రష్యా-ఉక్రెయిన్ పోరులోకి అమెరికా ? పుతిన్ అణు, రసాయన దాడికి దిగితే - కౌంటర్ అటాక్ కు రెడీ

ఉక్రెయిన్ పై రష్యా సాగిస్తున్నకు నెల రోజులు పూర్తయ్యాయి. అయినా ఫలితం తేలేలా కనిపించడం లేదు. మరోవైపు రష్యా భారీ నష్టాల్ని చవిచూస్తోంది. దీంతో పుతిన్ అసహనం రోజురోజుకీ పెరిగిపోతోంది. ఓవైపు చర్చలకు ప్రతిపాదిస్తూనే మరోవైపు దాడులు చేస్తున్న రష్యా తీరుపై ఉక్రెయిన్ మండిపడుతోంది. దీంతో రష్యా మరో మార్గం లేక ఉక్రెయిన్ పై అణు, రసాయన దాడులకు దిగే అవకాశాలున్నట్లు తెలుస్తోంది. అదే జరిగితే యుద్ధంలోకి ఎంట్రీ ఇచ్చేందుకు యూఎస్ కూడా రంగం సిద్ధం చేసుకుంటున్నట్లు తాజా నివేదికలు వెల్లడిస్తున్నాయి.

 రష్యాకు ఎదురుదెబ్బలు

రష్యాకు ఎదురుదెబ్బలు

ఉక్రెయిన్ పై పోరుకు దిగిన రష్యాకు ఇప్పట్లో ఫలితం లభించేలా కనిపించడం లేదు. అదే సమయంలో ఉక్రెయిన్ లో రష్యా సేనలకు ఎదురుదెబ్బలు ఎక్కువవుతున్నాయి. మరికొంతకాలం అక్కడే ఉంటే రష్యా భారీ నష్టాల్ని చవిచూసే ప్రమాదం పొంచి ఉందనే నివేదికలు వెలువడుతున్నాయి. ముఖ్యంగా మందుగుండి సామాగ్రితో పాటు ఆయుధాల కొరత ఎదురవుతుందని, వేల సంఖ్యలో సైనికుల్ని కూడా కోల్పోయే ప్రమాదముందని తెలుస్తోంది. దీంతో రష్యాలో అసహనం పెరిగిపోతోంది.

అసహనంగా పుతిన్

అసహనంగా పుతిన్

ఉక్రెయిన్ తో మొదలుపెట్టిన పోరు ఇప్పట్లో పూర్తయ్యేలా కనిపించకపోవడం, యుద్ధాన్ని ముగించే దారులు కూడా కనిపించకపోవడం, చర్చలకు ఉక్రెయిన్ మొరాయిస్తుండటంతో రష్యా అధినేత వ్లాదిమీర్ పుతిన్ లో అసహనం పెరిగిపోతోంది. అన్నింటికంటే మించి ఉక్రెయిన్ పోరులో రష్యాకు తగులుతున్న ఎదురుదెబ్బలతో స్వదేశంలోనూ పుతిన్ ప్రతిష్ట మసకబారుతోంది. ఇన్నాళ్లూ పుతిన్ అంటే గొప్ప నేతగా, ప్లానర్ గా ఉండే పేరు కాస్తా పోతోంది. దీంతో ఆయన దగ్గర సలహాదారులు సైతం ఈ యుద్ధాన్ని నిరసిస్తూ పదవుల్ని వదులుకుంటున్నారు. ఇది పుతిన్ లో మరింత అసహనం పెంచుతోంది.

 అణు, రసాయన దాడికి ప్లాన్

అణు, రసాయన దాడికి ప్లాన్

ఓవైపు ఉక్రెయిన్ వార్ ఫలితం తేలకపోవడం, పశ్చిమదేశాలు జెలెన్ స్కీకి చేస్తున్న సాయంతో ప్రతిఘటన రోజురోజుకీ పెరిగిపోతుండటం, స్వదేశంలో తన ప్రతిష్ట మసకబారుతుండటంతో పుతిన్ ఇక చివరి అస్త్రంగా అణు, రసాయన దాడులకు ప్లాన్ చేస్తున్నట్లు తెలుస్తోంది. పరిమితంగా అయినా అణు, రసాయన దాడులు చేయడం ద్పారా ఉక్రెయిన్ ను దెబ్బ తీయాలని, తద్వారా యుద్ధంలో తామే గెలిచామన్న సంకేతాలు పంపాలనేది పుతిన్ వ్యూహంగా కనిపిస్తోంది. అదే జరిగితే ప్రపంచ దేశాలు ఎలా స్పందిస్తాయన్న దానిపైనే పుతిన్ మల్లగుల్లాలు పడుతున్నారు.

రష్యా-ఉక్రెయిన్ పోరులో అమెరికా ?

రష్యా-ఉక్రెయిన్ పోరులో అమెరికా ?

ఒకవేళ ఉక్రెయిన్ లో రష్యా రసాయన, అణ్వాయుధాలను దాన్ని క్షణాల్లో తిప్పికొట్టేందుకు అమెరికా సిద్ధమవుతోంది. ఇందుకోసం అత్యవసర ప్రణాళికను అమెరికా సిద్ధం చేస్తున్నట్లు తాజా నివేదికలు వెల్లడిస్తున్నాయి. రష్యా ఉక్రెయిన్‌పై రసాయన, జీవ లేదా అణ్వాయుధాలను ఉపయోగిస్తే యూఎస్ ఒక ఆకస్మిక ప్రణాళికను రూపొందించిందని న్యూయార్క్ టైమ్స్‌ని ఉటంకిస్తూ కీవ్ ఇండిపెండెంట్ నివేదించింది.'టైగర్ టీమ్' అని పిలువబడే జాతీయ భద్రతా అధికారుల బృందం, రష్యా నాటో భూభాగాల్లోని కాన్వాయ్‌లపై దాడి చేస్తే, ఉక్రెయిన్‌కు ఆయుధాలు, సహాయాన్ని అందించే అంశంపై ఈ టీమ్ అధ్యయనం చేస్తున్నట్లు తెలుస్తోంది. మార్చి 24న అన్ని సభ్య దేశాల నాయకుల మధ్య జరగనున్న నాటో సమావేశంలో ఈ అత్యవసర అంశాలు ప్రధానమైనవిగా భావిస్తున్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+