వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

బలమైన బంధం కోరుకుంటున్నాం: మోడీకి వైట్‌హౌజ్

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ అధికార యంత్రాంగం భారతదేశంతో బలమైన సంబంధాలను కోరుకుంటోందని అమెరికా అధికారిక భవనం వైట్‌హౌజ్ స్పష్టం చేసింది. రెండు దేశాల మధ్య సంబంధాలు మరింత మెరుగుపరిచేందుకు .

|
Google Oneindia TeluguNews

వాషింగ్టన్: అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ అధికార యంత్రాంగం భారతదేశంతో బలమైన సంబంధాలను కోరుకుంటోందని అమెరికా అధికారిక భవనం వైట్‌హౌజ్ స్పష్టం చేసింది. రెండు దేశాల మధ్య సంబంధాలు మరింత మెరుగుపరిచేందుకు ఇరు దేశాలు కృషి చేస్తాయని విశ్వసిస్తున్నామని వైట్‌హౌస్‌ ప్రెస్‌ సెక్రటరీ సీన్‌ స్పైసర్‌ మీడియా సమావేశంలో తెలిపారు.

గతంలో వెల్లడించినట్లే భారత ప్రధాని నరేంద్ర మోడీతోనూ, అమెరికా-భారత్‌ వ్యాపారాల్లోనూ సంబంధాలను మరింత బలపరిచే దిశగా కృషిచేస్తామని తెలిపారు.
తమ విదేశీ విధానాల పట్ల ముందుకెళ్తున్న క్రమంలో, భారత్‌తో సత్సంబంధాల కొనసాగింపు గురించి అధ్యక్షుడు ట్రంప్‌ తరచూ ప్రస్తావిస్తారని స్పైసర్‌ వెల్లడించారు.

Want to Have Deeper Relationship With PM Modi: White House

కేన్సస్‌లో 32ఏళ్ల తెలుగు యువకుడు శ్రీనివాస్‌ హత్యను స్పైసర్‌ ఖండించారు. దేశ విలువలను కాపాడేందుకు అమెరికన్లంతా విధానాలకు కట్టుబడి కలిసి ఉండాలని ఆయన కోరారు. అమెరికన్లు ఇలాంటి విద్వేష ఘటనలకు తావివ్వకూడదని అన్నారు.

కొన్ని పాలసీలు మనల్ని విడదీసినప్పటికీ, మరికొన్ని పాలసీలు మనల్ని కలిపి ఉంచుతాయని స్పైసర్‌ అన్నారు. భారత్‌తో కలిసి ముందుకు సాగుతామని ట్రంప్ చాలాసార్లు చెప్పారని ఆయన గుర్తు చేశారు.

English summary
The Trump administration wants to build a deeper relationship with India, the White House has said, expressing confidence that the two countries will continue to grow their ties.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X