వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

వైట్ హౌజ్ లో వేద పఠనం..! కరోనా క్లిష్ట సమయంలో కీలక నిర్ణయం తీసుకున్న డోనాల్డ్ ట్రంప్..!!

|
Google Oneindia TeluguNews

వాషింగ్టన్ /హైదరాబాద్ : అగ్ర రాజ్యంలో అధికారికి నివాసం వైట్ హౌస్ లో దేశాధినేత డోనాల్డ్ ట్రంప్ నేతృత్వంలో ఓ బృహత్కర కార్యక్రమానికి రూపకల్పన జరగింది. అదికూడా భారత దేవానికి లింక ఉన్న కార్యక్రమం కావడంతో పెద్ద చర్చ జరుగుతోంది. ఇంతకీ ట్రంప్ అదికారిక నివాసం వైట్ హౌజ్ సాక్షిగా జరుగుతున్న తంతు ఏంటన్న అంశం అటు అమెరికాలో ఉన్న భారతీయులనే కాకుండా ఇటు స్వదేశంలో ఉన్న భారత ప్రజల్లో కూడా ఆసక్తిగా మారింది. కరోనా మహమ్మారి పీడతో ప్రపంచం మొత్తం వణికిపోతున్న వేళ, ఎన్ని కఠిన ఆంక్షలు విధించినా ఉపశమనం లభించని పరిస్థితులు నెలకొన్నియి.

Recommended Video

#DonaldTrump: What's The Trumps Plan Behind Vedic Reading In White House ? | Oneindia Telugu

24 గంట‌ల్లో 43 కేసులు..!ఏపీని వదల బొమ్మాళీ అంటున్న కరోనా..!!24 గంట‌ల్లో 43 కేసులు..!ఏపీని వదల బొమ్మాళీ అంటున్న కరోనా..!!

భారత వేదాల పట్ల అమెరికా ఆసక్తి.. వైట్ హౌస్ లో వేద పఠనం..

భారత వేదాల పట్ల అమెరికా ఆసక్తి.. వైట్ హౌస్ లో వేద పఠనం..

శాస్త్ర సాంకేతిక రంగాల్లో ఆకాశమే హద్దుగా చెలరేగిపోతున్న అగ్రరాజ్యం కంటికి కనిపించని చిన్ని ప్రాణి చేస్తున్న విలయతాండవానికి విలవిలలాడిపోతోంది. లక్షలాది మంది వైరస్ బారిన పడటం, వేలాది మంది ఇప్పటికే మరణించటం అమెరికాను దిక్కుతోచని పరిస్ధితిల్లోకి నెడుతోదంది. ఇలాంటి గడ్డుపరిస్థితుల్లో ఓ చిత్రమైన నిర్ణయం తీసుకుంది అమెరికా. ఇదే నిర్ణయంపట్ల కొంత మంది విస్మయాన్ని వ్యక్తం చేస్తుంటే మరికొంత మంది తేలిగ్గా తీసుకుంటున్నారు. మరి కొంత మంది ఓ గాడ్ అంటూ నిట్టూర్పు తీసుకుంటున్నారు. కరోనా కట్టడికి చేసేది ఏమీ లేక దేవుడి మీద భారం వేసేందుకు సిద్ధమయ్యారు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్.అందుకోసం వినూత్న అడుగులు వేసారు అగ్ర రాజ్య అధినేత.

వేదాల్లో సారాంశం తెలుసుకున్న అమెరకన్లు.. కరోనా క్లిష్ట సమయంలో రిలాక్స్..

వేదాల్లో సారాంశం తెలుసుకున్న అమెరకన్లు.. కరోనా క్లిష్ట సమయంలో రిలాక్స్..

