ప్రపంచబ్యాంక్ అధ్యక్షుడిగా భారతీయుడు- స్వయంగా నియమించిన జో బైడెన్
వరల్డ్ బ్యాంక్ పై భారతీయ జెండా ఎగిరింది. ప్రపంచబ్యాంక్ అధ్యక్షుడిగా భారతీయుడు అజయ్ బంగాను అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ నామినేట్ చేశారు. ఈ మేరకు వైట్ హౌస్ ఓ ప్రకటన విడుదల చేసింది.
వాషింగ్టన్: ప్రపంచబ్యాంక్ పై భారతీయ జెండా ఎగిరింది. భారత్ కు చెందిన నిపుణులు పలు ప్రఖ్యాత మల్టీ నేషనల్ కంపెనీలకు చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్లుగా వ్యవహరిస్తోన్నారు. ఈ క్రమంలో మరో అడుగు ముందుకు పడింది. ఇప్పుడు తాజాగా ఏకంగా ప్రపంచబ్యాంక్ అధ్యక్ష పగ్గాలు కూడా భారత్ కే దక్కాయి. ప్రపంచం మొత్తం భారత్ వైపు చూపులు సారిస్తోందనడానికి వరల్డ్ బ్యాంక్ ఓ ఉదాహరణగా నిలిచింది.
ప్రపంచ బ్యాంక్ అధ్యక్షుడిగా భారతీయుడైన అజయ్ బంగా నియమితులయ్యారు. అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ ఆయనను నామినేట్ చేశారు. ఈ మేరకు వైట్ హౌస్ కొద్దిసేపటి కిందటే ఓ ప్రకటన విడుదల చేసింది. ప్రపంచబ్యాంక్ అధ్యక్ష పదవి నుంచి వైదొలగాలని నిర్ణయించుకున్నట్లు డేవిడ్ మల్పాస్ ప్రకటించిన కొన్ని గంటల్లోనే అజయ్ బంగాను ఆ అత్యున్నత స్థానానికి నామినేట్ చేశారు జో బైడెన్.
63 సంవత్సరాల అజయ్ బంగా.. మహారాష్ట్రలోని పుణేలో జన్మించారు. ప్రస్తుతం ఈక్విటీ సంస్థ జనరల్ అట్లాంటిక్‌లో వైస్ ఛైర్మన్ గా పనిచేస్తోన్నారు. గతంలో మాస్టర్ కార్డ్‌లో చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ గా వ్యవహరించారు. ఢిల్లీలోని సెయింట్ స్టీఫెన్స్ కళాశాలలో చదువుకున్నారు. ఎకనామిక్స్‌లో బ్యాచిలర్ డిగ్రీని పూర్తి చేశారు. అనంతరం ప్రతిష్ఠాత్మక అహ్మదాబాద్ లోని ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మేనేజ్‌మెంట్ లో ఎంబీఏ చదివారు.

విద్యాభ్యాసాన్ని పూర్తి చేసిన తరువాత అజయ్ బంగా- నెస్ట్లె ఇండియాలో చేరారు. అనంతరం సిటీ బ్యాంక్ లో జాయిన్ అయ్యారు. 1996లో అమెరికాకు వెళ్లిపోయారు. పెప్సికోలో ఉన్నత హోదాలో చేరారు. పెప్సికో ఇండియా, ఆగ్నేయాసియాలో కంపెనీ కార్యకలాపాల చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ గా 13 సంవత్సరాల పాటు పని చేశారు. 2009లో అజయ్ బంగా.. మాస్టర్ కార్డ్ అధ్యక్షుడిగా, చీఫ్ ఆపరేటింగ్ ఆఫీసర్‌గా ప్రమోట్ అయ్యారు.
ఆ తరువాతి సంవత్సరంలోనే సీఈఓగా అపాయింట్ అయ్యారు. బంగా సారథ్యంలో మాస్టర్ కార్డ్ కార్యకలాపాలు ప్రపంచవ్యాప్తంగా విస్తృతం అయ్యాయి. ఆర్థిక, వాణిజ్యరంగాల్లో ఆయన చేసిన సేవలను గుర్తించిన కేంద్ర ప్రభుత్వం 2016లో పద్మశ్రీ పురస్కారాన్ని ఇచ్చి గౌరవించింది. ఇప్పుడు తాజాగా ప్రపంచబ్యాంక్ అధ్యక్షుడిగా అజయ్ బంగా నియమితులయ్యారు. జో బైడెన్ స్వయంగా ఆయనను నామినేట్ చేశారు.












Click it and Unblock the Notifications