హనీమూన్ కోసం అది కావాలని!: చిక్కుల్లో అమెరికా ట్రెజరీ చీఫ్..

Subscribe to Oneindia Telugu

వాషింగ్టన్: వ్యక్తిగత అవసరాల కోసం మిలటరీ విమానం అడిగారన్న విమర్శలు ఎదుర్కొంటున్నారు అమెరికా ట్రెజరీ చీఫ్ స్టీవెన్ నుచిన్. ఇటీవలే ఓ హాలీవుడ్ నటిని వివాహం చేసుకున్న ఆయన.. హనీమూన్ కోసం మిలటరీ జెట్ అడిగారన్న విమర్శలు వినిపిస్తున్నాయి.

అంతేకాదు!.. ప్రయాణ ఖర్చులను కూడా ప్రభుత్వమే చెల్లించాలని ఆయన కోరినట్లుగా ప్రచారం జరిగింది. మరోవైపు నుచిన్ మాత్రం ఈ ప్రచారాన్ని తీవ్రంగా ఖండించారు. తన వ్యక్తిగత అవసరాల కోసం తాను జెట్ అడగలేదని, అదీగాక ప్రభుత్వాన్నే ఖర్చు భరించాలని కోరడం పచ్చి అవాస్తవమని ఆయన అన్నారు.

 US Treasury chief sought Air Force jet for European honeymoon

భద్రతాపరమైన విషయాలను ఎప్పటికప్పుడు తెలుసుకోవడానికే తాను జెట్ అడిగాను తప్ప.. వ్యక్తిగత అవసరాల కోసం కాదన్నారు. ఇప్పటికీ దాదాపు 50శాతం తన సమయాన్ని జాతీయ భద్రత అంశాల కొరకే వెచ్చిస్తుంటానని.. కొరియా, ఇరాన్ దేశాల వ్యవహారాల్లో ఎప్పటికప్పుడు సమాచారం తెలుసుకోవాల్సి ఉంటుందని అన్నారు.

ఈ నేపథ్యంలోనే ప్రయాణంలోను సమాచారం తెలుసుకునేందుకు వీలుగా ఉంటుందనే జెట్ విమానం అడిగానని నుచిన్ స్పష్టం చేశారు. అయితే ఇప్పుడు తన నిర్ణయం మార్చుకున్నానని, ఇక జెట్ విమానంలో వెళ్లను గాక వెళ్లనని అన్నారు.తనకు వేరే ప్రత్యామ్నాయం దొరికిందని చెప్పారు.

కాగా, అమెరికా భద్రతా దళాలు ఉపయోగించే జెట్ విమానంలో ఒక గంట పాటు ప్రయాణించాలంటే దాదాపు 25వేల డాలర్లు ఖర్చవుతాయి. యూరోప్ లో హనీమూన్ ప్లాన్ చేసుకున్న నుచిన్.. స్కాట్లాండ్, ఫ్రాన్స్, ఇటలీ వంటి దేశాల్లో పర్యటించేందుకు జెట్ విమానం అడిగారని ఏబీసీ న్యూస్ కథనం ప్రసారం చేయడంతో ఈ విషయం వెలుగులోకి వచ్చింది.

ఇంకా వివాహం చేసుకోలేదా? తెలుగు మ్యాట్రిమోనిలో నేడే రిజిస్టర్ చేసుకోండి - రిజిస్ట్రేషన్ ఉచితం!

English summary
US Treasury Secretary Steven Mnuchin was back in an awkward spotlight on Thursday following reports he asked to use a military jet this summer for his European honeymoon.

Oneindia బ్రేకింగ్ న్యూస్
రోజంతా తాజా వార్తలను పొందండి