వెనెజులా అధ్యక్షుడు, భార్యను బంధించాం..! ట్రంప్ షాకింగ్ ..!
వెనెజులాను టార్గెట్ చేస్తూ ఇవాళ అమెరికా భారీ వైమానిక దాడులకు దిగడంతో ఒక్కసారిగా ప్రపంచం ఉలిక్కిపడింది. వెనెజులా రాజధాని కారకాస్ పై ఇవాళ అమెికా యుద్ద విమానాలు గర్జించాయి. అలాగే యుద్ధ నౌకలు చుట్టుముట్టాయి. దీంతో వెనెజులా ఒక్కసారిగా ఉక్కిరిబిక్కిరైంది. ఈ దాడుల్లో ఆ దేశ అధ్యక్షుడు నికోలస్ మదురోతో పాటు ఆయన భార్యను బంధించినట్లు ట్రంప్ సంచలన ప్రకటన చేశారు.
వెనిజులా రాజధాని కారకాస్ లో వరుస పేలుళ్లు జరిగిన కొన్ని గంటల తర్వాత అమెరికా అధ్యక్షుడు ట్రంప్ దీనిపై స్పందించారు. వెనిజులా అధ్యక్షుడు నికోలస్ మదురో, అతని భార్ సిలియా ఫ్లోర్స్ ను అమెరికా దళాలు బంధించాయని అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ వెల్లడించారు. కారకాస్‌పై పెద్ద ఎత్తున వైమానిక దాడుల తర్వాత ఈ ప్రకటన చేశారు. ట్రంప్ ప్రకటనను వెనెజులా నిర్ధారించలేదు, అలాగని తోసిపుచ్చలేదు. దీంతో ఇది నిజమేనన్న ప్రచారం జరుగుతోంది.

ఇవాళ ట్రంప్ తన ట్రూత్ సోషల్‌లో పెట్టిన పోస్ట్‌లోఅమెరికా "వెనిజులా మరియు దాని నాయకుడిపై పెద్ద ఎత్తున దాడిని విజయవంతంగా నిర్వహించింది" అని అన్నారు, మదురో మరియు అతని భార్య సిలియా ఫ్లోర్స్‌ను అదుపులోకి తీసుకుని, అమెరికా చట్ట అమలు సంస్థలతో కలిసి నిర్వహించిన ఆపరేషన్‌లో దేశం నుండి పంపించి వేశామని వెల్లడించారు. మార్-ఎ-లాగోలో ఉదయం 11 గంటలకు జరగనున్న మీడియా సమావేశంలో మరిన్ని వివరాలను వెల్లడిస్తామని తెలిపారు.

మరోవైపు ఇవాళ వెనెజులాపై అమెరికా వైమానిక దాడుల తర్వాత స్పందించిన అధ్యక్షుడు నికోలస్ మదురో.. ప్రజల్ని, రాజకీయ నాయకుల్ని రోడ్లపైకి రావాలని పిలుపునిచ్చారు. తమ దేశంలో ఖనిజాలు, చమురు కోసమే అమెరికా ఈ దాడులకు పాల్పడుతోందన్నారు. వీటిని దీటుగా ఎదుర్కోవాలని ప్రజలకు పిలుపునిచ్చారు. ఈ నేపథ్యంలోనే ట్రంప్ ప్రకటన వెలువడింది. దీంతో అనుమానాలు మరింత పెరిగాయి.
-
ఇరాన్ సుప్రీం లీడర్ గా ట్రంప్ ? అమెరికా అధ్యక్షుడి తాజా షాక్..! -
"ఇరాన్ దెబ్బకు అమెరికా ఖతం.. పీకల్లోతు చిక్కుల్లో.." -
ట్రంప్ సీజ్ ఫైర్ కు నో..! మళ్లీ తీవ్రస్థాయికి ఇరాన్ వార్...! -
చావు దెబ్బ: అబ్రహం లింకన్ పై ఇరాన్ క్షిపణి దాడి? -
మోదీ-ట్రంప్ వార్ ఫోన్ కాల్ మధ్యలో మస్క్- షాకింగ్ ట్విస్ట్ -
ఇక పెట్రోల్ బంకుల్లోనూ మద్యం.. కొత్త ఎక్సైజ్ పాలసీకి ఆమోదం! -
'ఆ ఒక్క కండీషన్ తో స్టార్ హీరోతో నిజంగానే శోభనం'.. హీరోయిన్ సంచలనం..!! -
అల్లు అర్జున్ "పుష్ప - 3"లో స్టార్ క్రికెటర్ విరాట్ కోహ్లీ భార్య.. -
హిట్ కొట్టాడురా సామీ!.. మిస్టరీ థ్రిల్లర్ అదిరిపోయింది..! -
ఓటీటీలోకి పవన్ కల్యాణ్ 'ఉస్తాద్ భగత్ సింగ్'.. ఆ రోజు నుంచే స్ట్రీమింగ్..? -
ఈ సినిమా చూస్తే ఈఎంఐల జోలికే పోరు సామి! -
వంట గ్యాస్ బుక్ చేసినా రావటం లేదా, ఇలా చేయండి.. వెంటనే..!!












Click it and Unblock the Notifications