అమెరికాకు కాబోయే ప్రెసిడెంట్ ఎవరంటే? ప్రపంచ ఆర్ధిక వేత్త సంచలన జోస్యం..!

అగ్రరాజ్యం అమెరికాలో అధ్యక్ష ఎన్నికలపై ప్రపంచవ్యాప్తంగా చర్చ జరుగుతోంది. ప్రపంచ పెదన్నగా భావించే అమెరికాకు అధ్యక్షుడు అయితే దాదాపు ప్రపంచానికి అధ్యక్షుడు అయినట్లే అన్న భావన కూడా ఉంటుంది. దీంతో అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో ఈసారి ఎవరు గెలవబోతున్నారనే ఆసక్తి సర్వత్రా నెలకొంది. మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తో పాటు ప్రస్తుత ఉపాధ్యక్షురాలు కమలా హ్యారిస్ మధ్య జరిగే ఈ పోటీపై ఇప్పటివరకూ వచ్చిన సర్వేల్లోనూ హోరాహోరీ తప్పదని తేలిపోయింది.

ఈ నేపథ్యంలో అమెరికా అధ్యక్ష పదవి దక్కేది డొనాల్డ్ ట్రంప్ కా (donald trump) లేక కమలా హ్యారిస్ కా (Kamala Harris) అన్నది తేల్చేందుకు ఓటర్లు సిద్ధమవుతున్నవారు. అదే సమయంలో ప్రపంచవ్యాప్తంగా వివిధ రంగాలకు చెందిన ప్రముఖులు, రాజకీయ నేతలు అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో విజేతపై తమదైన రీతిలో జోస్యాలు కూడా చెప్పేస్తున్నారు. ఇదే క్రమంలో ప్రపంచ ప్రఖ్యాత ఆర్ధిక వేత్త క్రిస్టోఫ్ బరౌడ్ కూడా అమెరికా ఎన్నికల విజేతపై తన జోస్యం చెప్పేశారు.

world renowned economist Christophe Barraud s prediction on US Presidential Election winner

ఈసారి అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో గెలిచి పగ్గాలు చేపట్టేది రిపబ్లికన్ అభ్యర్ధి డొనాల్డ్ ట్రంపేనని ఆర్ధిక వేత్త క్రిస్టోఫ్ బరౌడ్ జోస్యం చెప్పారు. ఈ మేరకు ఆయన ఓ ట్వీట్ చేశారు. బెట్టింగ్ మార్కెట్‌లు, పోల్స్, ఎన్నికల మోడలర్‌ల అంచనాలు, ఆర్థిక మార్కెట్‌లు వంటి విభిన్న కొలమానాలను పరిశీలిస్తే, ప్రస్తుతానికి ట్రంప్ విజయం ఖాయమని అనిపిస్తోందని ఆయన తేల్చిచెప్పేశారు.

మార్కెట్ సెక్యూరిటీస్ మొనాకోలో చీఫ్ ఎకనామిస్ట్, స్ట్రాటజిస్ట్ గా వ్యవహరిస్తున్న క్రిస్టోఫ్ బరౌడ్.. గత 12 సంవత్సరాల్లో 11 ర్యాంకింగ్స్‌లో బ్లూమ్‌బెర్గ్ ఆర్థిక అంచనా ర్యాంకింగ్స్‌లో అగ్రస్థానంలో ఉన్నారు. 38 సంవత్సరాల బరౌడ్ కు కచ్చితంగా అంచనాలు ఇస్తారన్న ఘనమైన ట్రాక్ రికార్డు ఉంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+