'సీక్రెట్'గా ఆ పనిలో ఉ.కొరియా: అమెరికాకు వణుకు.. యుద్దం ముంచుకొస్తుందా?
గత జులై నెలలో ఉత్తరకొరియా 3క్షిపణులను సబ్ మెరైన్ ద్వారా పరీక్షించిందని అమెరికా రక్షణశాఖ అధికారి ఒకరు తెలిపారు.
వాషింగ్టన్: అణు పరీక్షలతో ప్రపంచ శాంతికి విఘాతం కలిగించేలా వ్యవహరిస్తున్న ఉత్తరకొరియా.. మరో దుస్సాహాసానికి ఒడిగట్టిందన్న ప్రచారం జరుగుతోంది. ఇప్పటిదాకా ఇంటర్ కాంటినెంటల్ బాలిస్టిక్ మిస్సైల్స్ (ఖండాంతర క్షిపణుల) ను పరీక్షించడం ద్వారా ప్రపంచ దేశాలను ఉలిక్కిపడేలా చేసిన ఆ దేశం.. ఇప్పుడు సబ్ మెరైన్ మిసైల్ లాంఛ్ సిస్టమ్ ను కూడా పరీక్షిస్తున్నట్లు అమెరికా నిఘా వర్గాలు గుర్తించాయి.
ఎవరికీ ఏమాత్రం అనుమానం రాకుండా.. సముద్రంలో ఈ ప్రయోగాలు జరుపుతున్నట్లు అమెరికా వర్గాలు భావిస్తున్నాయి. మునుపెన్నడూ లేని రీతిలో ఉత్తరకొరియా సబ్ మెరైన్ వ్యవస్థలో కదలికలు మొదలవడం అమెరికా అనుమానాలకు ఊతమిస్తోంది.

గత జులై నెలలో ఉత్తరకొరియా 3క్షిపణులను సబ్ మెరైన్ ద్వారా పరీక్షించిందని అమెరికా రక్షణశాఖ అధికారి ఒకరు తెలిపారు.సిప్నో నావల్ షిప్ యార్డ్ విభాగంలో గత ఆదివారం జరిపిన క్షిపణి ప్రయోగానికి సంబంధించి తమ వద్ద సమాచారం ఉందన్నారు. గ్యాస్ ఒత్తిడి ఆధారంగా క్షిపణులను ప్రయోగిస్తున్నారని.. తద్వారా సబ్ మెరైన్ మిసైల్ లాంచ్ సిస్టమ్‌ను అభివృద్ధి చేసుకుంటున్నారని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు.
ఇప్పటివరకు అమెరికా భూభాగంపై లక్ష్యాలను చేధించేలా క్షిపణులను సిద్దం చేసుకున్న ఉత్తరకొరియా.. ఇక నుంచి ఆ దేశ నేవిని కూడా టార్గెట్ చేయాలని నిర్ణయించుకున్నట్లుగా ఉత్తరకొరియా తాజా కదలికలు స్పష్టం చేస్తున్నాయి. మరోవైపు కిమ్ జాంగ్ నియంతృత్వపు పోకడలు అమెరికా సహనానికి పరీక్షగా మారాయి.
ఇప్పటికే పుతిన్ ఇచ్చిన హామితో కాస్త వేచి చూసే ధోరణిని అవలంభిస్తున్న అమెరికాకు.. ఉత్తరకొరియా కార్యకలాపాలు ఏమాత్రం మింగుడుపడటం లేదు. అమెరికా ఏ క్షణంలో తన సహనం కోల్పోయిన.. ఉత్తరకొరియాతో యుద్దం ముంచుకురాక తప్పదు. ఈ రెండు దేశాలు యుద్దానికి సై అంటే.. ప్రపంచవ్యాప్తంగా అన్ని దేశాలపై ఆ ప్రభావం పడే అవకాశం ఉంటుంది.












Click it and Unblock the Notifications