US elections 2020: పోస్టల్ బ్యాలెట్స్ వల్ల ఎన్నికల తుది ఫలితం ఆలస్యం ? తేడా వస్తే ట్రంప్ రచ్చకు రెడీ
అమెరికా అధ్యక్ష ఎన్నికలు తుది అంకానికి చేరుకున్నాయి. హోరాహోరీగా ప్రచార పర్వం ముగిసిన తరువాత, ఓటర్ల తీర్పు ఎలా ఉంటుందన్న దానిపై ఇటు రిపబ్లికన్లు అటు డెమోక్రాట్లు తీవ్ర ఉత్కంఠతతో ఎదురుచూస్తున్నారు. కరోనా వైరస్ విజృంభిస్తున్నప్పటికీ అమెరికాలో ఎన్నికల ప్రక్రియ సజావుగానే సాగుతోంది . ఇప్పటికే తొమ్మిది కోట్ల మంది మెయిల్ బ్యాలెట్స్ ద్వారా తమ ఓటు హక్కును వినియోగించుకున్నట్లు తెలుస్తోంది .

కరోనా కాలంలో భారీగా పోల్ అయిన మెయిల్ బ్యాలెట్లు
కరోనా కారణంగా ఈసారి ఎక్కువ మంది పోస్టల్ బ్యాలెట్ వైపు మొగ్గు చూపారని సమాచారం. దీంతో ఈ పోస్టల్ బ్యాలెట్ ఓట్లను లెక్కించడానికి కాస్త ఎక్కువ సమయం సమయం పడుతుందని అంటున్నారు. ఈసారి ఎన్నికల ఫలితాలు మరింత ఆలస్యంగా వెలువడే అవకాశాలున్నాయని తెలుస్తోంది. అమెరికాలో ముందస్తు ఓటింగ్ ప్రక్రియ ఎప్పుడూ సర్వసాధారణంగా జరుగుతుంది. అయితే ఈసారి కరోనా నేపథ్యంలో ఎక్కువమంది ముందస్తు ఓటింగ్ ప్రక్రియ పైన మొగ్గుచూపారు. పోస్టల్ బ్యాలెట్ ద్వారా ముందస్తుగానే తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు.

మెయిల్ బ్యాలెట్ లను లెక్కించడానికి ఎక్కువ సమయం
ఈ పోస్టల్ బ్యాలెట్ లో నమోదైన ఓట్లు అత్యధికంగా డెమోక్రాట్ లకు పడినట్లుగా సమాచారం. తొమ్మిది కోట్ల మంది ఇప్పటికే ఓటు హక్కు వినియోగించుకున్నారు అంటే ఇప్పటికే భారీ స్థాయిలో పోలింగ్ నమోదైనట్టు గా తెలుస్తుంది. అయితే పోస్టల్ బ్యాలెట్ విధానాన్ని డెమోక్రాట్లు మద్దతు పలకగా, డొనాల్డ్ ట్రంప్ మాత్రం పోలింగ్ రోజే భారీగా ఓటు హక్కును వినియోగించుకోవాలని తన మద్దతుదారులకు సూచించారు. మరోపక్క నేరుగా వ్యక్తులు వేసిన ఓట్ల కంటే మెయిల్ బ్యాలెట్ లను లెక్కించడానికి ఎక్కువ సమయం తీసుకుంటుందని తెలుస్తుంది.

ట్రెండ్స్ ను బట్టి ఫలితం అర్ధం అయినా పక్కా రిజల్ట్స్ మాత్రం జాప్యం
ఈసారి ఎక్కువ మంది ఈమెయిల్ ద్వారా తమ ఓటును వేయడం వల్ల ఓట్ల లెక్కింపులో ఆలస్యం అవుతుందని, అవి చెల్లుబాటు అవుతాయో లేదో అధికారులు ధృవీకరించిన తర్వాత లెక్కింపు చేస్తారని తెలుస్తుంది. ఈసారి మెయిల్ బ్యాలెట్ లు భారీగా వస్తుండడంతో లెక్కింపుకు ఎక్కువ సమయం తీసుకుంటుంది . అయితే ఎన్నికలలో ఆయా రాష్ట్రాల నుండి వచ్చిన ట్రెండ్స్ ను బట్టి ఫలితం మరుసటి రోజుకే అర్థమైనా కచ్చితంగా తుది ఫలితం చెప్పడానికి మాత్రం ఆలస్యం అయ్యే అవకాశాలే ఎక్కువ ఉన్నాయని అధికారులు భావిస్తున్నారు.
Recommended Video

