Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

భారత్‌పై ట్రంప్ ఘాటు వ్యాఖ్యలు: కుప్పలు కుప్పలుగా డబ్బులున్నాయట: కడుపులో ఇంత దాచుకుని..

Donald Trump: ప్రధానమంత్రి నరేంద్ర మోదీ.. ఇటీవలే అమెరికాలో పర్యటించారు. ఆ దేశాధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌తో భేటీ అయ్యారు. భారత అక్రమ వలసదారులు, రెండు దేశాల మధ్య దౌత్య, ఆర్థిక, వాణిజ్యపరమైన సంబంధాలపై చర్చించారు. డిఫెన్స్, ఆర్టిఫీషియల్ టెక్నాలజీ రంగాల్లో పరస్పర పెట్టుబడులు పెట్టడానికీ అంగీకారం తెలియజేశారు.

చెప్పేదొకటి..చేసేదొకటి..

అవేవీ కూడా పెద్దగా ఫలించేలా కనిపించట్లేదు ట్రంప్ వైఖరి చూస్తోంటే. అనూహ్యంగా భారత్‌పై ఘాటు వ్యాఖ్యలు చేశారు. ట్రంప్ బయట చెప్పేదొకటి..చేసేదొకటి అన్నట్టు వ్యవహరిస్తోన్నారనేది ఈ వ్యాఖ్యలతో తేలిపోయింది. మరింత కటువుగా వ్యవహరించబోతోన్నాననే సంకేతాలను ఇచ్చారు.

Why are we giving 21 million dollars to India They have a lot more money says Donald Trump
Photo Credit: YouTube Screenshot

ఓటర్ టర్నవుట్ ఇన్ ఇండియా ప్రాజెక్ట్..

ఓటర్ టర్నవుట్ ఇన్ ఇండియా ప్రాజెక్ట్ కోసం ఉద్దేశించిన 21 మిలియన్ డాలర్ల చెల్లింపులను నిలిపివేయడాన్ని డొనాల్డ్ ట్రంప్ సమర్థించుకున్నారు. తాజాగా వైట్ హౌస్‌లో ఏర్పాటుచేసిన విలేకరుల సమావేశంలో మాట్లాడారు. ఈ సందర్భంగా విలేకరులు అడిగిన పలు ప్రశ్నలకు ట్రంప్ ముక్కుసూటిగా సమాధానాలను ఇచ్చారు. మార్-ఎ-లాగో ఎగ్జిక్యూటివ్ ఆర్డర్‌పై సంతకం చేసినట్లు ప్రకటించారు.

భారత్‌కు మేమెందుకు డబ్బులు ఇవ్వాలి..?

ఓటర్ టర్నవుట్ ఇన్ ఇండియా ప్రాజెక్ట్‌కు 21 మిలియన్ డాలర్ల మేర చెల్లింపులను రద్దు చేయడం పట్ల ఓ మీడయా ప్రతినిధి అడిగిన ప్రశ్నకు ఘాటుగా బదులిచ్చారు ట్రంప్. భారత్‌కు మేమెందుకు డబ్బులు ఇవ్వాలి..? అంటూ ఎదురు ప్రశ్న వేశారు. భారత్ వద్ద చాలా డబ్బులు ఉన్నాయి.. అని చెప్పారు.

అత్యధిక పన్నులు విధించే దేశం..

ఈ సందర్భంగా ఓ అడుగు ముందుకేశారు ట్రంప్. భారత్‌ను అత్యధిక పన్నులు విధించే దేశంగా అభివర్ణించారు. మా వరకు చూసుకుంటే ప్రపంచంలోనే అత్యధిక పన్నులను విధించే దేశాల్లో భారత్ ఒకటి.. అని తేల్చి చెప్పారు. భారత్ విధించే టారిఫ్ (పన్నులు) చాలా అధికమని, అక్కడి నుంచి తమకు వచ్చేది ఏమీ ఉండదని పేర్కొన్నారు.

భారత్ అంటే గౌరవమే..

భారత్ అన్నా, ఆ దేశ ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అన్నా తనకు ఎంతో గౌరవం అని డొనాల్డ్ ట్రంప్ ఓ ప్రశ్నకు బదులిచ్చారు. అంత మాత్రాన ఓటర్ టర్నవుట్ ఇన్ ఇండియా ప్రాజెక్ట్‌కు 21 మిలియన్ డాలర్ల మొత్తాన్ని చెల్లించాలనడం సరికాదని అభిప్రాయపడుతున్నానని అన్నారు. అందుకే దీన్ని నిలిపివేశానని పేర్కొన్నారు.

డోజ్ అధికారిక ప్రకటన..

ఇటీవలే ఈ 21 మిలియన్ డాలర్ల ప్రాజెక్ట్‌ను అమెరికా రద్దు చేసిన విషయం తెలిసిందే. యూఎస్ డిపార్ట్‌మెంట్ ఆఫ్ గవర్నమెంట్ ఎఫీషియన్సీ (డోజ్) దీన్ని రద్దు చేసింది. భారత్‌తో పాటు వివిధ ప్రాజెక్టుల కింద మరికొన్ని దేశాలకు అందజేస్తోన్న ఆర్థికపరమైన కేటాయింపులన్నింటినీ రద్దు చేసింది. అమెరికన్లు కడుతున్న పన్నులు.. ఈ రకంగా దుర్వినియోగమౌతోన్నాయని పేర్కొంది. ఈ పన్నుల దుర్వినియోగాన్ని అరికట్టడంలో భాగంగా ఈ నిర్ణయాన్ని తీసుకున్నట్లు తెలియజేసింది.

ఏ దేశానికి ఎంత..

మొజాంబిక్ 10 మిలియన్ డాలర్లు, కంబోడియాలో రెండు ప్రాజెక్టుల కింద 12 మిలియన్ డాలర్లు, ప్రేగ్ సివిల్ సొసైటీ సెంటర్- 32, సెర్బియా- 486, మొల్డొవా- 22, భారత్- 21, బంగ్లాదేశ్- 19, లైబీరియా- 1.5, నేపాల్- 19, మాలీ- 14 మిలియన్ డాలర్ల మేర నిధుల కేటాయింపులను రద్దు చేసినట్లు డోజ్ వెల్లడించింది.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+