Keir Starmer: ఎవరీ కీర్ స్టార్మర్ ? బ్రిటన్ తదుపరి ప్రధానిగా-భారత్ కు ప్రయోజనమెంత ?
బ్రిటన్ లో జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో లేబర్ పార్టీ ఘన విజయం సాధించింది. తాజాగా ప్రకటించిన ఫలితాల్లో మ్యాజిక్ మార్కును దాటి 360కి పైగా సీట్లలో లేబర్ పార్టీ ఆధిపత్యం ప్రదర్శించింది. ఈ దెబ్బకు 14 ఏళ్లుగా బ్రిటన్ లో అధికారంలో ఉన్న కన్సర్వేటివ్ పార్టీ కుదేలైంది. కేవలం 80 కి పైగా సీట్లు సాధించి రెండో స్దానంలో నిలిచింది. దీంతో ప్రధానిగా ఉన్న రిషీ సునాక్ ఓటమిని అంగీకరిస్తున్నట్లు ప్రకటించారు. అదే సమయంలో లేబర్ పార్టీ నేత కీర్ స్టార్మర్ ప్రధాని కాబోతున్నారు.
ఎవరీ కీర్ స్టార్మర్ ?
మానవ హక్కుల న్యాయవాది అయిన కీర్ స్టార్మర్ అనంతరం లేబర్ పార్టీలో చేరి నాయకుడిగా ఎదిగారు. 2019 సార్వత్రిక ఎన్నికలలో లేబర్ పార్టీ ఘోర పరాజయం నుంచి ఇప్పుడు ఘన విజయం సాధించేలా చేసిన నాయకుడు. న్యాయవాదిగా చట్టం, క్రిమినల్ జస్టిస్ అంశాల్లో తన పనితీరుతో దివంగత బ్రిటన్ రాణి క్వీన్ ఎలిజబెత్ తో నైట్ పురస్కారం అందుకున్నారు.
2015లో లండన్ నుంచి లేబర్ పార్టీ ఎంపీగా పార్లమెంట్ కు ఎన్నికైన కీర్ స్టార్మర్ ఇప్పుడు ప్రధాని కాబోతున్నారు.

రిషీ సునాక్ తో వైరుధ్యం
ప్రస్తుత బ్రిటన్ ప్రధాని రిషీ సునాక్ తో పోలిస్తే కీర్ స్టార్మర్ అంత యాక్టివ్ కాదని ఆయన పార్టీ నేతలే చెప్తారు. అయితే సునాక్ తరహాలో ఆక్స్ ఫర్డ్ నుంచి లా డిగ్రీ తీసుకున్నారు. ఆ తర్వాత లేబర్ పార్టీ ప్రభుత్వంలో పబ్లిక్ ప్రాసిక్యూషనస్ డైరెక్టర్ గా తన ర్యాంకులు పెంచుకుంటూ వచ్చారు. 2016గా ఎంపీగా ఉన్నప్పుడు పార్టీ నేత జెరెమీ కార్బిన్ ఆధ్వర్యంలో సాగిన షాడో బ్రెగ్జిట్ కార్యదర్శిగా కీలక పాత్ర పోషించారు.
భారత్ పై కీర్ స్టార్మర్ ప్రభావం ?
బ్రిటన్ ప్రధానిగా కీర్ స్మార్టర్ ఎన్నికైతే భారత్ తో ఇప్పటికే కన్సర్వేటివ్ ప్రభుత్వం కుదుర్చుకున్న స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందం కొనసాగనుంది. దీన్ని కొనసాగిస్తామని ఇప్పటికే మ్యానిఫెస్టోలో లేబర్ పార్టీ ప్రకటించింది. కాశ్మీర్‌పై భారత వ్యతిరేక వైఖరి కారణంగా మాజీ నాయకుడు కార్బిన్ హయాంలో కొంతవరకు దూరమైన భారతీయులతో లేబర్ పార్టీ సంబంధాల్ని తిరిగి పునరుద్ధరించేందుకు స్టార్మర్ పనిచేశారు. ఇది మారిన లేబర్ పార్టీ అని, భారత్ తో ప్రజాస్వామ్యం, ఇతర ఆకాంక్షల విషయంలో సన్నిహిత సంబంధాలు కొనసాగిస్తామని స్టార్మర్ తాజాగా ప్రకటించారు. ఇవన్నీ భారత్ కు అనుకూలించే అంశాలే.












Click it and Unblock the Notifications