వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ప్రపంచానికి పెద్దన్న ఎవరు ? మారుతున్న ట్రెండ్స్ తో ట్రంప్ జో బైడెన్ ల మధ్య టఫ్ ఫైట్ !!

|
Google Oneindia TeluguNews

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ , డెమొక్రాటిక్ ప్రత్యర్థి జో బిడెన్ మధ్య తేడా తగ్గుముఖం పట్టడంతో అమెరికా అధ్యక్ష రేసు టఫ్ ఫైట్ గా మారనుంది అని తెలుస్తుంది . ముఖ్యంగా కీలక రాష్ట్రాల్లో, తాజా అభిప్రాయ సేకరణ ఎన్నికల ట్రెండ్స్ ను సూచించిన దానిబట్టి ఈ ఎన్నిక హోరాహోరీగా జరుగుతుంది అని అర్ధం అవుతుంది . 77ఏళ్ళ జో బిడెన్, 74 ఏళ్ళ ట్రంప్ పై 2.9 శాతం పాయింట్లతో ఆధిక్యంలో ఉన్నాడని తాజా అభిప్రాయ సేకరణ ద్వారా తెలుస్తుంది. అయితే అది కూడా మారవచ్చన్న సంకేతాలు కనిపిస్తున్నాయి.

US elections 2020:అధ్యక్ష పదవిని రియాల్టీ షో చేశారు..ట్రంప్ పై ఫైర్.. బైడెన్ కు మద్దతుగా బరాక్ ఒబామాUS elections 2020:అధ్యక్ష పదవిని రియాల్టీ షో చేశారు..ట్రంప్ పై ఫైర్.. బైడెన్ కు మద్దతుగా బరాక్ ఒబామా

 చివరి మూడు రోజుల్లో 40 కి పైగా ర్యాలీలు.. ప్రచారంలో దుమ్ము రేపిన ట్రంప్

చివరి మూడు రోజుల్లో 40 కి పైగా ర్యాలీలు.. ప్రచారంలో దుమ్ము రేపిన ట్రంప్

ట్రంప్ మరియు అతని కుటుంబం గత 15 రోజులుగా కీలకమైన రాష్ట్రాలలో ఎన్నికల ప్రచారం చేయడంతో బిడెన్ ఆధిక్యం కాస్త తగ్గినట్టయ్యింది .ఆయా రాష్ట్రాల్లో ట్రెండ్స్ మారాయి . ఉపాధ్యక్షుడు మైక్ పెన్స్‌తో కలిసి ట్రంప్ కుటుంబం ఎన్నికల చివరి మూడు రోజుల్లో సమిష్టిగా 40 కి పైగా ర్యాలీలు నిర్వహించింది. బిడెన్, తో పాటు ఉపాధ్యక్ష పీఠం కోసం సెనేటర్ కమలా హారిస్, మాజీ అధ్యక్షుడు బరాక్ ఒబామా కూడా గత కొద్ది రోజులుగా బహిరంగంగా కనిపించారు, కానీ ట్రంప్ ప్రచారానికి ఇది ఎక్కడా సరిపోలలేదు. అంతగా ట్రంప్ ఎన్నికల ప్రచారం నిర్వహించారు .

