Kamala Harris తొలి అంతర్జాతీయ పర్యటన: విమానం గాల్లో ఉండగా: దేవుణ్ని ప్రార్థించా

వాషింగ్టన్: అమెరికా ఉపాధ్యక్షురాలు కమలా హ్యారిస్‌కు తృటిలో ప్రాణాపాయం తప్పింది. ఆమె తొలి అంతర్జాతీయ పర్యటనలో అవాంతరాలు ఏర్పడ్డాయి. ఆమె ప్రయాణిస్తోన్న విమానంలో సాంకేతిక లోపాలు తలెత్తాయి. టేకాఫ్ తీసుకున్న కొద్దిసేపటికే విమానం ఇంజిన్‌లో సమస్యలు తలెత్తాయి. అందులో నుంచి అసాధారణ శబ్దం వెలువడింది. దీనితో దాన్ని మళ్లీ వెనక్కి మళ్లించాల్సి వచ్చింది. విమానాన్ని అత్యవసరంగా ల్యాండ్ చేయించారు. ఈ ఘటనతో ఆమె పర్యటనలో జాప్యం ఏర్పడింది. సుమారు రెండు గంటల తరువాత ఆమె అంతర్జాతీయ పర్యటన ఆరంభమౌతుందని అధికారిక ప్రతినిధురాలు తెలిపారు.

అమెరికా ఉపాధ్యక్షురాలి హోదాలో కమలా హ్యారిస్ తొలిసారిగా లాటిన్ అమెరికన్ కంట్రీ గ్వాటెమాలాకు బయలుదేరారు. ఆమె ఎక్కిన ఎయిర్‌ఫోర్స్ 2 విమానం మేరీల్యాండ్‌లోని ప్రిన్స్ జార్జ్ కంట్రీలో గల యూఎస్ రక్షణ విభాగానికి చెందిన జాయింట్ బేస్ ఆండ్రూస్ నుంచి టేకాఫ్ తీసుకుంది. కమలా హ్యారిస్‌తో పాటు ఆమె అధికారిక టీమ్, మీడియా ప్రతినిధులు అందులో ఉన్నారు. కొద్దిసేపటి తరువాత విమానం ఇంజిన్‌లో సాంకేతిక లోపాలు తలెత్తాయి. అసాధారణ శబ్దం వెలువడింది.

US Vice President Kamala Harriss plane was forced to land soon after take-off

దీనితో విమానాన్ని వెనక్కి మళ్లించారు. మళ్లీ జాయింట్ బేస్ ఆండ్రూస్‌లో ల్యాండ్ చేశారు. సాంకేతిక లోపాల వల్లే విమానాన్ని వెనక్కి మళ్లించాల్సి వచ్చిందని కమలా హ్యారిస్ అధికారిక ప్రతినిధురాలు సైమోన్ డీ శాండర్స్ తెలిపారు. తీవ్రంగా పరిగణించాల్సిన లోపం కాదని ఆమె చెప్పారు. ఎయిర్‌ఫోర్స్ 2 నుంచి కిందికి దిగిన వెంటనే.. తాను క్షేమంగా ఉన్నానంటూ కమలా హ్యారిస్ తెలిపారు. సాంకేతిక విమానం ఏర్పడినట్లు ఎయిర్‌ఫోర్స్ 2 విమానం సిబ్బంది తెలిపిన వెంటనే కొంత ఆందోళనకు గురయ్యానని, దేవుణ్ని ప్రార్థించానని నవ్వుతూ చెప్పారు.

ఈ కారణంతో ఆమె ప్రయాణం రెండు గంటల పాటు ఆలస్యంగా ప్రారంభమైంది. వారం రోజుల పాటు గ్వాటెమాలా, మెక్సికోల్లో కమలా హ్యారిస్ పర్యటించాల్సి ఉంది. దీనికి అనుగుణంగా షెడ్యూల్‌ను రూపొందించారు. తొలుత గ్వాటెమాలా, అనంతరం మెక్సికోల్లో ఆమె పర్యటిస్తారు. మెక్సికో నుంచి పెద్ద ఎత్తున అమెరికాకు వలసలు కొనసాగుతోండటం, మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రభుత్వం నిర్మించదలిచిన సరిహద్దు గోడ పనులను నిలిపివేయడం వంటి పరిణామాల మధ్య కమలా హ్యారిస్ పర్యటించబోతోండటం ప్రాధాన్యతను సంతరించుకుంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+