US advisory: భారత్‌కు అమెరికా గుడ్‌న్యూస్: ఇంకొద్దిరోజుల్లో..!
వాషింగ్టన్: భారత్‌లో కరోనా వైరస్ సెకెండ్ వేవ్ నెలకొల్పిన సంక్షోభ పరిస్థితులు తగ్గుముఖం పట్టాయి. రోజువారీ కేసులు పరిమితంగా నమోదవుతోన్నాయి. 40 వేల కంటే దిగవకు కొత్త కేసులు వెలుగులోకి వస్తోన్నాయి. డెల్టా ప్లస్ వేరియంట్ వ్యాప్తి చెందుతుండటం, థర్డ్‌వేవ్ ముప్పు పొంచివుందంటూ నిపుణులు చేస్తోన్న హెచ్చరికలకు అనుగుణంగా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అప్రమత్తంగా ఉంటోన్నాయి.
ముందుజాగ్రత్త చర్యలను తీసుకుంటోన్నాయి. కొంతకాలంగా కరోనా మహమ్మారి దాదాపుగా అదుపులోనే ఉండటం వల్ల భారత్‌తో విమానయాన సంబంధాలను తెంచుకున్న దేశాలన్నీ..వాటిని పునరుద్ధరించడంపై దృష్టి పెట్టాయి.

భారత్ కోసం యూఎస్ కొత్త ట్రావెల్ అడ్వైజరీ..
రాకపోకలు సాగించడానికి అనుకూల పరిస్థితులు నెలకొనడంతో అగ్రరాజ్యం అమెరికా భారత్‌కు సరికొత్తగా ట్రావెల్ అడ్వైజరీని జారీ చేసింది. భారత్‌కు వెళ్లొచ్చంటూ తమదేశ ప్రయాణికులకు సూచించింది. ఏప్రిల్ 29వ తేదీన జారీ చేసిన ట్రావెల్ అడ్వైజరీలో మార్పులు చేసింది.
ఇదివరకు అత్యంత ప్రమాదకరమైన లెవెల్ 4 ట్రావెల్ అడ్వైజరీని జారీ చేయగా.. ఆ కేటగిరీలో మార్పులు చేసి, లెవెల్ 3లోకి చేర్చింది. లెవెల్ 3 అంటే- తమదేశ పౌరులు ఎవరైనా భారత్‌కు రాకపోకలు సాగించవచ్చని అర్థం. భారత్‌కు వెళ్లడానికి అనుకూల పరిస్థితులు ఉన్నట్లు స్పష్టం చేసింది.

భారత్‌కు వెళ్లొచ్చంటూ..
అత్యంత సంక్షోభ పరిస్థితులను ఎదుర్కొంటోన్న దేశానికి మాత్రమే ఉద్దేశించిన ట్రావెల్ అడ్వైజరీ... లెవెల్ 4. ఆ దేశం జారీ చేసే ట్రావెల్ అడ్వైజరీల్లో ఇదే గరిష్ఠస్థాయికి చెందినది. అత్యంత అరుదైన సందర్భాల్లో మాత్రమే ఈ స్థాయి అడ్వైజరీని ఇస్తుంటుంది అమెరికా.
అందులో మార్పులు చేసింది. లెవెల్ 3ని జారీ చేసింది. భారత్‌తో పాటు పాకిస్తాన్‌కు కూడా ఇదేరకమైన ప్రయాణ సూచనలతో కూడిన బులెటిన్‌ను సెంటర్ ఫర్ డిసీజ్ కంట్రోల్ అండ్ ప్రీవెన్షన్ కొద్దిసేపటి కిందటే విడుదల చేసింది. ఇంకా కాంబోడియా, స్లొవేనియా వంటి దేశాలకు సంబంధించిన కొత్త ట్రావెల్ అడ్వైజరీని జారీ చేయాల్సి ఉంది.

విమాన సర్వీసులను పునరుద్ధరించే ఛాన్స్..
అమెరికా కొత్త ట్రావెల్ అడ్వైజరీని జారీ చేసిన నేపథ్యంలో- భారత్‌కు విమానాలను నడిపించడానికి ఆ దేశ విమానయాన సంస్థలు సిద్ధపడటం ఖాయంగా కనిపిస్తోంది. ఈ నెల చివరివరకు అంతర్జాతీయ విమాన సర్వీసులపై నిషేధం కొనసాగుతుంది. ఆ తరువాత వాటిని ఎత్తేయడానికే అవకాశాలు అధికంగా ఉన్నాయి.
మే 4వ తేదీన భారత్‌కు విమాన సర్వీసులను నిలిపివేసింది అమెరికా. వందేభారత్ మిషన్, గ్రీన్ కార్డ్ హోల్డర్ల కోసం మాత్రమే అప్పుడప్పుడు విమానాలను నడిపించింది. కమర్షియల్ ఫ్లైట్ సర్వీసులు ఇప్పటిదాకా అందుబాటులో లేవు. ఈ నెల చివరిలో గడువు ముగిసిన తరువాత.. విమానాలపై ఉన్న నిషేధాన్ని ఎత్తేసే అవకాశాలు లేకపోలేదు.












Click it and Unblock the Notifications