కీలక రాష్ట్రాల్లో ట్రంప్ ప్రచార ర్యాలీలు ... చేంజ్ అవుతున్న ట్రెండ్

కీలక రాష్ట్రాల్లో ట్రంప్ ప్రచార ర్యాలీలు ... చేంజ్ అవుతున్న ట్రెండ్

ఎన్నికల సందర్భంగా, బిడెన్ ఒహియోలో ఉండగా, ఒబామా ఫ్లోరిడాలో ప్రచారం చేస్తున్నారు. హారిస్ పెన్సిల్వేనియాలో ఉన్నారు. ట్రంప్ నార్త్ కరోలినా, ఫ్లోరిడా, విస్కాన్సిన్, పెన్సిల్వేనియా మరియు మిచిగాన్ అనే ఐదు రాష్ట్రాలలు కీలకం కావటంతో అక్కడ ఆయన ఐదు ర్యాలీలు నిర్వహించారు. దీంతో ట్రెండ్ లో మార్పు వచ్చింది . జాతీయంగా, రియల్ క్లియర్ పాలిటిక్స్ ప్రకారం ట్రంప్ సగటున బిడెన్‌పై 6.5 శాతం పాయింట్లు వెనుకబడి ఉన్నారు. కొన్ని రోజుల క్రితం వరకు, బిడెన్ ఆధిక్యం ఎనిమిది శాతం పాయింట్లు.

 కీలక రాష్ట్రాలపై దృష్టి పెట్టిన ట్రంప్

కీలక రాష్ట్రాలపై దృష్టి పెట్టిన ట్రంప్

అయితే, పెన్సిల్వేనియా, ఫ్లోరిడా, మిచిగాన్, అరిజోనా మరియు విస్కాన్సిన్ వంటి కీలక రాష్ట్రాల్లో ఎన్నికలు కొనసాగుతున్నందున, ఎన్నికలలో విజయం సాధించడానికి ట్రంప్ వ్యూహాత్మకంగా వ్యవహరిస్తున్నారు. కానీ జో బైడెన్ కే ఎక్కువ ఛాన్స్ ఉన్నట్టు ప్రచారం జరుగుతుంది . న్యూయార్క్ టైమ్స్ ప్రకారం, ఎన్నికలు సరిగ్గా సజావుగా ఉంటే, జో బిడెన్ మూడున్నర దశాబ్దాలలో ఇప్పటివరకు జరిగిన అధ్యక్ష ఎన్నికలలో అన్నిటికంటే అత్యంత నిర్ణయాత్మక విజయాన్ని నమోదు చేయగలడు, ఇది 1996 లో బిల్ క్లింటన్ విజయాన్ని అధిగమించే అతి పెద్ద విజయం అవుతుందని చెప్పారు. అయితే ఫైనల్ కు వచ్చే సరికి అది కాస్త మారినట్టు కనిపిస్తుంది.

 చివరి నిముషం వరకూ టఫ్ ఫైట్ నే .. సర్వత్రా ఉత్కంఠ

చివరి నిముషం వరకూ టఫ్ ఫైట్ నే .. సర్వత్రా ఉత్కంఠ

అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో కీలక రాష్ట్రాల్లో ఓటర్లు ఎవరి వైపు మొగ్గుతారన్నదే అత్యంత ప్రాధాన్యతతో కూడుకున్న అంశం . 2016 ఎన్నికల తరహాలో పాపులర్‌ ఓట్లు సాధించలేకపోయినా, స్వింగ్‌ రాష్ట్రాల ఎలక్టోరల్‌ కాలేజీ ఓట్లతో గట్టెక్కగలనన్న ధీమా డోనాల్డ్ ట్రంప్‌లో కనిపిస్తోంది. కీలక రాష్ట్రాల్లో బైడెన్‌కి స్వల్పంగానే ఆధిక్యమున్నట్టుగా పోల్‌ సర్వేలు చెబుతూ ఉండడంతో ఆఖరి నిముషంలో ఫలితం ఎలాగైనా మారే అవకాశం ఉందని అంటున్నారు . దీంతో చివరి నిముషం వరకు టఫ్ ఫైట్ జరగనుంది అని తెలుస్తుంది .

English summary
The US presidential race is headed for a tight finish with the margin between US President Donald Trump and his Democratic rival Joe Biden shrinking, particularly in key battle ground states, latest opinion polls indicated on Monday on the eve of the elections.Biden, 77, was leading Trump, 74, in the key battle ground States by 2.9 percentage points, which comes within margin of error, according to Real Clear Politics which maintains an average of major opinion polls.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X