అది ఇరాన్ పనేనా
వైట్‌హౌస్ కరెస్పాండెంట్స్ డిన్నర్ లో జరిగిన కాల్పుల ఘటనపై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కీలక వ్యాఖ్యలు చేశారు. ఈ కాల్పులకు దిగిన వ్యక్తిని అదుపులోకి తీసుకున్నట్లు వెల్లడించారు. అతన్ని ప్రాణాలతో పట్టుకున్నామని, కాల్పుల ఘటనపై దర్యాప్తు కొనసాగుతోందని వివరించారు. కాల్పులకు గల కారణాలు, దీని వెనుక ఉన్న వాస్తవాల గురించి ఏజెన్సీలు దర్యాప్తు సాగిస్తున్నాయని పేర్కొన్నారు. షూటర్ కు సంబంధించిన వ్యక్తిగత వివరాలు త్వరలోనే తెలియజేస్తానని అన్నారు.
ఈ ఘటన జరిగిన కొద్దిసేపటికే వైట్‌హౌస్ వద్ద జరిగిన విలేకరుల సమావేశంలో డొనాల్డ్ ట్రంప్ మాట్లాడారు. ఇరాన్ ప్రమేయం ఉందనే వాదనలను తోసిపుచ్చారు. ఆ దేశంపై యుద్ధ ప్రయత్నాలను ఆపబోనని స్పష్టం చేశారు. కాల్పుల ఉదంతాన్ని ఆ దేశంతో ఇప్పటికిప్పుడు ముడిపెట్టాలనుకోవట్లేదని తేల్చి చెప్పారు. దాడి సమయంలో అతని వద్ద ఒకటికి మించిన ఆయుధాలు ఉన్నాయని, సీక్రెట్ సర్వీస్ ఏజెంట్లు సకాలంలో అతన్ని పట్టుకున్నారని తెలిపారు. అతన్ని లోన్ వుల్ఫ్ గా అభివర్ణించారు. ఒక్కడే వచ్చి ఉండొచ్చని పేర్కొన్నారు.

కాల్పుల్లో ఒక అధికారికి స్వల్ప గాయాలయ్యాయని డొనాల్డ్ ట్రంప్ తెలిపారు. ఆరంభంలో కాల్పుల మోతలను.. ట్రే పడిపోయిన శబ్దంగా పొరబడ్డానని, ఆపై అసలు విషయం గ్రహించానని ట్రంప్ వివరించారు. ఈ అనుమానితుడిని కిల్లర్ గా నిర్ధారించారు. హత్య చేయాలనే ఉద్దేశంతోనే వచ్చాడని, మరో ఆలోచన అతనికి ఉండకపోవచ్చని అన్నారు. ఈ కాల్పుల ఘటనకు ఇరాన్ యుద్ధానికి సంబంధం ఉండవచ్చా అని అడగ్గా లేదని బదులిచ్చారు. ఈ ఘటన ఇరాన్ సంఘర్షణతో ముడిపడి ఉందని తాను భావించడం లేదని స్పష్టం చేశారు.
అయినప్పటికీ.. ఇరాన్‌తో యుద్ధంలో గెలవాలనే తన సంకల్పాన్ని ఇది నిలువరించబోదని డొనాల్డ్ ట్రంప్ అన్నారు. నిజంగా ఇరాన్ తో ఏదైనా సంబంధం ఉందా లేదా అనేది ఇప్పటికిప్పుడు తెలియదని, ఇప్పటివరకు అందిన సమాచారం ఆధారంగా అటువంటి ఆనవాళ్లు లేవనే అనుకుంటున్నానని వ్యాఖ్యానించారు. బీభత్సం చోటు చేసుకోవడానికి ముందు, శనివారం ఉదయం ఇరాన్ పై మాట్లాడారు ట్రంప్. చర్చల వైఖరిపై అసంతృప్తి వ్యక్తం చేశారు. ఇరాన్‌తో శాంతి చర్చల కోసం ఉపాధ్యక్షుడు తలపెట్టిన పాకిస్తాన్నను రద్దు చేశారు.












Click it and Unblock the Notifications