అమెరికాలో తానా, నాటాతో పాటు మరికొన్ని సంఘాలు ఏర్పాటు చేసుకుని తెలుగు వారు గణనీయమైన ప్రభావం చూపిస్తున్నారు. దీంతో ఈ ఎన్నికల్లో వారిని తమవైపు తిప్పుకునేందుకు తీవ్ర ప్రయత్నాలు జరుగుతున్నాయి. అదే సమయంలో పోలింగ్‌లో వీరిని తప్పకుండా ఓటేసేలా చూసేందుకు అమెరికా ఎన్నికల యంత్రాగం కూడా ప్రయత్నిస్తోంది.

అమెరికా ఎన్నికల పోలింగ్‌లో వాడే బ్యాలెట్ పేపర్లను తెలుగువారు అర్ధం చేసుకునేందుకు వీలుగా మిగతా భాషలతో పాటు తెలుగును కూడా ముద్రించారు. మరో ఆరు భాషలతో కలిపి తెలుగులోనూ పలు సూచనలు చేశారు. పోలింగ్ సమయంలో భారీ సంఖ్యలో ఉన్న తెలుగు వారి సౌలభ్యం కోసం ఈ ఏర్పాట్లు చేసినట్లు అధికారులు చెబుతున్నారు.

బ్యాలెట్‌పై ఎన్నడూ లేని విధంగా తెలుగు భాషకు కూడా చోటు దక్కడంపై అక్కడి ప్రవాస తెలుగువారు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. అయితే తెలుగును అమెరికా ప్రభుత్వం అధికారికంగా గుర్తించినట్లు వార్తలు వచ్చినా అవి నిజం కాదని తేలింది. వాస్తవానికి అమెరికాలో ఇంగ్లీష్ సహా ఏ భాషనూ అధికారికంగా ప్రభుత్వం ఎన్నికల్లో గుర్తించలేదు.
Recommended Video
-
Bay of Pigs: క్యూబాలో అమెరికా ఎలా ఓడిపోయి లొంగిపోయింది ? నెక్ట్స్ ఇరానేనా ? -
ఇరాన్ సుప్రీం లీడర్ గా ట్రంప్ ? అమెరికా అధ్యక్షుడి తాజా షాక్..! -
మడమ తిప్పని ఇరాన్: శాంతి కోసం 5 కండీషన్లతో అమెరికాకు షాక్ -
H-1B వీసాదారులకు అమెరికా గుడ్ న్యూస్..! వేతనాల పెంపు ఇలా...! -
పెరుగులో ఉప్పు లేదా చక్కెర - ఆరోగ్యానికి ఎవరికి ఏది మంచిది..!! -
ఇక పెట్రోల్ బంకుల్లోనూ మద్యం.. కొత్త ఎక్సైజ్ పాలసీకి ఆమోదం! -
'ఆ ఒక్క కండీషన్ తో స్టార్ హీరోతో నిజంగానే శోభనం'.. హీరోయిన్ సంచలనం..!! -
అల్లు అర్జున్ "పుష్ప - 3"లో స్టార్ క్రికెటర్ విరాట్ కోహ్లీ భార్య.. -
హిట్ కొట్టాడురా సామీ!.. మిస్టరీ థ్రిల్లర్ అదిరిపోయింది..! -
ఓటీటీలోకి పవన్ కల్యాణ్ 'ఉస్తాద్ భగత్ సింగ్'.. ఆ రోజు నుంచే స్ట్రీమింగ్..? -
ఈ సినిమా చూస్తే ఈఎంఐల జోలికే పోరు సామి! -
వంట గ్యాస్ బుక్ చేసినా రావటం లేదా, ఇలా చేయండి.. వెంటనే..!!












Click it and Unblock the Notifications