నోబెల్ శాంతి బహుమతి 2020 - కరోనాలో జనం ఆకలి తీర్చిన ప్రపంచ ఆహార కార్యక్రమానికే పట్టం
ఏటా ప్రపంచంలో శాంతి నెలకొల్పేందుకు వ్యక్తులు, సంస్ధలు చేసిన కృషికి ప్రతిఫలంగా ప్రకటించే నోబెల్ శాంతి పురస్కారానికి ఈ ఏడాది ఐక్యరాజ్యసమితికి చెందిన ప్రపంచ ఆహార కార్యక్రమం డబ్ల్యూఎఫ్‌పీ ఎంపికైంది. నార్వేజియన్ నోబెల్ కమిటీ ఇవాళ శాంతి పురస్కారం విజేతను ప్రకటించింది. కరోనా సమయంలో వివిధ దేశాల్లో అన్నార్తుల ఆకలి తీర్చినందుకు వరల్డ్ ఫుడ్ ప్రోగ్రామ్‌ను ఈ విశిష్ట పురస్కారానికి ఎంపిక చేసినట్లు నోబెల్ కమిటీ పేర్కొంది.
ఈ ఏడాది నోబెల్ శాంతి పురస్కారం కోసం ఏకంగా 318 మంది పోటీ పడ్డారు. ఇందులో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌తో పాటు పలువురు ప్రముఖులు, పలు అంతర్జాతీయ సంస్ధలు ఉన్నాయి. మొత్తం మీద 211 మంది వ్యక్తులు, 107 సంస్ధలు ఈ ప్రతిష్టాత్మక పురస్కారం రేసులో నిలిచాయి. ఇది నోబెల్ శాంతి పురస్కారం చరిత్రలోనే ఇది నాలుగో అతిపెద్ద పోటీ అని విశ్లేషకులు పేర్కొన్నారు.

Recommended Video
ఈ ఏడాది నోబెల్ శాంతి పురస్కారానికి ఎంపికైన ప్రపంచ ఆహార కార్యక్రమం కింద కరోనా సమయంలో ఐక్యరాజ్యసమితి తన సభ్యదేశాల్లో పేద దేశాల్లో కోట్లాది మందికి అన్నపానీయాలు అందించడం ద్వారా ఆకలి తీర్చింది. అకలి తీర్చడం కూడా శాంతికి కృషి చేయడమే అని ఈ ప్రతిష్టాత్మక పురస్కారం ప్రకటన సందర్భంగా నోబెల్ కమిటీ ప్రతినిధి పేర్కొన్నారు. కరోనా సమయంలో వివిధ దేశాల ప్రభుత్వాలతో సమన్వయం చేసుకుంటూ ప్రపంచ ఆహార కార్యక్రమం ఎంతగానో ఉపయోగపడిందని నోబెల్ కమిటీ ప్రశంసించింది.
-
రేషన్ లబ్దిదారులకు కేంద్రం గుడ్ న్యూస్- మూడు నెలల కోటా ఒకేసారి పంపిణీ -
బంగారం ధరల అంచనాలు తలకిందులు -
మేషరాశి, సింహరాశి, వృశ్చిక రాశి, ధనుస్సు రాశులకు ఏప్రిల్ నెలలో రాజయోగం -
బంగాళాఖాతంపై ఆవర్తనం- ఏపీలోని ఈ జిల్లాల్లో భారీ వర్షాలు -
తులారాశి వార్షిక ఫలం 2026-27: ఈ ఏడాది వీరికి తిరుగేలేదు.. ఈ విషయంలో జాగ్రత్త! -
త్వరలో తిరుపతి, హైదరాబాద్‌కు నేరుగా రైళ్లు: ఆ జిల్లాకు కేంద్రమంత్రి తీపికబురు! -
రామ్ చరణ్ బర్త్ డేకు బిగ్ సర్ ప్రైజ్: `పెద్ది` నుంచి -
తిరుమలలో సీఎం చంద్రబాబుకు భక్తుల స్పెషల్ రిక్వెస్ట్, అక్కడే ఆదేశాలు..!! -
మహేష్ బాబు కాకుండా ఆ హీరో అంటే చాలా ఇష్టం - కృష్ణ -
ఇరాన్ కు ట్రంప్ డెడ్ లైన్- కౌంట్ డౌన్ బిగిన్స్ -
'ధురంధర్' యలీనా గుట్టురట్టు: నిజమా.. కల్పితమా? -
ఎట్టకేలకు జీవన్ రెడ్డి చేరే పార్టీ ఖరారు, అదే బాటలో..!!












Click it and Unblock the Notifications