వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

డొనాల్డ్ ట్రంప్ ట్విట్టర్ అకౌంట్ పాస్‌వర్డ్ ఏమిటో తెలుసా: బయట పెట్టిన హ్యాకర్

|
Google Oneindia TeluguNews

వాషింగ్టన్: అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌కు చెందిన మైక్రో బ్లాగింగ్ ప్లాట్‌ఫాం ట్విట్టర్ అకౌంట్‌పై సైబర్ నేరగాళ్లు దాడి చేశారు. ఆయన ట్విట్టర్ అకౌంట్‌ను హ్యాక్ చేశారు. ట్విట్టర్ అకౌంట్ పాస్‌వర్డ్‌ను సైతం కొట్టేశారు. ట్విట్టర్‌ పోస్టుల్లో అనధికారికంగా, ఎవరి అనుమతి లేకుండా మార్పులు చేర్పులు చేశారు. ఎన్నికల ప్రచార సమయంలో అంటే.. ఈ ఏడాది అక్టోబర్ 16వ తేదీన ఈ ఘటన చోటు చేసుకోగా.. ఇటీవలే హ్యాకర్‌ను గుర్తించారు అమెరికా అధికారులు. అతని కేసు నమోదు చేశారు. అతణ్ని నెదర్లాండ్ పౌరుడిగా గుర్తించారు.

ఆస్ట్రో రాజాకు మరో బంపర్ ఆఫర్: స్పేస్ ఎక్స్: మిషన్ కమాండర్‌గాఆస్ట్రో రాజాకు మరో బంపర్ ఆఫర్: స్పేస్ ఎక్స్: మిషన్ కమాండర్‌గా

అతని పేరు విక్టర్ గెవెర్స్. ఈ ఏడాది అక్టోబర్ 16వ తేదీన అతను ట్రంప్ అధికారిక ట్విట్టర్ అకౌంట్‌లో చొరబడ్డాడు. ట్విట్టర్ అకౌంట్ సెక్యూరిటీ సిస్టమ్‌ను బ్రేక్ చేశాడు. అకౌంట్‌ను తన చేతుల్లోకి తీసుకున్నాడు. డొనాల్డ్ ట్రంప్ ట్విట్టర్ అకౌంట్ పాస్‌వర్డ్‌ను గుర్తించాడు. "maga2020!" పదాన్ని డొనాల్డ్ ట్రంప్ అప్పట్లో తన ట్విట్టర్ అకౌంట్ పాస్‌వర్డ్‌గా వినియోగించారు. అధ్యక్ష ఎన్నికల్లో రిపబ్లికన్ పార్టీ ఎన్నికల స్లోగన్.. మేక్ అమెరికా గ్రేట్ అగైన్. ఇందులోని ఒక్కో పదానికి చెందిన తొలి అక్షరాన్ని వినియోగించి డొనాల్డ్ ట్రంప్ తన ట్విట్టర్ అకౌంట్ పాస్‌వర్డ్‌గా వినియోగించారు.

US President Donald Trumps Twitter account was hacked, Dutch ministry confirms

ట్విట్టర్ అకౌంట్ హ్యాక్‌కు గురైనట్లు అప్పట్లో వార్తలు వచ్చినప్పటికీ.. వైైట్‌హౌస్ దాన్ని తోసిపుచ్చింది. అకౌంట్ హ్యాక్ కాలేదని, సాంకేతిక ఇబ్బందులు ఏర్పడినట్లు వివరణ ఇచ్చింది. అప్పట్లో వెలువడిన ఈ ప్రకటన తప్పు అని తేలింది. తాజాగా విక్టర్ గెవెర్స్‌ను నెదర్లాండ్ ప్రభుత్వం న్యాయస్థానం ముందు ప్రవేశపెట్టింది. విచారణ సందర్భంగా అతను.. ఎథికల్ హ్యాకర్‌గా గుర్తించింది. దీనితో అతనిపై ఎలాంటి చర్యలు తీసుకోలేదు. జరిమానాలను విధించలేదు. ఎథికల్ హ్యాకర్లపై ఎలాంటి చర్యలు తీసుకోకూడదని నెదర్లాండ్ చట్టాలు చెబుతున్నాయి.

Recommended Video

GHMC Mayor election: SEC releases key circulars | Oneindia Telugu

హ్యాకర్లను శిక్షించడానికి కఠిన చట్టాలు ఉన్నప్పటికీ.. ప్రత్యేక సందర్భాల్లో మినహాయింపునిచ్చారు. ఎథికల్ హ్యాకర్లపై చర్యలు తీసుకునే నిబంధనలు లేవు. అమెరికా అధ్యక్షుడి ట్విట్టర్ అకౌంట్ సెక్యూరిటీ వ్యవస్థ బలహీనమైనదని వెల్లడించడానికే తాను హ్యాక్‌కు పాల్పడినట్లు విక్టర్ పేర్కొన్నాడు. తన ట్విట్టర్ అకౌంట్ సెక్యూరిటీ కోసం ఆయన కనీస భద్రతా ప్రమాణాలను కూడా పాటించలేదనే విషయం తేలిందని అన్నాడు. ట్విట్టర్ అకౌంట్ పాస్‌వర్డ్‌ను తెలుసుకోవడంలో నాలుగుసార్లు విఫలం అయ్యాయనని, అయిదో ప్రయత్నంలో తెలుసుకోగలిగానని స్థానిక మీడియాకు అతను వివరించాడు.

English summary
Dutch prosecutors have confirmed that Donald Trump’s Twitter account was hacked in October despite denials from Washington and the company, but said the “ethical hacker” would not face charges.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X