పోస్టల్ బ్యాలెట్స్ పై ట్రంప్ అనుమానాలు ... ఓడిపోతే న్యాయపోరాటానికి రెడీ
పోస్టల్ బ్యాలెట్ ద్వారా అవకతవకలు జరిగే అవకాశం ఉందని డొనాల్డ్ ట్రంప్ ఇప్పటికే వ్యతిరేకిస్తున్నారు. ఒకవేళ ట్రంప్ ఓడిపోతే ఎన్నికల ఫలితాలను సవాలు చేయడానికి ఇప్పటికే రంగం సిద్ధం చేసుకుంటున్నట్లు సమాచారం. ఒకవేళ అదే జరిగితే ఎన్నికల ఫలితం మరింత ఆలస్యమయ్యే అవకాశం ఉన్నట్లుగా విశ్లేషకులు చెబుతున్నారు. ఫలితాలవ్యవహారం కోర్టు కేసును ఎదుర్కోవడం కూడా ఆలస్యానికి కారణం అవుతుంది అంటున్నారు. ముఖ్యంగా ఎన్నికల రోజు రాత్రి తర్వాత ఓట్ల లెక్కింపు చెయ్యకూడదని కొత్త వాదన తీసుకొచ్చారు ట్రంప్. అంతేకాదు ఈ ప్రక్రియ కొన్ని వారాల పాటు కొనసాగకూడదని ఇప్పటికే పేర్కొన్న ట్రంప్ తనకు వ్యతిరేకంగా ప్రజా తీర్పు వస్తే మాత్రం న్యాయపోరాటం చేయనున్నట్లుగా తెలుస్తుంది.

పోస్టల్ బ్యాలెట్స్ విషయంలో ట్రంప్ కు ఆందోళన
ఇప్పటికే డోనాల్డ్ ట్రంప్ పోలింగ్ తేదీ రాత్రి సమయానికే ఈ ప్రక్రియ మొత్తం పూర్తయ్యేలా కోర్టులు రాష్ట్రాలపై ఒత్తిడి తీసుకురావాలని అంటున్నారు. అయితే అదే రోజు ఓట్ల లెక్కింపు పూర్తి చేయడం అసాధ్యమని పలువురు అభిప్రాయపడుతున్నారు. మొత్తానికి పోస్టల్ బ్యాలెట్ విషయంలో డోనాల్డ్ ట్రంప్ ఆందోళనకు గురవుతున్నారు. భారీ సంఖ్యలో పోస్టల్ బ్యాలెట్ లు నమోదు కావడంతో అవి తనకు వ్యతిరేకంగా నమోదయ్యాయని భావిస్తున్న ట్రంప్ ఎన్నికల ఫలితాలు తనకు అనుకూలంగా రాకుంటే మాత్రం రచ్చ చేయడానికి రెడీ అవుతున్నారు.
-
యుద్ధంలోకి అమెరికా నేవీ.. హార్మూజ్ జలసంధి అష్టదిగ్బంధనం.. ట్రంప్ సంచలన వార్నింగ్ -
ఇరాన్ తో చర్చల వేళ.. రష్యాకు బిగ్ షాక్ ఇచ్చిన ట్రంప్.. -
ఎక్కడ కొట్టాలో అక్కడ దెబ్బకొడుతున్న డొనాల్డ్ ట్రంప్..: ఫస్ట్ ట్రిగ్గర్ -
అమెరికా అధ్యక్షుడిగా ఇంతకంటే గర్వపడలేను -
తెలుగులో ప్రింటు ఖర్చులు కూడా రాలేదుగా అన్నా.. -
Tamil Nadu Election: రూటు మార్చిన విజయ్-సర్వేలు తేడా కొడుతున్న వేళ..! -
IPL 2026: ఆర్సీబీని వీడియో గేమ్ ఆడిన బుడ్డోడు.. నోరెళ్లబెట్టిన కోహ్లీ! -
రోజూ గుప్పెడు గింజలు తినండి.. షుగరు, బీపీ పూర్తిగా కంట్రోల్...!! -
ఎట్టకేలకు రైతుల ఖాతాల్లో నిధుల జమ, ఫలించిన నిరీక్షణ..!! -
AP Inter Results: ఏపీలో ఇంటర్ ఫలితాల ముహూర్తం ఫిక్స్, అఫీషియల్..!! -
బుమ్రా, హాజెల్ వుడ్.. నాకు ఎవడైనా ఒక్కటే: వైభవ్ సూర్యవంశీ -
SRH కొంపముంచిన క్లాసెన్ జిడ్డు బ్యాటింగ్












Click it and Unblock the Notifications