US Visa Interviews: అమెరికా వీసా ఇంటర్వ్యూలకు సడన్ బ్రేక్..! రీజన్ ఇదే..!
అమెరికాకు వచ్చే వలసదారులకు ఎప్పటికప్పుడు షాకులిస్తున్న అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్.. తాజాగా ఇదే క్రమంలో మరో షాక్ ఇచ్చారు. సడన్ గా అమెరికా వీసా ఇంటర్వ్యూల్ని (US Visa Interviews) నిలిపేశారు. దీంతో ఇప్పటివరకూ వివిధ రకాల వీసాల కోసం దరఖాస్తు చేసుకున్న వారంతా షాకయ్యారు. ఇలా ఎందుకు చేశారు, తిరిగి వీసా ఇంటర్వ్యూలు ఎప్పుడు మొదలవుతాయన్న దానిపై ఆరా తీయడం ప్రారంభించారు. ఇందులో భారతీయులే ఎక్కువగా ఉన్నారు.
ప్రపంచవ్యాప్తంగా ఉన్న అమెరికన్ రాయబార కార్యాలయాలు, కాన్సులేట్లలో వీసా అపాయింట్‌మెంట్లను తాత్కాలికంగా నిలిపేస్తూ ట్రంప్ సర్కార్ సంచలన నిర్ణయం తీసుకుంది. దీంతో ప్రస్తుతానికి వీసా ఇంటర్వ్యూలన్నీ వాయిదా పడిపోయాయి. అమెరికా విదేశాంగ శాఖ అన్ని విదేశీ దౌత్య కార్యాలయాలలో నిర్వహిస్తున్న ప్రపంచవ్యాప్త శిక్షణా కార్యక్రమానికి అనుగుణంగా వీసా సేవల అపాయింట్‌మెంట్లను తాత్కాలికంగా నిలిపివేసినట్లు తెలిపింది. ఈ శిక్షణకు అనుగుణంగా వీసా అపాయింట్‌మెంట్లను సర్దుబాటు చేస్తామని విదేశాంగ శాఖ తెలిపింది. ఈ మార్పులు ఎంతకాలం కొనసాగుతాయనే దానిపై మాత్రం క్లారిటీ లేదు.

అమెరికా ప్రభుత్వ ప్రయోజనాలపై ఆధారపడే అవకాశం ఉన్న వీసా దరఖాస్తుదారులను కాన్సులర్ అధికారులు గుర్తించి, వీసా దరఖాస్తుదారుల మూల్యాంకనం సమగ్రంగా, స్థిరంగా జరిగేలా చూడటమే ఈ శిక్షణ లక్ష్యమని విదేశాంగశాఖ చెబుతోంది. ఇప్పటికే అమెరికా ప్రభుత్వం రాజకీయ అభిప్రాయాలు, గాజాపై అమెరికా మిత్రదేశమైన ఇజ్రాయెల్ దాడికి వ్యతిరేకంగా, పాలస్తీనాకు మద్దతుగా జరుగుతున్న నిరసనలు వంటి పలు కారణాలతో వీసాలు, గ్రీన్ కార్డ్‌లను రద్దు చేయడం, దరఖాస్తులను తిరస్కరించడం వంటి తీవ్రమైన చర్యలు తీసుకుంటోంది. అలాగే తాజాగా హెచ్-1బి వీసా కార్యక్రమాన్ని సమూలంగా మార్చే కొత్త ప్రతిపాదనపై ట్రంప్ ప్రభుత్వం సమీక్షను ప్రారంభించింది. ఇది సంవత్సరానికి కనీసం 100 మిలియన్ డాలర్ల ఆర్థిక ప్రభావాన్ని చూపగలదని అంచనా.














Click it and Unblock the Notifications