వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ఉక్రెయిన్ వార్ ను పుతిన్ సమర్ధించుకుంటారా ? విక్టరీ డే ప్రకటనపై ఉత్కంఠ-ప్రపంచదేశాల ఆసక్తి

|
Google Oneindia TeluguNews

ఉక్రెయిన్ పై రష్యా దండయాత్ర మొదలుపెట్టి రెండునెలలు దాటిపోయినా ఇంకా ఫలితం మాత్రం తేలలేదు. రష్యాతో పాటు ఉక్రెయిన్ కూడా భారీ నష్టాలు చవిచూవిన ఈ యుద్ధం ఎప్పుడు ముగుస్తుందోనని ప్రపంచదేశాలు ఉత్కంఠగా ఎదురుచూస్తున్నాయి. ఈ నేపథ్యంలో నాజీలపై విజయానికి గుర్తుగా రష్యా ఏటా జరుపుకునే విక్టరీ డే పరేడ్ నిర్వహణకు రంగం సిద్ధమైంది. ఈ పరేడ్ లో యుద్ధానికి కారకుడైన రష్యా అధినేత పుతిన్ కీలక ప్రకటన చేయబోతున్నారు. .

రష్యా విక్టరీ డే

రష్యా విక్టరీ డే

రెండో ప్రపంచ యుద్ధంలో భాగంగా జర్మనీ నాజీలపై సోవియట్ యూనియన్ సాధించిన అద్భుత విజయానికి గుర్తుగా ఏటా రష్యాలో విక్టరీ డే పరేడ్ నిర్వహించడం ఆనవాయితీగా వస్తోంది. అయితే గతంలో జరిగిన విక్టరీ డే పరేడ్ కూ, ఈసారి జరిగే పరేడ్ కూ మధ్య చాలా వ్యత్యాసం ఉంది. ఇన్నాళ్లూ నాజీ సైన్యంపై సోవియట్ సైన్యం విజయానికి గుర్తుగా జరుపుకునే ఈ విక్టరీ డే పరేడ్.. ఈసారి ఉక్రెయిన్ పోరులో రష్యాకు ఎదురుదెబ్బలు తగులుతున్న నేపథ్యంలో ఎలా జరుగుతుందనే దానిపై ఉత్కంఠ నెలకొంది.

పుతిన్ కీలక ప్రకటన

పుతిన్ కీలక ప్రకటన

అప్పుడెప్పుడో నాజీ సైన్యాలపై సోవియట్ విజయం సంగతేమో కానీ ఇప్పుడు ఉక్రెయిన్ పై జరుపుతున్న సైనిక చర్యకు మాత్రం సమాధానం చెప్పుకోలేని స్ధితిలో రష్యా అధ్యక్షుడు పుతిన్ ఉన్నారు. ముఖ్యంగా ప్రపంచదేశాలు వారిస్తున్నా లెక్క చేయకుండా ఉక్రెయిన్ పై పోరును ప్రారంభించిన పుతిన్ ఇప్పుడు దాన్ని ఎలా ముగించాలో తెలియక మథనపడుతున్నారు. ఈ నేపథ్యంలో ఉక్రెయిన్ వార్ ను రోజురోజుకీ తీవ్రతరం చేయడం ద్వారా తమదే పైచేయి అని చాటుకునేందుకు పుతిన్ ప్రయత్నిస్తున్నారు. దీంతో ఇప్పుడు విక్టరీ డో రోజున ఉక్రెయిన్ వార్ గురించి పుతిన్ చేయబోయే వ్యాఖ్యలు కీలకంగా మారబోతున్నాయి.

ముప్పేటదాడి వేళ

ముప్పేటదాడి వేళ

ఉక్రెయిన్ పై దాడికి దిగి రెండునెలలు దాటిపోయినా ఇంకా ఫలితం తేలని యుద్ధాన్ని రష్యా ఇంకెన్నాళ్లు నడిపించబోతోందన్న ఉత్కంఠ అందరిలోనూ నెలకొంది. ముఖ్యంగా యుద్ధం ప్రారంభించిన సమయంలో ఉన్న ఆత్మవిశ్వాసం ఇప్పుడు రష్యాలో కనిపించడం లేదు. ఈ విషయం గమనించిన పాశ్చాత్య దేశాలు రష్యాతో పోరులో ప్రతిఘటన చూపుతున్న ఉక్రెయిన్ కు ఆయుధ సాయం పెంచుతున్నాయి. ఇది రష్యాను చికాకుపెడుతోంది. మరోవైపు ఆంక్షలతో రష్యా పరిస్ధితి నానాటికీ దారుణంగా తయారవుతోంది. ఈ నేపథ్యంలో పుతిన్ నిర్ణయాలు ఆధునిక రష్యా భవిష్యత్తును నిర్ణయించబోతున్నాయి.

మూడో ప్రపంచ యుద్ధం దిశగా

మూడో ప్రపంచ యుద్ధం దిశగా


ఉక్రెయిన్ తో పోరు ప్రారంభించిన రష్యాకు ఆరంభం నుంచే ఎదురుదెబ్బలు తప్పలేదు. మొదట్లో వాటిని ఖండిస్తూ వచ్చిన రష్యా అధినేత పుతిన్.. ఆ తర్వాత మాత్రం వాస్తవాన్ని అంగీరించక తప్పని పరిస్ధితి ఎదురైంది. దీంతో ఇప్పుడు ఉక్రెయిన్ లో తలుగుతున్న ఎదురుదెబ్బలకు కారణమవుతున్న పాశ్చాత్య దేశాల్ని ఆయన రోజూ తప్పుబడుతున్నారు. ఇదే పరిస్ధితి కొనసాగితే మూడో ప్రపంచయుద్ధం తప్పదని హెచ్చరికలు కూడా చేస్తున్నారు. అయినా ఆయా దేశాలు వాటిని లెక్కచేసే పరిస్ధితుల్లో లేవు. దీంతో ఇవాళ పుతిన్ దీనిపై కీలక ప్రకటన చేస్తారని అంచనా వేస్తున్నారు.

English summary
russia is intensifying attacks on north ukraine on their victory day celebrations today.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X