ప్రపంచంలోనే అతిపెద్ద విమానం ‘మ్రియా’ను ధ్వంసం చేసిన రష్యా: ఉక్రెయిన్
కీవ్: ఐదో రోజు కూడా రష్యా. ఉక్రెయిన్‌పై వైమానిక దాడులను కొనసాగిస్తోంది. ఇప్పటికే భారీగా ప్రాణనష్టం జరిగినప్పటికీ.. రష్యా మాత్రం వెనక్కి తగ్గడం లేదు. ఉక్రెయిన్ కూడా రష్యా బలగాలను తీవ్రంగా ప్రతిఘటిస్తున్నాయి. ఇప్పటి వరకు 4500 మంది రష్యా సైనికులు మరణించారని ఉక్రెయిన్ తెలిపింది. అంతేగాక, 300లకుపైగా ఉక్రెయిన్ ప్రజలు మరణించారని తెలిపింది. ఈ మారణ హోమానికి రష్యానే బాధ్యత వహించాలని పేర్కొంది.
ప్రపంచంలోనే అతిపెద్ద ఉక్రెయిన్ విమానాన్ని ధ్వంసం చేసిన రష్యా
ప్రపంచంలోనే అతిపెద్ద విమానం 'మ్రియా'ను రష్యా.. కీవ్‌లోని ఎయిర్‌ఫీల్డ్‌లో ధ్వంసం చేసిందని ఉక్రెయిన్ ప్రభుత్వం ఆదివారం తెలిపింది. తమ భూభాగంపై రష్యా దాడిని ఎదుర్కొంటున్న ఉక్రెయిన్.. ఆంటోనోవ్ ఏఎన్225 అనే విమానాన్ని పునర్నిర్మిస్తామని ట్విట్టర్‌లో పేర్కొంది. "మేము విమానాన్ని పునర్నిర్మిస్తాము. బలమైన, స్వేచ్ఛా, ప్రజాస్వామ్య ఉక్రెయిన్ మా కలను మేము నెరవేరుస్తాము' అని ట్వీట్‌లో తెలిపింది.
తమ దేశాన్ని నాశనం చేయలేరంటూ ఉక్రెయిన్
ఉక్రెయిన్ విదేశాంగ మంత్రి డిమిట్రో కులేబా కూడా ట్విట్టర్‌లో ఈ పరిణామాన్ని ధృవీకరించారు. "రష్యా మన 'మ్రియా'ని నాశనం చేసి ఉండవచ్చు. కానీ బలమైన, స్వేచ్ఛా, ప్రజాస్వామ్య యురోపియన్ రాజ్యాన్ని వారు ఎప్పటికీ నాశనం చేయలేరు. మేము విజయం సాధిస్తాము!" అని కులేబా తెలిపారు. ఉక్రేనియన్ ఎయిర్‌క్రాఫ్ట్ తయారీదారు ఆంటోనోవ్ చేత నిర్మించబడిన, AN225 600 టన్నులు, B747-8I 448 టన్నులు, A380-800.. 548 టన్నుల బరువును డెడ్‌లిఫ్ట్ చేయగలదు. ఇది 32-వీల్ ల్యాండింగ్ సిస్టమ్‌ను కలిగి ఉంటుంది. గరిష్టంగా 4,500 కి.మీ దూరం వరకు 3,00,000 కిలోల పూర్తి ఇంధన పేలోడ్‌ను మోయగలదు. ఆంటోనోవ్, ఒక ట్వీట్‌లో, AN-225 ని నిపుణులు తనిఖీ చేసే వరకు, విమానం సాంకేతిక పరిస్థితిపై నివేదించలేమని చెప్పారు.
ఉక్రెయిన్‌పై కొనసాగుతున్న రష్యా దాడులు, మరోవైపు చర్చలు
కాగా, ఉక్రెయిన్‌తో చర్చలు జరిపేందుకు రష్యా ముందుకు వచ్చింది. దీంతో బెలారస్‌లో రష్యా, ఉక్రెయిన్ ప్రతినిధులు సోమవారం చర్చలు జరిపేందుకు సిద్ధమయ్యారు. మరోవైపు రష్యా మాత్రం దాడులు కొనసాగిస్తూనే ఉంది. ఉక్రెయిన్ రాజధాని కీవ్ తోపాటు మరో రెండు నగరాలపై రష్యా దళాలు పట్టుసాధించాయి. అయితే, ఉక్రెయిన్ బలగాలు, ప్రజల నుంచి కూడా రష్యాకు తీవ్ర ప్రతిఘటన ఎదురవుతోంది. అయినా, రష్యా బలగాలు వెనక్కి తగ్గకుండా దాడులు చేస్తోంది. ఒకవేళ ఇరు దేశాల మధ్య చర్చలు సఫలమైతే ఈ దాడులు ఆగే అవకాశం ఉంది. లేదంటే, పరిస్థితి మరింత కఠినంగా మారనుంది. అమెరికా, బ్రిటన్, నాటో ఇప్పటికే రష్యాపై ఆంక్షలను విధిస్తున్నాయి. మరోవైపు, ఉక్రెయిన్‌కు సహకారం అందిస్తున్నాయి.












Click it and Unblock the Notifications