Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

Viral Video : ఇంటర్నెట్‌ను షేక్ చేస్తున్న రెండు తలల పాము వీడియో

స్మార్ట్ ఫోన్లు,ఇంటర్నెట్ విస్తృతి పెరిగాక ఎక్కడ ఏ చిన్న ఆసక్తికర ఘటన జరిగినా క్షణాల్లో అవి సామాజిక మాద్యమాల్లో ప్రత్యక్షమవుతున్నాయి. పక్షులు,అటవీ జంతువులు,సరీసృపాలకు సంబంధించిన వీడియోలైతే నెటిజన్లను ఇట్టే ఆకర్షిస్తుంటాయి. భయపెట్టే వీడియోలైనా సరే... నెటిజన్లు వాటి వైపు ఓ లుక్కేసి పోతుంటారు. తాజాగా ఇంటర్నెట్‌లో ఓ రెండు తలల పాము వీడియో వైరల్‌గా మారింది.

ఆ పాము ఒకేసారి రెండు చిట్టెలుకలను మింగేస్తుండటం ఈ వీడియోలో గమనించవచ్చు. చూడటానికి కాస్త భయంగొల్పేది ఉన్న ఈ వీడియోను అమెరికాకు చెందిన బ్రియా బ్రాక్‌జిక్ అనే కంటెంట్ క్రియేటర్ తన ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్టు చేశాడు. ఇప్పటివరకూ దీన్ని 18 వేల పైచిలుకు మంది వీక్షించారు. వీడియోపై నెటిజన్లు రకరకాల కామెంట్స్ చేస్తున్నారు. ఆ రెండు తలల పాముకు ఒకే కడుపు ఉంటుందా అని ఓ నెటిజన్ ఫన్నీ కామెంట్ చేశాడు.

 video of double headed snake eats two mice at a time goes viral

ఇండియాలోనూ రెండు తలల పాములు చాలానే కనిపిస్తుంటాయి. అయితే వాటిల్లో చాలా వాటికి ముందూ,వెనకా తల ఉంటుంది. ఇలా పక్కపక్కనే రెండు తలలు ఉండే పాములు ఇండియాలో చాలా అరుదనే చెప్పాలి. రెండు తలల పాములపై రకరకాల కట్టు కథలు,నమ్మకాలు ప్రచారంలో ఉన్నాయి. సైన్స్ పరిభాషలో వీటిని బైసెఫాలిక్ లేదా డైసెఫాలిక్ అని పిలుస్తారు.ఈ పాముల్లో లైంగిక సామర్థ్యాన్ని పెంచే ఔషధం ఉంటుందని,ఎయిడ్స్‌ను సైతం అది నయం చేయగలదని కొంతమంది నమ్ముతారు. కొంతమంది తాంత్రికులు ఈ పాములను అదృష్ఠ సూచకంగా చెబుతారు.

ఈ నేపథ్యంలోనే భారత్ సహా పలు దేశాల్లో వీటి అక్రమ రవాణా ఎక్కువగా జరుగుతోంది.భారత్‌లో ఈ పాములను పట్టుకోవడం చట్ట రీత్యా నేరం.బ్లాక్ మార్కెట్‌లో డబుల్ ఇంజన్‌గా పేర్కొనే ఈ తరహా పాములను రూ.3లక్షలు నుంచి రూ.10లక్షలు వరకు ధర పలుకుతోంది. అక్రమ రవాణా కారణంగా ఈ పాములు త్వరగా అంతరించిపోయే ప్రమాదం ఉందని పర్యావరణ నిపుణులు హెచ్చరిస్తున్నారు.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+