Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

వణుకుతున్న జపాన్: ఉ.కొరియా ఏం చేయబోతోంది?, నేడే మరో మిస్సైల్, రంగంలోకి అమెరికన్ సైన్యం

శనివారం రోజు ఉత్తరకొరియా మరో బాలిస్టిక్ మిస్సైల్ ప్రయోగం చేపట్టనుంది.దీంతో ఉత్తరకొరియా పొరుగు దేశం జపాన్ అమెరికా సహాయం కోరింది.జపాన్ విన్నపం మేరకు ఇప్పటికే అమెరికన్ సైన్యం జపాన్ లో అడుగుపెట్టింది.

ప్యోంగ్‌యాంగ్: అమెరికా రాయబారి నిక్కీ హేలీ చెప్పినట్లు ఉత్తరకొరియా మాటలతో లొంగే రకంగా కనిపించడం లేదు. అలా అని యుద్దానికి దిగడం కూడా సరైన మార్గం కాదు.

చర్చలకు అవకాశమివ్వకుండా.. ఆంక్షలకు లొంగకుండా అమెరికా పాలిట తలనొప్పిలా మారిన ఉత్తరకొరియా యుద్ద మంత్రానికి విరుగుడు ఏంటనేది ఎవరికీ అంతుపట్టడం లేదు.

ఐరాస ఆధ్వర్యంలో ప్రపంచ దేశాలన్ని ఏకమై ఉత్తరకొరియాకు వ్యతిరేకంగా స్పందిస్తున్న ఆ దేశం మాత్రం ఇసుమింతైనా చలించడం లేదు. సరికదా.. తన పాత పంథానే అనుసరిస్తూ మరోసారి క్షిపణి ప్రయోగానికి సిద్దమైంది.

ఇంతకుముందు జులై నెలలో అమెరికా స్వాతంత్ర్య దినోత్సవం సందర్బంగా క్షిపణి ప్రయోగం చేపట్టి కలకలం స్రుష్టించిన ఉత్తరకొరియా.. ఇప్పుడు తమ దేశ 69వ డెమెక్రటిక్ రిపబ్లిక్ డే వేడుకల సందర్భంలోను క్షిపణి ప్రయోగం చేపట్టాలని నిర్ణయించింది.

సెప్టెంబర్ 9న:

సెప్టెంబర్ 9న:

సెప్టెంబర్ 9తో డెమెక్రటిక్ రిపబ్లిక్ ఆఫ్ నార్త్ కొరియాకు 69ఏళ్లు పూర్తవుతుండటంతో ఈ సందర్భంగా క్షిపణి ప్రయోగం చేపట్టాలని అధ్యక్షుడు కిమ్ జాంగ్ ఉన్ భావిస్తున్నారు. ఇప్పటికే పదుల సంఖ్యలో క్షిపణి ప్రయోగాలు చేపట్టిన ఉత్తరకొరియా.. కేవలం ప్రపంచ దేశాలను భయపెట్టడానికే వీటి ప్రయోగం చేపడుతున్నట్లు అర్థమవుతోంది.

సైనిక చర్య వైపే ట్రంప్:

సైనిక చర్య వైపే ట్రంప్:

యుద్దానికి కాలుదువ్వే శత్రువు ముందు చర్చల కోసం సాగిలపడటం వ్యర్థం అనే అభిప్రాయంలో అమెరికా ఉంది. సైనిక చర్య మాత్రమే అంతిమ పరిష్కారాన్ని ఇవ్వగలదని అమెరికా అధ్యక్షుడు ట్రంప్ భావిస్తున్నారు. ఈ నేపథ్యంలో ఉత్తరకొరియా పొరుగునే ఉన్న దక్షిణ కొరియా, జపాన్ ల సహాయంతో ఆ దేశంపై సైనిక చర్య చేపట్టాలని యోచిస్తున్నారు.

జపాన్ లో సైన్యం మోహరింపు:

జపాన్ లో సైన్యం మోహరింపు:

శనివారం రోజు మరో బాలిస్టిక్ మిస్సైల్ ప్రయోగానికి ఉత్తరకొరియా సిద్దపడటంతో.. జపాన్ లో తమ సైన్యాన్ని అమెరికా మోహరించింది. జపాన్-అమెరికా ఇరు దేశాల ప్రయోజనార్థం ఈ సైన్యం మోహరింపు జరిగినట్లు తెలుస్తోంది.

నిజానికి జపానే అమెరికా సైన్యం సహాయం కోరినట్లు సమాచారం. గ్వామ్ ద్వీపాన్ని వినాశనం చేయడమే లక్ష్యంగా ఉత్తరకొరియా ప్రయోగిస్తున్న క్షిపణులన్ని జపాన్ మీదుగానే వెళ్తున్నాయి. ఈ క్రమంలో జరగరానిది ఏదైనా జరిగితే తమ దేశానికి తీవ్ర ముప్పు వాటిల్లుతుందని జపాన్ భయపడుతోంది. ఈ నేపథ్యంలోనే అమెరికా సైన్యం సహాయం కోరింది.

జపాన్ ప్రకటన:

జపాన్ ప్రకటన:

అలస్కా బ్రిగేడియర్ వెయిన్‌ వ్రైట్ ఆధ్వర్యంలో అమెరికన్ సైనికులు జపాన్ తీరప్రాంతం ఓరియంట్ షీడ్‌ లో అడుగుపెట్టారని ఆ దేశం ప్రకటించింది. ఉత్తరకొరియా బాలిస్టిక్ మిస్సైల్ ప్రయోగం నేపథ్యంలో తమ సైనికుల్లో ఆత్మస్థైర్యం నింపేందుకు అమెరికా సైన్యం జపాన్ లో అడుగుపెట్టినట్లు ప్రకటనలో పేర్కొన్నారు. జపాన్ సైన్యానికి యుద్ధ శిక్షణ ఇచ్చేందుకు ఇప్పటికే రెండు వారాల పాటు అమెరికా సైన్యం కార్యక్రమాలు నిర్వహించిందని జపాన్ తెలిపింది.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+