వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

కొత్త ఏడాదిలో కరోనా వ్యాక్సిన్‌పై అన్నీ శుభవార్తలే: ఫైజర్‌పై డబ్ల్యూహెచ్ఓ కీలక ప్రకటన

|
Google Oneindia TeluguNews

జెనీవా: గత ఏడాది ప్రారంభంలో కరోనా వైరస్ గురించి దడపుట్టించే వార్తలను వినాల్సి వచ్చింది. ఈ ఏడాది ఆరంభంలోనూ అలాంటి పరిస్థితులే ఉన్నప్పటికీ.. దానికి అదనంగా కరోనాను నిర్మూలించే వ్యాక్సిన్‌పై అన్నీ శుభవార్తలు వినిపిస్తున్నాయి. బ్రిటన్, అమెరికా సహా అనేక దేశాలు వ్యాక్సినేషన్‌కు శ్రీకారం చుట్టాయి. సాధారణ ప్రజల కోసం వ్యాక్సిన్‌ను వినియోగంలోకి తీసుకొచ్చాయి. ఆయా దేశాల్లో జోరుగా వ్యాక్సిన్ కార్యక్రమం కొనసాగుతోంది. ఫైజర్-బయోఎన్‌టెక్ ఫ్రంట్ రన్నర్‌గా నిలిచింది. రేపో, మాపో భారత్‌లోనూ దీన్ని అందుబాటులోకి తీసుకుని వచ్చే అవకాశాలు లేకపోలేదు.

Recommended Video

#CoronaVaccine : Serum Institute Clinical Trials | Oneindia telugu

తాజాగా- వ్యాక్సినేషన్ విషయంలో ప్రపంచ ఆరోగ్య సంస్థ నుంచి కీలక నిర్ణయాన్ని తీసుకుంది. ఫైజర్-బయోఎన్‌టెక్ వ్యాక్సిన్‌ వినియోగానికి అనుమతి ఇచ్చింది. అత్యవసర పరిస్థితుల్లో ఈ వ్యాక్సిన్‌ను వినియోగించుకోవచ్చని తెలిపింది. కరోనా వైరస్‌ను నిర్మూలించడానికి ఉద్దేశించిన ఓ వ్యాక్సిన్‌ను ప్రపంచ ఆరోగ్య సంస్థ అనుమతి ఇవ్వడం ఇదే తొలిసారి. ప్రపంచ ఆరోగ్య సంస్థ తీసుకున్న ఈ తాజా నిర్ణయం.. కోట్లాదిమందికి లబ్దిని కలిగిస్తుంది.

WHO clears Pfizer-BioNTech coronavirus vaccine for emergency use, benefit to poorer countries

వ్యాక్సిన్‌ను కొనుగోలు చేయలేని పేద దేశాలకు డబ్ల్యూహెచ్ఓ.. ఉచితంగా దాన్ని సరఫరా చేస్తుంది. దీనికోసం ఆయా దేశాల ప్రభుత్వాలు లేదా హెల్త్ రెగ్యులేటరీల నుంచి ఎలాంటి అనుమతులను కూడా తీసుకోవాల్సిన అవసరం ఉండదు. హెల్త్ రెగ్యులేటరీల ఊసే లేని కొన్ని పేద దేశాల జాబితా పెద్దదే. ప్రజల ఆరోగ్యాన్ని సంరక్షించడానికి అవసరమైన హెల్త్ సిస్టమ్ లేని పేద దేశాలకు డబ్ల్యూహెచ్ఓ తీసుకున్న నిర్ణయం వల్ల లబ్ది కలుగుతుంది. అలాంటి పేద దేశాలకు ప్రపంచ ఆరోగ్య సంస్థ ఉచితంగా ఫైజర్ వ్యాక్సిన్‌ను సరఫరా చేస్తుంది.

డెమొక్రటిక్ రిపబ్లిక్ ఆఫ్ కాంగో (డీఆర్సీ), మొజాంబిక్, ఉగాండా, టాంజానియా, ఇథియోపియా, హైతీ, యెమెన్, సొమాలియా, సూడాన్ వంటి దేశాల్లో ప్రపంచ ఆరోగ్య సంస్థ స్వయంగా వ్యాక్సినేషన్‌ను చేపడుతుంది. ఒకరకంగా హెల్త్ రెగ్యులేటరీ వ్యవస్థ ఉన్న దేశాలు కూడా.. ఫైజర్ వ్యాక్సిన్ వినియోగానికి తమ అనుమతులను మరింత వేగంగా మంజూరు చేయడానికీ ఇది దోహదపడుతుంది. వాతావరణం, భౌగోళిక పరిస్థితులు, ప్రజల ఆరోగ్య స్థితిగతులను దృష్టిలో ఉంచుకుని హెల్త్ రెగ్యులేటరీలు ప్రత్యేకంగా అనుమతులను ఇచ్చుకోవాల్సి ఉంటుందని డబ్ల్యూహెచ్ఓ సూచించింది.

English summary
The World Health Organization says it has cleared the Pfizer-BioNTech coronavirus vaccine for emergency use, meaning poorer countries may soon get access to the shot already available in Europe and North America.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X