US Election 2024:అమెరికా ఎన్నికల్లో మాటకు మాట-ఒబామా ఫ్యామిలీ వర్సెస్ ట్రంప్..!

అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో డొనాల్డ్ ట్రంప్, కమలా హ్యారిస్ మధ్య సాగుతున్న పోరు పతాకస్ధాయికి చేరింది. ఇప్పటికే ట్రంప్, కమలకు మద్దతుగా వారి అనుచరులు, మద్దతుదారులు విడిపోయి తీవ్ర మాటల యుద్ధం చేసుకుంటున్నారు. అదే సమయంలో కమలా హ్యారిస్ కు మద్దతుగా తాజాగా డెమోక్రాట్లు నిర్వహించిన సభ దీన్ని మరింత పతాక స్ధాయికి తీసుకెళ్లింది. ఇందులో ట్రంప్ ను టార్గెట్ చేస్తూ ఒబామా దంపతులు చేసిన వ్యాఖ్యలు తీవ్ర దుమారం రేపాయి. వాటిని ఒబామా భార్య మిషెల్ ఇంకా కొనసాగిస్తుండటంతో ట్రంప్ ఘాటుగా స్పందించారు. తానూ వ్యక్తిగత దాడులు చేయమంటారా అని ప్రశ్నించారు.

కమలా హ్యారిస్ నల్లగా ఉండేదని తనకు తెలియదని, ఈ మధ్యే తాను చెప్పుకుంటోందంటూ ఈ మధ్య ట్రంప్ చేసిన కామెంట్లపై స్పందించిన నల్లజాతీయురాలు మిషెల్ ఒబామా ఆయనపై విరుచుకుపడ్డారు. కొన్నేళ్లుగా ప్రజలను భయపెట్టేందుకు ట్రంప్ చేయాల్సిందంతా చేశారని, ప్రపంచం పట్ల అతనికి ఉన్న సంకుచిత దృక్పథాన్ని ఇద్దరు అత్యంత విజయవంతమైన విద్యావంతులు పటాపంచలు చేశారని మిషెల్ ఒబామా తమ దంపతుల గురించి చెప్పుుకున్నారు. ట్రంప్ కోరుకుంటున్న పదవి కూడా ఆ నల్ల ఉద్యోగాల్లో ఒకటిగా ఉందేమో ఎవరికి తెలుసని వ్యాఖ్యానించారు. అతనిది వికారమైన, స్త్రీద్వేష, జాత్యహంకార స్వభావం అని మిషెల్ విరుచుకుపడ్డారు.

US Elections 2024 Donald trump objections to Obama couple s personal attack after DNC speeches

దీనిపై ట్రంప్ ఘాటుగా బదులిచ్చారు. నార్త్ కరోలినాలో జరిగిన ప్రచార సభలో పాల్గొన్న ట్రంప్.. ఒబామా దంపతులు వ్యక్తిగత దాడులకు వ్యతిరేకమని చెప్పుకుంటారని, కానీ తాజాగా డెమోక్రాట్ల సభ అంతా అవే దాడులు చేశారని గుర్తుచేశారు. తననూ వ్యక్తిగత దాడులు చేయమంటారా అని ట్రంప్ ఒబామా దంపతులను ప్రశ్నించారు. మరోవైపు ట్రంప్ ను తన రాజకీయ ప్రత్యర్ధులపై వ్యక్తిగత విమర్శల కంటే దేశం ఎదుర్కొంటున్న సమస్యలపై ప్రచారంలో ఫోకస్ చేయాలని ఆయన పార్టీ రిపబ్లికన్లు కోరినట్లు తెలుస్తోంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+