షాక్: పాస్‌పోర్ట్ కావాలంటే లైంగిక నేరాలపై స్పష్టత ఇవ్వాలి

Posted By:
Subscribe to Oneindia Telugu

వాషింగ్టన్: పిల్లలపై లైంగిక నేరాలకు పాల్పడిన వ్యక్తుల పాస్‌పోర్టులపై వారి నేర చరిత్రను తెలిపేలా మార్పులు చేయాలని అమెరికా నిర్ణయించింది. పిల్లలపై లైంగిక దాడులకు పాల్పడిన వారి పాస్‌పోర్టులను రద్దుచేసే ప్రక్రియను త్వరలోనే ప్రారంభిస్తామని అమెరికా విదేశాంగశాఖ బుధవారం ప్రకటించింది.

తమపై కేసులున్నాయా... లేదా అనే విషయాన్ని పాస్‌పోర్ట్ కోసం ధరఖాస్తు చేసుకొనే సమయంలోనే స్పష్టత ఇవ్వాల్సిన అవసరం ఉందని అమెరికా విదేశాంగ శాఖ ప్రకటించింది.

పిల్లలపై లైంగిక దాడికి పాల్పడిన ఈ పాస్‌పోర్ట్‌దారుడు అమెరికా చట్టాల ప్రకారం విచారణ ఎదుర్కొన్నాడు అని పాస్‌పోర్ట్‌ వెనకవైపు ఉన్న కవర్‌ లోపల ఓ నోటీసును ముద్రిస్తారు.

 US passports to identify convicted child sex offenders

తొలిసారి పాస్‌పోర్టుకు దరఖాస్తు చేసుకునే వారికి కూడా ఈ నిబంధన అమలవుతుంది. ఈ చర్య ఒక వర్గానికి చెందిన నేరగాళ్లనే లక్ష్యంగా చేసుకునేలా ఉందని ఉదారవాదులు వ్యతిరేకిస్తున్నారు.

1994లో మేగన్‌ కంకా అనే ఏడేళ్ల చిన్నారిని ఓ వ్యక్తి రేప్‌చేసి హత్య చేసిన అనంతరం బాలబాలికల రక్షణకు రూపొందించిన 'అంతర్జాతీయ మేగన్‌ చట్టం' ప్రకారమే ఈ మార్పులు చేస్తున్నట్లు అమెరికా విదేశాంగ శాఖ ప్రకటించింది.

ఇంకా వివాహం చేసుకోలేదా? తెలుగు మ్యాట్రిమోనిలో నేడే రిజిస్టర్ చేసుకోండి - రిజిస్ట్రేషన్ ఉచితం!

English summary
The State Department began revoking the passports of convicted child sex offenders this week, in order to comply with a law passed last year. Those affected will have to apply for new passports, which will be marked to indicate their conviction.

Oneindia బ్రేకింగ్ న్యూస్
రోజంతా తాజా వార్తలను పొందండి