డీజిల్ ధరలు మండుతున్న వేళ ట్రంప్ కీలక ప్రకటన!
పశ్చిమాసియాలో ఇరాన్‌తో జరుగుతున్న యుద్ధం వల్ల ఇంధన సరఫరాకు తీవ్ర విఘాతం కలిగి ప్రపంచవ్యాప్తంగా డీజిల్ ధరలు ఆకాశాన్నంటుతున్న వేళ అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కీలక ప్రకటన చేశారు. అమెరికా తీవ్ర ఒత్తిడి తెచ్చిన అనంతరం తమ వద్ద నిల్వ ఉన్న అత్యవసర డీజిల్ నిల్వలను విడుదల చేసేందుకు ఐరోపా దేశాలు అంగీకరించాయని ఆయన తెలిపారు. ఈ నిల్వల విడుదల ప్రక్రియ తక్షణమే ప్రారంభమవుతుందని డొనాల్డ్ ట్రంప్ తన 'ట్రూత్ సోషల్'వేదికగా స్పష్టం చేశారు.
జీ7 నాయకుల అత్యవసర సమావేశం
అమెరికా హెచ్చరికల నేపథ్యంలో ఐరోపా యూనియన్ దేశాలు అత్యవసర చర్చలు నిర్వహించాయి. దీనిలో భాగంగా ఐరోపా సమాఖ్యకు చెందిన దేశాలు 50 మిలియన్ బారెళ్ల డీజిల్‌ను విడుదల చేయాలని ఫ్రాన్స్ ఓ ప్రాథమిక ప్రతిపాదనను తెచ్చింది. దీనికి అదనంగా ఇంటర్నేషనల్ ఎనర్జీ ఏజెన్సీ సభ్య దేశాల ద్వారా మరో 50 మిలియన్ బారెళ్ల క్రూడ్ ఆయిల్‌ను మార్కెట్లోకి వదలాలని ప్రణాళిక రూపొందించారు. ఈ అంశంపై ఇరాన్ యుద్ధం వల్ల పెరిగిన ఇంధన ధరలను నియంత్రించడానికి, అమెరికా ఒత్తిడి మేరకు యూరప్ దేశాలు తమ వద్ద ఉన్న అత్యవసర డీజిల్ నిల్వలను విడుదల చేయడానికి అంగీకరించాయని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ వెల్లడించారు. యూరప్ వెంటనే తమ డీజిల్ నిల్వలను విడుదల చేసే ప్రక్రియను ప్రారంభిస్తుందని ఆయన ట్రూత్ సోషల్ వేదికగా తెలిపారు. ప్రపంచవ్యాప్తంగా ఇంధన సరఫరాలకు అంతరాయం ఏర్పడుతున్న నేపథ్యంలో ఈ నిర్ణయం వెలువడింది.

ఫ్రాన్స్ ప్రతిపాదన మేరకు యూరప్ దేశాలు 50 మిలియన్ బ్యారెళ్ల డీజిల్‌ను అలాగే అంతర్జాతీయ ఇంధన సంస్థ సభ్య దేశాలు మరో 50 మిలియన్ బ్యారెళ్ల క్రూడ్ ఆయిల్‌ను విడుదల చేయడంపై శుక్రవారం చర్చలు జరిగాయి. రాబోయే 20 రోజుల్లో ఈ నిల్వలను విడుదల చేసేలా ప్రణాళిక రూపకల్పన చేశారు. అమెరికా నుంచి వస్తున్న ఒత్తిడికి అనుగుణంగానే ఈ చర్యలు చేపట్టినట్లు సమాచారం. ఈ అంశంపై ఫ్రాన్స్ అధ్యక్షుడు ఎమ్మాన్యుయెల్ మాక్రాన్ జీ7 నాయకులతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు.
ఈ డీజిల్ నిల్వల విడుదల వార్తల నేపథ్యంలో డీజిల్ ధరలు తగ్గుముఖం పట్టాయి. అమెరికా డీజిల్ ఫ్యూచర్స్ ధరలు 4 శాతానికి పైగా తగ్గి గ్యాలన్‌కు 4.4491 డాలర్ల వద్దకు చేరుకోగా.. యూరప్ బెంచ్ మార్క్ డీజిల్ ఫ్యూచర్స్ టన్నుకు 100 డాలర్ల కంటే ఎక్కువ పడిపోయాయి. నవంబర్ 3న జరగనున్న మిడ్‌టర్మ్ ఎన్నికల నేపథ్యంలో ఇంధన ధరలను తగ్గించడానికి అమెరికా డీజిల్ ఎగుమతులపై నిషేధం విధించే యోచనలో ఉండటంతో ఐరోపాపై ఈ ఒత్తిడి పెరిగింది.
అయితే అత్యవసర నిల్వలను ఖాళీ చేయడం వల్ల భవిష్యత్తులో వచ్చే సరఫరా అంతరాయాలను తట్టుకునే శక్తి తగ్గుతుందనే ఆందోళన కూడా యూరప్ దేశాల్లో వ్యక్తమవుతోంది. ఇరాన్ యుద్ధం కారణంగా గల్ఫ్ దేశాల నుంచి రావాల్సిన ఇందన రవాణా ఇప్పటికే ప్రభావితమైంది. దీనికి తోడు ఉక్రెయిన్ దాడుల వల్ల రష్యా రిఫైనరీలు దెబ్బతినడం, చైనా రిఫైనరీలు తమ స్వదేశీ అవసరాల కోసం ఎగుమతులను నిలిపివేయడం ప్రపంచవ్యాప్తంగా డీజిల్ కొరతకు దారితీశాయి.
యూరప్ తన వద్ద ఉన్న అత్యవసర నిల్వల నుంచి 50 మిలియన్ బ్యారెళ్లను విడుదల చేస్తే అది యూరోపియన్ యూనియన్ వద్ద ఉన్న మొత్తం డీజిల్ నిల్వల్లో 17 శాతానికి సంవత్సర వినియోగంలో 3 శాతానికి సమానం అవుతుంది. గతంలో రష్యా, మిడిల్ ఈస్ట్ దేశాలపై ఆధారపడిన యూరప్.. 2026 ప్రారంభం నుంచి ఇంధన అవసరాల కోసం అమెరికా, సౌదీ అరేబియాపై ఎక్కువగా ఆధారపడుతోంది. అమెరికా ఎగుమతుల నిషేధాన్ని నివారించేందుకు యూరప్ ఈ నిల్వలను విడుదల చేసేందుకు సిద్ధమైంది.














Click it and Unblock the Notifications