భారతదేశ సంస్క్రుతీ, సాంప్రదాయాలకు నిలయమైన వేద శాస్త్రాల సారాంశాన్ని తెలుసుకోవాలని అమెరికా తహతహలాడుతున్నట్టు తెలుస్తోంది. అందులో భాగంగా తాజాగా వైట్ హౌజ్ లో వేద పఠనాన్ని నిర్వహించారు. ప్రస్తుత కరోనా క్లిష్ట పరిస్థితుల్లో అమెరికానే కాకుండా ప్రపంచ దేశాలను కాపాడాలనే ఉద్దేశంతో వేదిక్ శాంతి పఠనం పేరుతో ఒక కార్యక్రమాన్నినిర్వహించారు. అమెరికా ప్రజల ఆరోగ్యం, రక్షణ కోసం ఈ వేద పఠనాన్ని చేపట్టినట్లు వైట్ హౌస్ ప్రతినిధులు చెప్పుకొస్తున్నారు. స్వామి నారాయణ్ మందిర్ పూజారి హరీశ్ బ్రహ్మభట్ నిర్వహించిన ఈ కార్యక్రమం పట్ల తారాస్తాయిలో చర్చ జరుగుతోంది. శాంతి కోసం హిందూ ధర్మానికి సంబంధించిన వేద పారాయణాన్ని నిర్వహించటం క్రిష్టియన్ దేశమైన అమెరికాలో పెద్ద చర్చనీయాంశంగా మారింది.

భారత వేదాలు, పరాణాలు ఎంతో గొప్పవి... తాజాగా గుర్తించిన అగ్రరాజ్యం..

భారత వేదాలు, పరాణాలు ఎంతో గొప్పవి... తాజాగా గుర్తించిన అగ్రరాజ్యం..

ఇదే కార్యక్రమం భారత ప్రభుత్వం అధికారికంగా నిర్వహిస్తే అనేక విమర్శలు వినిపించి ఉండేవి. కరోనా వైరస్ ను తరిమి కొట్టలేక ప్రజల దృష్టిని మరల్చేందుకే కేంద్ర ప్రభుత్వం ఇలాంటి ఛీప్ ట్రిక్స్ చేస్తోందని రాజకీయ విమర్శలకు తెరతీసే వారు రాజకీయ పార్టీ నేతలు. కనీసం హిందూ ధర్మం అంటే ఏంటో కూడా తెలియని అమెరికా లాంటి దేశంలో భారతదేశ ఔన్నత్యాన్ని చాటే ఇలాంటి కార్యక్రమం నిర్వహిస్తున్నారని తెలిస్తే ప్రతి భారతీయుడు గర్వపడతాడనే చర్చ జరుగుతోంది. తమ దేశ సంక్షేమం కోసం భారత దేశ వేదాలు దోహదపడతాయన్న అమెరికా కృతనిశ్చయంపట్ల భారత పౌరులు హర్షం వ్యక్తం చేస్తారనే చర్చ కూడా జరుగుతోంది.

వైట్ హౌస్ లో వేదపఠనాన్ని ఆలపించిన హరీశ్ బ్రహ్మభట్.. ఇంగ్లీషులో తర్జుమా చేసుకున్న అమెరికన్లు..

వైట్ హౌస్ లో వేదపఠనాన్ని ఆలపించిన హరీశ్ బ్రహ్మభట్.. ఇంగ్లీషులో తర్జుమా చేసుకున్న అమెరికన్లు..

ఇదిలా ఉండగా అమెరికా నిర్వహించిన ఈ కార్యక్రమ వివరాల గురించి తెలిస్తే భారతీయులు సంతోష పడటం ఖాయమని తెలుస్తోంది. ప్రార్థనల్లో వేద పండితులు యజుర్వేదంలో భాగాన్ని పఠించినట్లుగా తెలుస్తోంది. ప్రార్థనల అనంతరం వేద పఠన సారాంశాన్ని ఇంగ్లిషులో అనువదించి అమెరికన్లకు విశదీకరించడం విశేషం. కాగా భారత దేశ వేదాల గొప్పతనాన్ని ప్రపంచానికే పెద్దన్నగా ముద్ర వేసుకున్న అమెరికా గుర్తించి ప్రచారం కల్పించడం ఆసక్తిగా మారింది. కరోనా క్లిష్ట సమయంలో ఇలాంటి కార్యక్రమాల ద్వారా భారత దేశ ఔన్నత్యాన్ని చాటడం పట్ల మాత్రం సర్వత్రా హర్షం వ్యక్తమవుతోంది.

English summary
Vedic reading was conducted in the White House. Vediq has organized a program called Peace Chanting, aimed at protecting not only the United States but the world, in the current crisis of corona. Representatives of the White House claim that this Vedic reading was taken to protect the health and safety of the American people. The event was organized by Swami Narayan Mandir priest Harish Brahmabhat.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X