సీజ్ ఫైర్ తర్వాత ఇరాన్ కు అమెరికా కీలక వార్నింగ్..! తోక జాడిస్తే జరిగేది ఇదే..!

ఇరాన్-ఇజ్రాయెల్ మధ్య సాగుతున్న యుద్ధానికి అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఎట్టకేలకు శుభం కార్డు వేసేశారు. తాజాగా ఇరు దేశాల మధ్య జరుగుతున్న యుద్ధంలోకి అడుగుపెట్టి ఇరాన్ అణుస్ధావరాలపై బాంబులు వేసి ధ్వంసం చేసిన అమెరికా ఇప్పుడు తమ పని పూర్తయిందని ప్రకటించి సీజ్ ఫైర్ ప్రకటన చేసేసింది. దీంతో ఇజ్రాయెల్-ఇరాన్ కూడా తప్పని పరిస్ధితుల్లో కాల్పుల విరమణకు అంగీకరిస్తున్నట్లు ప్రకటించాయి.

అయితే ఈ ప్రకటన తర్వాత అమెరికా ఉపాధ్యక్షుడు ఇరాన్ కు తాజాగా మరో హెచ్చరిక చేశారు. ఇరాన్ అణుస్ధావరాలపై తాము బాంబులు వేయడం వెనుక అణ్వస్త్రాల తయారీని అడ్డుకోవాలన్న ఉద్దేశం మాత్రమే ఉందన్నారు. ఇరాన్ కు అణ్వాయుధాలు అందకుండా చేయడమే తమ లక్ష్యమన్నారు. అయితే ఇజ్రాయెల్ తో కాల్పుల విరమణ తర్వాత మళ్లీ ఇరాన్ అణ్వాయుధాల తయారీకి ప్రయత్నిస్తే ఏం జరుగుతుందో జేడీ వాన్స్ చెప్పేశారు.

US vice president Jd Vance warned iran against preparing nuclear weapons again after ceasefire

భవిష్యత్తులో ఇరాన్ అణ్వాయుధాలు తయారు చేయాలనుకుంటే బలమైన అమెరికా సైన్యాన్ని ఎదుర్కోవాల్సి వస్తుందని ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్ హెచ్చరికలు జారీ చేశారు. తాము ఇరాన్ తో యుద్ధంలో లేమని, అయితే వారి అణ్వాయుధ కార్యక్రమంపై మాత్రం పోరాడుతున్నట్లు చెప్పుకొచ్చారు. ఇరాన్ దగ్గర ఉన్న యురేనియాన్ని శిథిలాల కింద పాతేసినట్లు ఆయన వెల్లడించారు. అయితే దాని వివరాలు మాత్రం బయటపెట్టేందుకు నిరాకరించారు.

Take a Poll

అమెరికా తాజాగా ఇరాన్ లోని మూడు అణు స్థావరాలైన ఫోర్డో, నతాంజ్, ఇస్పాహన్ పై భారీ బాంబులు వేసి ధ్వంసం చేసింది. అయితే అమెరికా దాడుల్లో ఇవి నిజంగానే ధ్వంసం అయ్యాయా, అక్కడ కార్యక్రమాలు తిరిగి ప్రారంభించే అవకాశం లేదా అన్న ప్రశ్నకు మాత్రం ఎవరివద్దా సరైన సమాచారం లేదు. ఈ నేపథ్యంలో తిరిగి ఆయా కేంద్రాల్లో ఇరాన్ అణుబాంబుల తయారీ చేపట్టవచ్చన్న ఆందోళన వ్యక్తమవుతోంది. దీంతో జేడీ వాన్స్ హెచ్చరికలు ప్రాధాన్యం సంతరించుకున్నాయి. అటు ఇజ్రాయెల్ కూడా ఇరాన్ అణుకార్యక్రమాన్ని తాము విజయవంతంగా అడ్డుకున్నట్లు చెప్పుకుంటోంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+