H-1B visas : హెచ్ 1బీ వీసాలపై భారతీయులకు గుడ్ న్యూస్-భారత్ రాకుండా ఇక అక్కడే.
హెచ్ 1బీ వీసాలపై భారతీయులకు అమెరికాలోని జో బైడెన్ సర్కార్ మరో గుడ్ న్యూస్ చెప్పింది. ఇప్పటికే బైడెన్ అధికారంలోకి వచ్చాక భారతీయులకు వీసాల విషయంలో ఉదారంగా వ్యవహరిస్తున్న విషయం తెలిసిందే. ఇప్పుడు ఇదే క్రమంలో మరో నిర్ణయం కూడా తీసుకున్నారు. దీంతో భారతీయులతో పాటు పలు అభివృద్ధి చెందుతున్న దేశాలకు చెందిన టెకీలకు ప్రయోజనం కలగబోతోంది.
యూఎస్ దేశీయ వీసా విధానంలో పలు మార్పులు చేసేందుకు బైడెన్ సర్కార్ ప్రయత్నిస్తోంది. ఇందులో భాగంగాహెచ్ 1బీ వీసాలతో పాటు ఎల్1 వీసాలపై పది వేల మంది విదేశీ సాంకేతిక నిపుణులకు ప్రయోజనం చేకూరబోతోంది. అమెరికాలో కొన్ని విభాగాల్లో దేశీయ వీసా రీవ్యాలిడేషన్ ప్రక్రియను తిరిగి ప్రారంభించేందుకు బైడెన్ సర్కార్ సన్నాహాలు చేస్తోంది. ఈ ఏడాది చివరి కల్లా దీన్ని పైలట్ ప్రాజెక్టుగా చేపట్టబోతోంది. దీంతో ప్రధానంగా ఇప్పటికే యూఎస్ లో ఉంటున్న భారతీయ టెకీలకు మేలు కలుగుతుందని భావిస్తున్నారు.

2004 వరకూ యూఎస్ లో నాన్ ఇమ్మిగ్రెంట్ వీసాలకు, ముఖ్యంగా హెచ్1బీ వీసాలకు దేశీయంగానే వ్యాలిడేషన్ ఇచ్చేవారు. ఆ తర్వాత మాత్రం వీసాల పునరుద్ధరణ కోసం టెకీలు వారి స్వదేశాలకు వెళ్లాల్సి వస్తోంది. దీనికి చెక్ పెడుతూ ఈ ఏడాది చివర్లో వీసాల రీవ్యాలిడేషన్ దేశీయంగానే చేసేందుకు బైడెన్ సర్కార్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు తెలుస్తోంది. గతంలో తీసుకున్న నిర్ణయం మేరకు ప్రస్తుతం అమెరికాలో విదేశీయుల వీసాల రీవ్యాలిడేషన్ ప్రక్రియ నిలిచిపోయింది. బైడెన్ సర్కార్ దీన్ని పైలట్ ప్రాజెక్టుగా ఈ ఏడాది చివర్లో చేపట్టేందుకు సిద్ధమవుతోంది.












Click it and Unblock the Notifications